కటాక్షం.. ఎవరికో..! | Subsidized loans for SC, ST, BC, Minorities | Sakshi
Sakshi News home page

కటాక్షం.. ఎవరికో..!

Published Mon, Dec 5 2016 10:38 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

కటాక్షం.. ఎవరికో..! - Sakshi

కటాక్షం.. ఎవరికో..!

6,973 యూనిట్లు - 60,991 దరఖాస్తులు
జిల్లాలో రుణాలకు వేలాదిగా అర్హులు
నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు
అయోమయంలో నిరుపేద  
ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, కాపులు
లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యులు, ఎంపీడీఓల కీలక పాత్ర

భాగ్యలక్ష్యి బంపర్ డ్రా..రండయ్యా రండి, ,రండమ్మా రండి..టికెట్ ధర కేవలం ఒక రూపాయే..ఆ అదృష్టవంతుడు ఎవరో తెల్లవారితే డ్రా.. సంచి తెచ్చుకోండి.. ఒక లక్ష తీసుకుపోండి అని ఒక వ్యక్తి వచ్చీ  రాని తెలుగులో చెప్పేవాడు. చాలా సంవత్సరాల క్రితం జిల్లాలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాలలో ఒక జట్కా బండి నుంచి మైక్‌లో వినిపించే మాటలు అవి. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల పరిస్థితి కూడా లాటరీ టికెట్ లాగే  మారింది, కాకపోతే అప్పుడు అదృష్టం ఉండాలి. ఇప్పుడు పాలక నేతలైన కమిటీ సభ్యుల కటాక్షం ఉండాలి. కాగా యూనిట్ల కేటారుుంపులు తక్కువగా, అర్హుల నుంచి అందిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నారుు. దీంతో ప్రస్తుతం ఈ రుణ భాగ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది ఆయా వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది.

కడప రూరల్: జిల్లాలో 2016-2017 ఆ ర్ధిక సంవత్సరానికి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాం కుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలను అందించాలి. ఆ మేరకు ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్‌లకు లక్ష్యాలను నిర్దేశించారు. అరుుతే పాలకులు నామమాత్రంగా యూనిట్లను కేటారుుస్తున్నారు. ఫలితంగా అర్హులు రుణాలు పొందలేక, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం లేక నిరాశకు లోనవుతున్నారు.

బీసీల పరిస్థితి దారుణం...
ఈ ఏడాది ప్రభుత్వ సబ్సిడీతో పాటు బ్యాంకర్లు తమ  వాటాగా ఎస్సీలకు రూ. 47 కోట్లు, ఎస్టీలకు రూ. 27.30 కోట్లు, బీసీలకు రూ. 23.04 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు రూ. 27.30 కోట్లు, కాపులకు రూ. 32 కోట్లు, మైనార్టీలకు రూ. 30.84 కోట్లు, క్రిస్టియన్‌లకు రూ. 41 లక్షలు అందించాలి. కాగా మొత్తం 6,973 యూనిట్లకు గాను గత ఏడాదిలో రుణాలు పొందగా మిగిలినవి, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులనే కలుపుకుంటే ఆన్‌లైన్‌లో 60,991 దరఖాస్తులు ఉన్నారుు. వారంతా రుణాలకు అన్ని విధాలా అర్హత గలవారే. కాగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అరుుతే బీసీలకు కేవలం 1170 యూనిట్లను కేటారుుంచగా 18,000 దరఖాస్తులు వచ్చారుు. అలాగే బీసీ ఫెడరేషన్లు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.  ఏటా నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు జరుగుతున్నారుు. దీంతో ఎక్కువ మంది అర్హులు లబ్ధి పొందలేక పోతున్నారు.

లబ్ధిదారులకు 111 గండాలు...
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అర్హుల ఎంపికకు సంబంధించి 111 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా ఎంపీడీఓలు నాన్ అఫిషియల్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో 10 మంది సభ్యులను నియమించాలి. మొన్నటి వరకు ఉన్న జన్మభూమి కమిటీల తరహాలోనే ఈ కొత్త బోర్డు కూడా ఉండబోతోందనే ఆరోపణలు వస్తున్నారుు. అరుుతే ఈ జీఓ ప్రకారం ఎంపీడీఓలు కీలకంగా మారనున్నారు. అన్ని వ్యవహారాలను ఆ అధికారి చూసుకోవడంతోపాటు ఆయా కార్పొరేషన్లకు నివేదికలను కూడా ఆయనే పంపాల్సి ఉంది. కాగా, ఈనెల 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అనంతరం జనవరి 1వ తేదీ నుంచి రుణాలను ఎంపికై న అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకర్లు బిజీబిజీగా ఉన్నారు. అందువల్ల రుణాల మంజూరుపై ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలాగే కొత్త కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఏడాది అర్హులు 111 గండాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement