Subsidized loans
-
సంక్రాంతి తర్వాత బీసీలకు ‘స్వయం ఉపాధి’!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కార్పొరేషన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,100 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దీనిపై ప్రత్యేకంగా చర్చించి సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలిసింది. ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉత్తర్వులు రాగానే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు బీసీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.దశాబ్దకాలం నుంచీ నిరీక్షణే..తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన చాలా ఏళ్లుగా అటకెక్కింది. దీనికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతూ వచ్చినా, విడుదల చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో బీసీ సబ్సిడీ రుణాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించారు. అప్పుడు దాదాపు 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ మంజూరు కాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.50వేల లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరికి మంజూరు చేసినా.. తర్వాత రుణాల పంపిణీ ఊసేలేదు. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్వయం ఉపాధి పథకాలను పట్టాలెక్కించాలని నిర్ణయించింది.స్థానిక సంస్థల ఎన్నికల ముందు..త్వరలో రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సబ్సిడీ పథకాలను తెరపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీసీ కార్పొరేషన్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా కూడా సబ్సిడీ పథకా లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంబీసీ కార్పొరేషన్ అధికారులకు సైతం పలు సూచనలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వారంలో వెలువడే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు రుణం
కరీంనగర్: ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌కు సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశంలో ట్రాన్స్‌జెండర్‌కు రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ ఆషాడం ఆశ (ఎస్సీ)కు ఫొటోగ్రఫీ యూనిట్ స్థాపన కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మరో ట్రాన్స్‌జెండర్ నక్క సింధుకు.. ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆయన అందజేశారు. -
ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): సబ్సిడీ రుణాలిప్పిస్తానంటూ వర్ధన్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో దళితుల నుంచి రూ.4 కోట్ల వరకు దండుకుని బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాడి ఉదంతమిది. తాము మోసపోయామని తెలుసుకున్న దళితులు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన తూర్పు గోదావరి జిల్లా మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి తాడేపల్లి బైపాస్ రోడ్డులో వర్ధన్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. (చదవండి: అంబేడ్కర్ విగ్రహానికి అవమానం) కేంద్ర ప్రభుత్వం గేదెల కొనుగోలు నిమిత్తం సబ్సిడీ రుణాలు ఇస్తోందని.. ముందుగా రూ.లక్ష చెల్లిస్తే వారి అకౌంట్లో రూ.1.60 లక్షలు జమ అవుతాయని నమ్మబలికాడు. రుణాలు పొందగోరే వారు ముందుగా రూ.లక్ష చొప్పున చెల్లించి సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అనేక మంది దళితులు అతడి వలలో చిక్కి మోసపోయారు. 15 రోజుల నుంచి తాడేపల్లిలోని వర్ధన్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో ఎవరూ కనిపించడం లేదని కిశోర్‌బాబు తెలిపారు. దీంతో జగతపు జాషువా గురించి ఆరా తీయగా.. అతడిపైన, అతడి కుటుంబ సభ్యులపైన మూడు రాష్ట్రాల్లో 21 కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు. అతడు ఓసారి నకిలీ పీటీ వారెంట్‌తో జైలు నుంచి తప్పించుకున్నాడని.. అంతేకాకుండా అతను చనిపోయినట్టుగా సమాజాన్ని నమ్మించి.. కొత్త ముసుగు వేసుకొని ప్రజలను మోసగిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.(చదవండి: అది టీడీపీ నేతల కుట్రే) -
బయోమెట్రిక్‌పై డైలమా!
సబ్సిడీ రుణాల ఎంపికకు నిలిపివేశామంటున్న అధికారులు ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతున్న ప్రభుత్వం నెల్లూరు(సెంట్రల్): పేదలకు ఇచ్చే సబ్సిడీ రుణాలకు సంబంధించి బయోమెట్రిక్ వాడకంపై ప్రభుత్వం డైలమాలో పడింది. 2016–17 ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాలకు తప్పకుండా బయోమెట్రిక్ వాడాలని ప్రభుత్వం ఇటీవల జీఓ 118ను విడుదల చేసింది. అయితే బయోమెట్రిక్ వినియోగంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరిగి మళ్లీ లబ్ధిదారులతో వేలిము ద్రలను తప్పకుండా వేయించే దానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయమ ని, మరోసారి తప్పకుండా వేలిముద్రలు వేయాలని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చెబుతుండడంతో అటు అధికారులు, ఇటు రుణ లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. బయోమెట్రిక్‌పై ఫిర్యాదులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలకు చెందిన వారికి ఆయా కార్పొరేషన్లకు సం బంధించి సబ్సిడీ రుణాలను 2016–17కు అందించనుంది. కాగా ఇంత వరకు ఎప్పు డూ లేనంతగా ఈ ఏడాదికి రుణాల పొందే వారికి తప్పకుండా బయోమెట్రిక్ వేయా లని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న చోట వయసు పై బడే కొద్దీ వేలిముద్ర సరిగా పడడం లేదని చాలా చోట్ల ఫిర్యాదులు కూడా అధికారులకు వస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో జాప్యం రుణ లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే చాలా జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడితే ఒక వేళ కొందరికి వేలిముద్రలు పడకపోయినట్లైతే మళ్లీ వారి స్థానంలో మరొకరని ఎంపిక చేయాలంటే చాలా ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో లబ్ధిదారులకు ఏ విధంగా బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రం ప్రస్తుతం ఆ విధానాన్ని నిలిపివేశామని చెబుతుతున్నారు. మండలాలోని ఎంపీడీఓల వద్ద నుంచి రుణ లబ్ధిదారుల పూర్తి సమాచారం వస్తే తిరిగి మళ్లీ బయోమెట్రిక్ పెట్టే యోచనలో ఉన్న ట్లు మరొకొందరు అధికారులు చెపుతుండటం గమనార్హం. దళితుల సంఘాల ఆగ్రహం ఎప్పుడూ లేని విధం గా ఈ సారి పేదలకు ఇచ్చే రుణాలకు బ యోమెట్రిక్ విధానం పెట్టడం ఏమిటని పలువురు దళిత సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిలిపివేశాం ఈ ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాల విషయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని జీఓ ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం అమలు చేయకుండా నిలిపివేశాం. తిరిగి ఎప్పుడు అమలు చేస్తామనేది పరిశీలీస్తున్నాం. వాటి వల్ల ఇబ్బందుల ఉన్నాయని పలువురు అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి ఎప్పుడు అనేది నిర్ణయిస్తాం. –రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
కటాక్షం.. ఎవరికో..!
• 6,973 యూనిట్లు - 60,991 దరఖాస్తులు • జిల్లాలో రుణాలకు వేలాదిగా అర్హులు • నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు • అయోమయంలో నిరుపేద • ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, కాపులు • లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యులు, ఎంపీడీఓల కీలక పాత్ర భాగ్యలక్ష్యి బంపర్ డ్రా..రండయ్యా రండి, ,రండమ్మా రండి..టికెట్ ధర కేవలం ఒక రూపాయే..ఆ అదృష్టవంతుడు ఎవరో తెల్లవారితే డ్రా.. సంచి తెచ్చుకోండి.. ఒక లక్ష తీసుకుపోండి అని ఒక వ్యక్తి వచ్చీ రాని తెలుగులో చెప్పేవాడు. చాలా సంవత్సరాల క్రితం జిల్లాలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాలలో ఒక జట్కా బండి నుంచి మైక్‌లో వినిపించే మాటలు అవి. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల పరిస్థితి కూడా లాటరీ టికెట్ లాగే మారింది, కాకపోతే అప్పుడు అదృష్టం ఉండాలి. ఇప్పుడు పాలక నేతలైన కమిటీ సభ్యుల కటాక్షం ఉండాలి. కాగా యూనిట్ల కేటారుుంపులు తక్కువగా, అర్హుల నుంచి అందిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నారుు. దీంతో ప్రస్తుతం ఈ రుణ భాగ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది ఆయా వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది. కడప రూరల్: జిల్లాలో 2016-2017 ఆ ర్ధిక సంవత్సరానికి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాం కుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలను అందించాలి. ఆ మేరకు ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు లక్ష్యాలను నిర్దేశించారు. అరుుతే పాలకులు నామమాత్రంగా యూనిట్లను కేటారుుస్తున్నారు. ఫలితంగా అర్హులు రుణాలు పొందలేక, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం లేక నిరాశకు లోనవుతున్నారు. బీసీల పరిస్థితి దారుణం... ఈ ఏడాది ప్రభుత్వ సబ్సిడీతో పాటు బ్యాంకర్లు తమ వాటాగా ఎస్సీలకు రూ. 47 కోట్లు, ఎస్టీలకు రూ. 27.30 కోట్లు, బీసీలకు రూ. 23.04 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు రూ. 27.30 కోట్లు, కాపులకు రూ. 32 కోట్లు, మైనార్టీలకు రూ. 30.84 కోట్లు, క్రిస్టియన్లకు రూ. 41 లక్షలు అందించాలి. కాగా మొత్తం 6,973 యూనిట్లకు గాను గత ఏడాదిలో రుణాలు పొందగా మిగిలినవి, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులనే కలుపుకుంటే ఆన్లైన్లో 60,991 దరఖాస్తులు ఉన్నారుు. వారంతా రుణాలకు అన్ని విధాలా అర్హత గలవారే. కాగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అరుుతే బీసీలకు కేవలం 1170 యూనిట్లను కేటారుుంచగా 18,000 దరఖాస్తులు వచ్చారుు. అలాగే బీసీ ఫెడరేషన్లు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏటా నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు జరుగుతున్నారుు. దీంతో ఎక్కువ మంది అర్హులు లబ్ధి పొందలేక పోతున్నారు. లబ్ధిదారులకు 111 గండాలు... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అర్హుల ఎంపికకు సంబంధించి 111 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా ఎంపీడీఓలు నాన్ అఫిషియల్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో 10 మంది సభ్యులను నియమించాలి. మొన్నటి వరకు ఉన్న జన్మభూమి కమిటీల తరహాలోనే ఈ కొత్త బోర్డు కూడా ఉండబోతోందనే ఆరోపణలు వస్తున్నారుు. అరుుతే ఈ జీఓ ప్రకారం ఎంపీడీఓలు కీలకంగా మారనున్నారు. అన్ని వ్యవహారాలను ఆ అధికారి చూసుకోవడంతోపాటు ఆయా కార్పొరేషన్లకు నివేదికలను కూడా ఆయనే పంపాల్సి ఉంది. కాగా, ఈనెల 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అనంతరం జనవరి 1వ తేదీ నుంచి రుణాలను ఎంపికై న అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకర్లు బిజీబిజీగా ఉన్నారు. అందువల్ల రుణాల మంజూరుపై ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలాగే కొత్త కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఏడాది అర్హులు 111 గండాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ!
నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అరకొరగా ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడంతో చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. దీంత యువత ఆందోళన చెందుతోంది. కొంతమంది చిన్నచిన్న దుకాణాలను పెట్టుకొని బతుకుబండిని నడపాలని చూస్తున్నారు. సబ్సిడీ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉండడం.. ఒక్క యూనిట్ కోసం పది మందికి పైగా పోటీపడుతున్నారు. మరో వైపు టీడీపీ కార్యకర్తల పెత్తనం అధికమైందనే విమర్శలు వస్తున్నాయి. సాదాసీదా పని నుంచి సబ్సిడీ రుణాల వరకూ అన్నీ జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే జరుగుతుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. రాజాం(సంతకవిటి): వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఎక్కడ తమకు రుణం మంజూరు కాదేమోనని లబ్ధిదారులు దిగులు చెందుతున్నారు. సబ్సిడీ రుణాల మంజూరు విషయంలో కూడా జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం ఉండడంతో అర్హులైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బినామీ లబ్ధిదారులతో దరఖాస్తులు చేయించడంతో వీటి సంఖ్య ఎక్కువగా ఉండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఒక యూనిట్‌కు పది నుంచి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రుణాలకు ఇలా.. ఎస్టీ సబ్సిడీ రుణాల కోసం ఇటీవల దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 252 యూనిట్లు కేటాయించగా ఈ నెల 24వ తేదీ వరకూ 5,511 దరఖాస్తులు అన్ని మండల కార్యాలయూలకు చేరాయి. వీటిలో 508 మంది నేరుగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా, మిగిలిన 428 ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. బీసీ రుణాలకు తీవ్ర పోటీ బీసీ రుణాల కోసం కూడా దరఖాస్తులు అధికంగానే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 1800 యూనిట్లు మంజూరవ్వగా.. వీటి కోసం 21,432 మంది పోటీ పడుతున్నారు. వీటిలో 21,405 మందిదరఖాస్తు చేసుకోగా, మిగిలినవి ఎంపీడీఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఎస్సీ రుణాల కోసం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరయ్యే సబ్సిడీ రుణాల కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉంది. 1027 యూనిట్లు జిల్లాకు మంజూరవ్వగా వీటి నిమిత్తం సోమవారం నాటికి 7,874 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,859 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోగా, ఎంపీడీఓ కార్యాలయాల నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు... కాపు సబ్సిడీ రుణాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1147 వ్యక్తిగత యూనిట్లు మాత్రమే కాపు కార్పోరేషన్ మంజూరు చేయగా వెలమ, బలిజ తదితర కాపు జాతులకు చెందిన నిరుద్యోగులు 7002 మంది చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జన్మభూమి కమిటీల ప్రభావం గతంలో సబ్సిడీ రుణాలు బ్యాంకు మేనేజర్ల విల్లింగ్తో అధికారులు లబ్ధిదారులుకు ఇచ్చేవారు. రుణాలు కూడా సకాలంలో మంజూరయ్యేవి. ప్రస్తుతం వీటి పరిస్థితి మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి కూడా మండల స్థాయిలో జన్మభూమి కమిటీల ఆమోదం అవసమైంది. బ్యాంకు మేనేజర్లు సైతం కమిటీల కనుసన్నల్లోనే ఉన్నారు. ఫలితంగా చాలాచోట్ల కమిటీలు పలువురు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను తెరపైకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి దరఖాస్తు చేసినప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యే వరకూ మొత్తం బాధ్యత కమిటీ సభ్యులు బినాబీలుగా వ్యవహరించి తీసుకుంటారనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రుణం మాత్రమే బ్యాంకు నుంచి లబ్దిదారునికి చెక్ రూపంలో అందుతుంది. అనంతరం ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ రుణాలను కమిటీసభ్యులు, లబ్ధిదారులు పంచుకుంటారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగి ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నిధుల విడుదలలో మమః అనిపిస్తున్నారు!
సాక్షి,సిటీబూరో: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు . మచ్చుకు కొన్ని నిధులను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దూలుపుకోవడంంతో లబ్ధిదారులు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా ఏటా బ్యాంకు లింకేజి సబ్సిడీ రుణాలల్లో భాగంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను హైదారాబాద్– రంగారెడ్డి జిల్లాల్లోని బీసీ కార్పొరేషన్ల పరిధిలో 3,029 యూనిట్లకు రూ.23.42 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అధికారయంత్రాంగం ఫిబ్రవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం 820 యూనిట్లకుగాను రూ. 5.87 కోట్లు విడుదల చేసింది. మిగతా 2,209 యూనిట్లకు సంబంధించి రూ. 17.55 కోట్లు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు రెండు వారాలుగా బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో తమకు సబ్సిడి రుణాలు వస్తాయో ..రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. – మిగతా కార్పొరేషన్లు అంతే ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ సబ్సిడి రుణాల పరిస్థితి అలాగే ఉంది. ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం సగం నిధులు మాత్రమే విడుదల చేయటంతో లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి కల్పనలో భాగంగా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ 1581 యూనిట్లకు గానూ రూ.21 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, 1225 యూనిట్లకు గానూ రూ.17.86 కోట్లు విడుదల చేసింది. మిగతా 356 యూనిట్లకు గానూ రూ. 3.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు సంబంధించి 73 యూనిట్లకు గానూ 67 యూనిట్లకు మాత్రమే రూ. 1.10 లక్షలు విడుదలయ్యాయి. వికలాంగుల సంక్షేమ శాఖకు 76 యూనిట్లకు గానూ 22 యూనిట్లకు రూ.19 లక్షలు విడుదలయ్యాయి. -
రుణాలు గోవిందా!
♦ లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో ♦ అప్లోడ్ చేయడంలో ఆలస్యం ♦ వైబ్‌సైట్‌ను మూసివేసిన సర్కారు ♦ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ♦ మంజూరుకు నోచుకోని రూ. 2 లక్షలపై విలువ యూనిట్లు ♦ 271 మంది లబ్ధిదారులకు మొండిచేరుు ♦ వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించాలి : ఉన్నతాధికారులు ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తున్న నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి నాలుగు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల్లో భారీ సం ఖ్యలో రుణాల కోసం దరఖాస్తులు వచ్చారుు. ప్రధానంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు యూ నిట్ల కోసం ఒక్క రుణానికి ఇద్దరు చొప్పున పోటీ పడ్డారు. అయితే తొలుత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఎంపిక చేసి మార్చి 28న కలెక్టర్ కార్యాలయంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్లో 212 మంది, బీసీ కార్పొరేషన్లో 59 మంది, మొత్తం కలిపి 271 మందిని ఎంపిక చేశారు. జాబితాను కూడా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ తో కాగితాలపై అప్రూవల్ చేయించిన ఎస్సీ, బీసీ కా ర్పొరేషన్ అధికారులు ప్రభుత్వం రుణాలు మం జూ రు చేసేందుకు ఏర్పాటు చేసిన (ఆన్లైన్ మం జూ రుకు సంబంధించిన) వెబ్సైట్లో లబ్ధిదారుల వివరా లు నమోదు చేయడం జాప్యం చేశారు. అయితే ప్రభుత్వం ఏప్రిల్ 21న వెబ్‌సైట్‌ను క్లోజ్ చే సింది. ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తెరి స్తేగాని రుణాల మంజూరు సాధ్యపడదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం చెయ్యాలో అర్థం కాక, రుణాలు మంజూరు కాకపోతే లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో రుణాలకు రాయితీ ఇస్తున్నందుకు పోటీ పెరిగింది. అర్హులను గుర్తించడానికి అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేసి ఎంపిక పక్రియ పూర్తి చేశారు. కానీ ఆ తరువాత కా ర్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆన్లైన్ మం జూరుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్సైట్లో వెంట వెంటనే వివరాలు అప్లోడ్ చేయడంలో జాప్యం చేశారు. ఒక పక్క కలెక్టర్ యోగితారాణా పారదర్శకంగా రుణాలు అర్హులకు అందించడానికి చర్యలు చేపడితే, మరో పక్క అధికారులు జాప్యాన్ని ప్రదర్శిం చి రుణాలకు ఎసరు తెచ్చారు. అదేవిధంగా రుణాలను అందించడానికి సంబంధిత శాఖల అధికారులు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు కొంత కాలంగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వేరే శాఖలకు చెందిన అధికారు లు ఇన్‌చార్జీలుగా పని చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. వెబ్సైట్ తెరిస్తేనే ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మంజూరు వెబ్‌సైట్‌ను మళ్లీ తెరిచే అవకాశాలు కనపించడం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆశలు కలుగుతున్నాయి. అదేంటంటే నిజామాబాద్ జిల్లాతోపా టు కరీంనగర్,ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే విధంగా జరిగింది. లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ మంజూరు కోసం అప్లోడ్ చేయలేదు. నాలుగు జిల్లాల ఉన్నతాధికారు లు కలిసి సర్కారుపై ఒత్తిడి తెస్తే వెబ్‌సైట్‌ను తిరిగి పునఃప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల అధికారులు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల అధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇంత వరకు వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. -
అంతా మాయే!
బీసీ సబ్సిడీ రుణాల మంజూరులో సర్కారు లబ్ధిదారులను మాయ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఓ వైపు ప్రకటనలు గుప్పిస్తూ మరోవైపు నెలల తరబడి తిప్పుకుంటోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారులకు రుణాలు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నాయి. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలోని పేద బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గతేడాది సెప్టంబరులో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని 10 నెలలు గడుస్తున్నా రుణాలు మాత్రం మంజూరు కాలేదు. సర్కారు పెట్టిన ఆంక్షలకు తలొగ్గి ఏడాదిగా అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ జేబులకు చిల్లు చేసుకుంటున్నా ఫలితం దక్కడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరికే రుణాలు జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4281 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 7,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 33 41 మందికి మాత్రమే రుణాలు ఇచ్చా రు. గతేడాదికి సంబంధించి ఇంకా 940 మందికి రుణాలు ఇవ్వలేదు. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ 3235 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 9,785 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 905 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఇంకా 2,330 మందికి రుణాలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. 645మందికే కాపు కార్పొరేషన్ రుణాలు కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో 5 వేల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 12875 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 645 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు రుణాలు అందజేసి ఆదుకుంటామన్న సర్కారు ఆచరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. దరఖాస్తులను పరిశీలించి పంపుతున్నాం బీసీ, కాపు కార్పొరేషన్‌కు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిశీలించి కార్యాలయంలో పెండింగ్ లేకుండా పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి రుణాలకు సంబంధించిన సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకుల్లో పడాల్సి ఉంది. గత ఏడాది పెండింగ్‌లో ఉన్న రుణాల మంజూరు విషయాన్ని ఉన్నతాధికారు దృష్టికి తీసుకువెళుతాం. -వెంకటస్వామి, ఈడీ, బీసీ కార్పొరేషన్ -
సబ్సిడీ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చే యాలి
సూర్యాపేట రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసే సబ్సిడీ రుణాలు సకాలంలో గ్రౌండింగ్ చేయాలని లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జాయింట్మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ నెలకొల్పే లబ్ధిదారులకు మాత్రమే రుణం మంజూరు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు 15 శాతం రుణాలు అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సీజన్‌కు గాను రైతులకు రూ.1400 కోట్ల రుణాలు అందజేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం ద్వారా రెండో విడత 2015-16 సంవత్సరానికి గాను 25 శాతం నగదులో సగాన్ని జూన్ నెలలో, సగం జూలై నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. 2014-15 సంవత్సరంలో ఐకేపీ ద్వారా సమభావన సంఘాలకు ఇప్పటివరకు రూ.493 కోట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. సమభావ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం లేదని, మండలస్థాయిలో రికవరీ టీంలు ఏర్పాటు చేసుకోనిన రుణాలు రికవరీ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ జే.కృష్ణమూర్తి, డీపీఎంయూ యాంకర్‌పర్సన్ రమణ, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డితో పాటు వివిధ మండలాల ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఏఓలు, ఏపీఎంలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
సకాలంలో రుణాలు మంజూరు చేయండి
- కలెక్టర్ జానకి నెల్లూరు(రెవెన్యూ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 20వ తేదీ లోపు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి బ్యాంక్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాలన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ పొందిన మహిళా పారిశ్రామికవేత్తల కు రుణాలు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిన లబ్ధిదారుల అకౌంట్ నంబర్లు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులందరికీ రూపేకార్డులు అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.5 వేలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి 20 లీటర్ల నీటని రూ.2కు అందించేందు కు ముందుకు వచ్చిన వారికి రూ.3.5 నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయాం కల్పించాలన్నారు. రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకర్లు నియమించిన వ్యాపార ప్రతినిధులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారన్నారు. బ్యాంక్ మిత్రలను వెంకటాచలంలోని శిక్షణ కేంద్రానికి పంపించాలన్నారు. ప్రధాన మంత్రి జనధనయోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభించిన లబ్ధిదారులు ఆరు నెలల పాటు లావాదేవీలు కొనసాగించి ఉండాలన్నారు. సిండికేట్ బ్యాంక్ ఆర్ఎం శ్రీకృష్ణ, ఆంధ్రాబ్యాంక్ ఆర్ఎం సురేంద్రనాథ్, డీఆర్డీఎ పీడీ చంద్రమౌళి పాల్గొన్నారు. -
తమ్ముళ్ల మధ్య చిచ్చురేపిన సబ్సిడీ రుణాలు
ఏకపక్ష ఎంపికపై అధికార పార్టీలోనూ అంతర్గత పోరు సబ్సిడీ రుణాల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఉదయగిరి: ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికార టీడీపీ స్క్రీనింగ్ కమిటీ పేరుతో తమ వారికే లబ్ధి చేకూరేలా తీసుకున్న నిర్ణయంలో ఆ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉండటం, సబ్సిడీ అధికంగా ఉండటంతో వీటిని దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీలో హవా నడుస్తున్న వారిదే పైచేయి కావడంతో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీకార్పొరేషన్ ద్వారా విడుదలయ్యే సబ్సిడీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. గురువారం నుంచి జిల్లాలో బీసీలు మైనార్టీలు, ఐటీడీఏకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.16 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.25 కోట్లు సబ్సిడీ రుణాలకు లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒక్కొక్క యూనిట్‌కు సబ్సిడీ 50-60 శాతం ఉండటంతో వీటి కోసం పోటీ తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లనే సూచించడంతో అర్హులైన అనేక మంది నిరాశకు గురయ్యారు. దీంతో టీడీపీలోనే తీవ్ర అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. వరికుంటపాడు మండలంలో ఎస్సీ లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని అదే పార్టీకి చెందిన ఎస్సీ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న స్క్రీనింగ్ కమిటీలో సభ్యులు ఎస్సీ, ఎస్టీలు కాకుండా ఇతర కులాలు ఉండటం ఏమిటని టీడీపీకి చెందిన ఎస్సీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన కమిటీల్లో ఒక్క ఎస్సీ, ఎస్టీ సభ్యుడు కూడా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీ రుణాల ఎంపికలో కూడా అదేబాట బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన రుణాల ఎంపికలోనూ స్క్రీనింగ్ కమిటీదే పైచేయి కానుంది. ఈ కమిటీలో కూడా సభ్యులుగా ఓసీలు ఉండటం పట్ల టీడీపీకి చెందిన బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మా రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఓసీల పెత్తనం ఏమిటని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ రుణాల ఎంపికలో సభ్యులుగా ఎంపీడీఓ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, బ్యాంకర్లు ఉన్నప్పటికీ వారి మాట చెల్లుబాటు కాకపోవడం పట్ల పలువురు బ్యాంకు అధికారులు కూడా ఈ కమిటీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బ్యాంకుల్లో క్రమ శిక్షణతో ఆర్థిక లావాదేవీలు నడిపే వారికి రుణాలు ఇవ్వాలని తాము సూచిస్తున్నప్పటికీ, లబ్ధిదారులుగా టీడీపీకి చెందిన కార్యకర్తల పేర్లనే సూచిస్తూ వీటినే కచ్చితంగా ఎంపిక చేయాలని పట్టుబట్టడం బ్యాంకర్లకు కూడా తొలనొప్పిగా మారింది. దీంతో పలువురు బ్యాంకర్లు కూడా కమిటీ సమావేశాలకు సక్రమంగా పాల్గొనలేదు. పైగా కమిటీలు సూచించిన లబ్ధిదారుల్లో చాలా మంది డిఫాల్టర్లుగా ఉన్నారు. వీరికి సబ్సిడీ మంజూరైనా నిబంధనల మేరకు గ్రౌండింగ్ సమయంలో రుణాలు మంజూరు చేయడం కష్టంగా మారుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. స్క్రీనింగ్ కమిటీల ఎంపికపై హైకోర్టులో పిటిషన్ చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీ పేరుతో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను నియమించడంపై రాయలసీమకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఈ రుణాల ఎంపికలో ప్రభుత్వ కమిటీల జోక్యం అవసరం ఎందుకో వివరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసింది. కమిటీల నియామకంలో ప్రభుత్వ జోక్యంపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కమిటీలు ఎంపిక చేసిన జాబితాపై కూడా అధికారుల్లో ఓ రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. కమిటీల ఎంపికపై హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చని అధికారులు సైతం భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను స్క్రీనింగ్ కమిటీ పేరుతో నియమించి పచ్చ చొక్కాలకే ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించడంపై ప్రతి పక్షాలతోనే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడం గమనార్హం. -
యువశక్తి నిర్వీర్యం
‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన 100 మంది యువకులను అప్పగిస్తే ఈ దేశగతినే మార్చేస్తా’ స్వామి వివేకానందుడు అన్న మాటలు ఇవి.. ప్రభుత్వాలు చేయూత ఇవ్వకపోవడంతో అటువంటి యువశక్తి నిర్వీర్యమైపోతోంది. సాక్షి కడప :ప్రతి యేడాది నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీపై రుణాలను అందించి స్వయం ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. మేలో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి. యువతకు పెద్దపీట వేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ఊదరగొట్టిన బాబు.. అధికారంలోకి వచ్చాక అన్నింటినీ విస్మరించారు. నిరుద్యోగభృతి, ఇంటింటికి ఉద్యోగంతో పాటు మరెన్నో చేస్తామన్నా.. ఇంతవరకూ ఏవీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని యువత నిరుత్సాహంతో ఉంది. ఈ యేడాదికి లేనట్టే.. 2014-15 యేడాదికి సంబంధించి యువశక్తి యూనిట్లు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. 2014 జూన్ నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినా.. యువత ఉపాధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. 2014 మార్చి నాటి నుంచి 2015 మార్చి వరకు యేడాదిగా పరిగణిస్తారు. ఇప్పటికే దాదాపు పుణ్యకాలం కాస్తా గడిచిపోవడంతో ఈ యేడాది రుణాలు మంజూరు కావడం అనుమానమేనని భావిస్తున్నారు. పేరుమారినా.. కనిపించని మార్పు.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల పేర్లపై ఉన్న పథకాలపై దృష్టి సారించింది. అవే పథకాలను కొనసాగిస్తూ పేర్లను మాత్రం మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. పలు పథకాలకు ఎన్టీఆర్ భరోసా, సుజల స్రవంతి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేర్లుగా మార్పు చేసింది. అదే విధంగా రాజీవ్ యువశక్తి పథకాన్ని తిరిగి సీఎంఈవై పథకంగా పేరుమార్చారు. పేరు మార్చి దాదాపు మూడు నెలలయినా ఇంత వరకు నిరుద్యోగులకు అవసరమైన రుణాలు, సబ్సీడీల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదు. 2014-15కు 380 యూనిట్లు అవసరం.. 2014-15 సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగులకు 380 యూనిట్లు అవసరమని.. ఇందుకు రూ. 3.80 కోట్లు కావాలని స్టెప్ కార్యాలయం ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించడానికి బ్యాంకర్ల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. అయితే యువశక్తి రుణాలపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందే తప్ప మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వలేదు. 2013-14కు సంబంధించి రాజీవ్ యువశక్తి పథకం కింద 296 యూనిట్లకు రూ. 2.96 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రస్థాయిలో పలుమార్లు మొదటిస్థానంలో నిలిచింది. యువకులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి జిల్లాలో స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలు లేక యువశక్తి నీరసించి పోతోంది. స్టెప్ సీఈఓ మమత ఏమంటున్నారంటే.. ఈ యేడాదికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సబ్సిడీ విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాకు కేటాయింపులు వస్తే నిరుద్యోగులకు యూనిట్లను మంజూరు చేసి ఉపాధికి పెద్దపీట వేస్తాం. -
ఎస్సీ, ఎస్టీరుణాలు ఎక్కడ?
ఒంగోలు టౌన్ : ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2013-2014 ఏడాదికి సబ్సిడీ రుణాలు అందించాలని.. జీఓ నం 101ని సవరించి అర్హులైన వారందరికీ బ్యాంకు అనుమతి లేని రుణాలు ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాఘవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ 27వేల 28 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సి ఉందని వివరించారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 786 మందికి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 486మందికి రుణాలు ఇవ్వాలని చెప్పారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థారుు అధికారులు పంపించిన అర్జీలను ఉన్నతాధికారులు తిరిగి వెనక్కు పంపించడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టంలో భాగంగా 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చినా బిల్లులు కట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు వెంగళరావు, మాలమహానాడు నాయకుడు దాసరి శివాజీ తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
సబ్సిడీ రుణాలపై కమిటీల వేటు!
ఎన్నికల ముందు అడ్డగోలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన అనంతరం వాటిని నెరవేర్చలేక రకరకాల కమిటీల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్ల ఎంపికలో జన్మభూమి పేరిట కమిటీలు ఏర్పాటుచేసి తెలుగు తమ్ముళ్లకు పెత్తనం కట్టబెట్టారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ కింద బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం అందజేసే సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికకు కూడా ప్రతి మండలానికి ముగ్గురు తెలుగు తమ్ముళ్లతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు తమ పార్టీకి చెందిన వారికే పచ్చజెండా ఊపే అవకాశం ఉండటంతో కొందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఉదయగిరి: జిల్లాలో ఈ నెల మొదటి వారంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం లబ్ధిదారులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుందని మొదట ప్రకటించినప్పటికీ దీనిని మళ్లీ ఈ నెల 25వరకు పొడిగించారు. ఈ రుణాలకు సబ్సిడీ 50-60 శాతం ఉండటంతో అనేకమంది ఔత్సాహికులు రుణాలు పొందేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మండల పరిషత్కార్యాలయాలకు దరఖాస్తులందాయి. మరో వారం రోజులు గడువు ఉండటంతో ప్రస్తుతం అందినవాటికంటే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.100 కోట్లకు పైగా రుణాలు అందజేయనున్నారు. గతంలోకంటే ఈసారి సబ్సిడీ కూడా 50 శాతం పైబడి ఉండటంతో ఈ రుణాల కోసం పోటీ కూడా తీవ్రంగా ఉండనుంది. లబ్ధిదారుల ఎంపిక మండల పరిషత్‌కు అందిన దరఖాస్తులను బ్యాంకర్లు, ఎంపీడీఓ, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పరిశీలించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయనున్నారు. ఈ కమిటీలో మండలాధ్యక్షుడికి కూడా చోటు కల్పించలేదు. పైగా స్క్రీనింగ్ కమిటీలో ముగ్గురు జిల్లా ఇన్చార్జి మంత్రిచే నియమించబడిన అధికార పార్టీ సభ్యులు ఉంటారు. వీరు చెప్పిందే ఈ ఎంపికలో చెల్లుబాటయ్యే అవకాశముంది. గతంలో లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్లు, ఎంపీడీఓలకు ప్రాధాన్యం ఉండేది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ రావడంతో వీరు కేవలం ప్రేక్షకపాత్ర వహించే అవకాశం మాత్రమే ఉంది. ఈ పరిణామం బ్యాంకర్లకు కూడా తలనొప్పిగా మారనుంది. స్క్రీనింగ్ కమి టీ సభ్యులు తమకు ఇష్టమొచ్చిన వారి పేర్లను సూచించే అవకాశం ఉండటంతో అలాంటివారు బ్యాంకుతో సక్రమమైన లావాదేవీలు లేకపోతే ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామం రుణాల గ్రౌండింగ్‌కే ఇబ్బంది తలెత్తవ చ్చు. అయితే ప్రభుత్వం మాత్రం 50- 60 శాతం సబ్సిడీ ఇస్తున్నందున బ్యాంకర్లు ఇచ్చేది కొద్దిపాటి రుణమే కాబట్టి తమ కమిటీ సభ్యులు సూచించిన లబ్ధిదారులనే ఎంపికచేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అధిక సంఖ్యలో దరఖాస్తులు ఈ సబ్సిడీ రుణాలు మండలానికి ఒక్కో కేటగిరికి పదుల సంఖ్యలోనే యూనిట్లు మంజూరయ్యాయి. కానీ వీటికోసం దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తున్నాయి. ఒక్కొక్క దరఖాస్తుదారుడు ప్రభుత్వం నిర్దేశించిన వివిధ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు రూ.500 పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో మండలానికి అన్ని కేటగిరీలు కలుపుకుని వంద యూనిట్లు మంజూరైతే, దరఖాస్తులు మాత్రం వేల సంఖ్యలో రావటం విశేషం. అంటే అనేకమంది పెద్ద మొత్తంలో ఖర్చుచేసి దరఖాస్తులు అందజేసినా స్క్రీనింగ్ కమిటీలదే పెత్తనం కావడంతో అర్హులకు కూడా రుణాలు అందే అవకాశం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయడంపై ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్క్రీనింగ్ కమిటీలు రద్దు చేయాలి : ప్రభుత్వం సబ్సిడీ రుణాల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ పేరుతో టీడీపీ నేతలను ఎంపిక చేయడం దారుణం. దీనిద్వారా అర్హులకు అన్యా యం జరిగే అవకాశముంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. గతంలో మాదిరి బ్యాంకర్లు, ఎంపీడీఓలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలి. స్క్రీనింగ్ కమిటీలను రద్దు చేయాలి. -చేజర్ల సుబ్బారెడ్డి, ఎంపీపీ, ఉదయగిరి కార్పొరేషన్ రుణాలపై రాజకీయ జోక్యం తగదు: ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ లబ్ధిదారులకు అందజేసే సబ్సిడీ రుణాల ఎంపికలో రాజకీయ కమిటీలకు తావివ్వరాదు. ఇలా అవకాశమిస్తే కేవలం అధికారపార్టీకి చెందిన వారికే రుణాలు దక్కే అవకాశముంది. ఈ విధానం గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వం సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో తీసుకున్న ఈ వివాదాస్పద కమిటీలు రద్దు చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి. - చిన్నయ్య, మాజీ సర్పంచ్, తెడ్డుపాడు -
ఎదురు చూపు
కడప రూరల్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సబ్సిడీ రుణాల లక్ష్యాలను విధించింది. నాడు సబ్సిడీ నామమాత్రంగా విడుదల కావడంతో అతి కొద్దిమంది మాత్రమే రుణాలు పొందగలిగారు. అంతలోపే ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణ కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అరకొరగా అందిన రుణాలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1284 యూనిట్లకు గానూ ప్రభుత్వ సబ్సిడీ రూ.9 కోట్లు అవసరం కాగా, రూ.3.81 కోట్లు విడుదల కావడంతో 656 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1119 యూనిట్లకు గానూ రూ.4.54 కోట్లు అవసరం కాగా, రూ.3.02 కోట్లు విడుదల కావడంతో 776 మంది రుణాలు పొందగలిగారు. ఎస్టీ, బీసీల పరిస్థితి దారుణం గిరిజన సంక్షేమశాఖ ద్వారా 194 యూనిట్లకు గానూ రూ.138 కోట్లు అవసరం కాగా, ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవంతో ఎవరూ రుణాలు పొందలేకపోయారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.3134 యూనిట్లకు గానూ రూ.940 కోట్లు అవసరం. అయితే, ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడంతో ఒక్కరు కూడా రుణం పొందలేకపోయారు. 101 కష్టాలను ఎదుర్కొని... గడిచిన ఆర్థిక సంవత్సరంలో రుణ మంజూరుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. బ్యాంకు లింకేజీ కింద ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో సబ్సిడీ నేరుగా తమ ఖాతాల్లో పడుతుందని లబ్ధిదారులు ఆశ పడ్డారు. ఈ తరుణంలోనే రుణాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం గుదిబండ లాంటి 101 జీఓను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం వయసు నిబంధనను విధించారు. రేషన్, ఆధార్ కార్డులను తప్పనిసరి చేశారు. ఫలితంగా అర్హులైన ఎంతోమంది జీఓ కారణంగా అనర్హులుగా మిగిలారు. మిగిలిన కొంతమంది రుణ అర్హత పొందారు. ప్రభుత్వం నామమాత్రంగా సబ్సిడీని మంజూరు చేయడంతో అతికొద్ది మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. అంతలోపే ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌కు కొత్త లక్ష్యాలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. 1994 బ్యాంకు లింకేజీ యూనిట్లను 1950 మందికి అందజేయాలని సూచించారు. అందులో ప్రభుత్వ సబ్సిడీ వాటా రూ. 12.26 కోట్ల మేర ఉంది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం! 2013-14లో రుణాలకు అర్హులైన వారి వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం సబ్సిడీని మంజూరు చేస్తే, మిగిలిన వారికి కూడా రుణాల మంజూరుకు మార్గం సుగమమవుతుంది. - ఎస్.ప్రతిభా భారతి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ 2013-14లో ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందిన వారి వివరాలు కార్పొరేషన్ యూనిట్లు రుణాలు పొందిన సబ్సిడీ అవసరం మంజూరైన సబ్సిడీ లబ్ధిదారులు (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) ఎస్సీ 1284 656 9.00 3.81 ఎస్టీ 194 -- 1.38 -- బీసీ 3134 -- 9.40 మైనార్టీ 1119 776 4.54 3.06 మొత్తం 5731 1432 24.32 6.83 -
సంక్షేమం చిరునామా ఏది?
సబ్సిడీ రుణాల్లో వడపోత తెలుగు తమ్ముళ్లకే కమిటీ బాధ్యతలు ఎస్సీ, బీసీల సంక్షేమానికి తూట్లు గుడ్లవల్లేరు : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా తెలుగు తమ్ముళ్ల కనికరం పైనే‘ఆధార’పడి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా వారిదయ తప్పనిసరి అవుతోంది. సంక్షేమ కార్పొరేషన్లలో సబ్సిడీ రుణాల్ని పొందాలనుకునే ఈ వర్గాల వారు ప్రభుత్వం విధించిన అర్థంపర్థంలేని నిబంధనలతో నానాఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో లోను మంజూరైనప్పటికీ... పంచాయతీల స్థాయిలో ఇటీవల ప్రభుత్వ పింఛన్లను వడపోసిన కమిటీల వారే ఈ సంక్షేమ రుణాల జాబితాను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకొచ్చే కార్యకర్తలు పాత జాబితాలో ఉంటేనే సబ్సిడీ రుణాలు మంజూరవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. జిల్లాకు చేరని రూ.23కోట్ల సబ్సిడీలు... జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలని గత అక్టోబరులో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేసి జిల్లాలో 2,108మందికి రుణాలు మంజూరు చేశారు. అయితే యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు కావాల్సిన రూ.11కోట్ల సబ్సిడీలు జిల్లాకు చేరలేదు. బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీలుగా రూ.12కోట్లు ఇవ్వాలి. వీటి కోసం 1,800మంది బీసీలు ఎదురు చూస్తూ... దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. డీడీలు, డాక్యుమెంట్ల పేరిట వారు వేలాది రూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. అయితే రుణాలు చేతికి రాకపోగా... కొత్తగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మంజూరైన అర్హుల జాబితాల వడబోత కార్యక్రమాన్ని చేపట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా మంజూరైన జాబితాల్లో వున్నవారు అర్హులైతే గ్రామస్థాయి కమిటీల వారు గుర్తించి, తమకు పంపుతారన్నారు. వడ్డీ చెల్లించమంటున్నారు... గతేడాది రూ.80వేల రుణం బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైంది. అందులో రూ.40వేలను బ్యాంకు వాటా కింద నా ఖాతాలో బ్యాంకు వారు వేశారు. సబ్సిడీ రూ.40వేలు ఈ రోజు వరకూ రాలేదు. బ్యాంకు మేనేజరు మాత్రం నా ఖాతాలో వేసిన రూ.40వేలకు వేలల్లో వడ్డీ చెల్లించమంటున్నారు. అసలు రుణమే చేతికి రాలేదు. సబ్సిడీని నిలిపేయడం వలన ఈ తిప్పలన్నీ వచ్చాయి. - నందం నాగేశ్వరరావు, గుడ్లవల్లేరు అర్హులకు ఎగవేసేందుకే.. అర్హులకు సంక్షేమ రుణాలు ఇవ్వకుండా ఎగవేసేందుకే ప్రభుత్వం ఈ అర్థం లేని నిబంధనలను ప్రవేశ పెట్టింది. పాత జాబితాల్లో తెలుగు తమ్ముళ్లకు రుణాలు ఇచ్చుకునేందుకే తెలుగు తమ్ముళ్ల గ్రామస్థాయి కమిటీలకు ఈ బాధ్యతను అప్పగించింది. దీని వలన అర్హులు అన్యాయమవుతున్నారు. - డి.కనకరత్నారావు, గుడ్లవల్లేరు దళిత నేత -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
వివిధ సంఘాల ఆందోళన ఐకేపీ యానిమేటర్ల భారీ ప్రదర్శన కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు తోపులాట అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చిలకలపూడి (మచిలీపట్నం) : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ యూనియన్లు, కులసంఘాలు, కాంట్రాక్టు సిబ్బంది తదతరులు నిర్వహించిన ధర్నాలతో సోమవారం కలెక్టరేట్ దద్ధరిల్లింది. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు సిబ్బంది అక్రమ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న పోలీసులకు వీరికి తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల వద్దకు కేవలం ముఖ్యనాయకులను మాత్రమే కలెక్టరేట్ లోపలికి పంపడంతో బయట నినాదాలు తారాస్థాయినందుకున్నాయి. సబ్సిడీ రుణాల కోసం.... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు అందజేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జి.నటరాజ్ మాట్లాడుతూ లబ్ధిదారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకు ఆమోదపత్రం తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జాయింట్ కలెక్టర్ జె. మురళీకి వినతిపత్రం అందజేశారు. నాయకులు కె.కళ్యాణ్, డి.సాల్మన్‌రాజు, బి.ఆదిశేషు, టి .దనుంజయ, సీహెచ్.రాజేష్, సీహెచ్. జయరావు తదితరులు పాల్గొన్నారు. వేతనాల కోసం ఔట్సోర్సింగ్ మెసెంజర్లు... పెండింగ్‌లో ఉన్న సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మెసెంజర్ల వేతనాలను వెంటనే చెల్లింటాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదన్నారు. జూన్ నెల నుంచి రూ. 7,500 చొప్పున మెసెంజర్లకు చెల్లించాల్సి ఉంటే అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. అనంతరం ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సమస్యలపై... దళిత గిరిజనుల సర్పంచుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర కన్వీనరు అన్నవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణలను అనుసరించి 29 అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా కన్వీనరు నీలం పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు జి.జోజిబాబు, కార్యదర్శి పి.బాబూరావు, సర్పంచులు ఎం.చినరామయ్య, దాసరి అనిత పాల్గొన్నారు. ఎఫ్ఏల తొలగింపు యత్నాన్ని నిరసిస్తూ.... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పథకంలో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించాలని ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయనేతల ప్రోద్భలంతో ఎన్నో వేల మంది కూలీలకు పనికల్పిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను, మేట్లను తొలగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.