బయోమెట్రిక్‌పై డైలమా!
- సబ్సిడీ రుణాల ఎంపికకు నిలిపివేశామంటున్న అధికారులు
- ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతున్న ప్రభుత్వం
నెల్లూరు(సెంట్రల్): పేదలకు ఇచ్చే సబ్సిడీ రుణాలకు సంబంధించి బయోమెట్రిక్ వాడకంపై ప్రభుత్వం డైలమాలో పడింది. 2016–17 ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాలకు తప్పకుండా బయోమెట్రిక్ వాడాలని ప్రభుత్వం ఇటీవల జీఓ 118ను విడుదల చేసింది. అయితే బయోమెట్రిక్ వినియోగంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరిగి మళ్లీ లబ్ధిదారులతో వేలిము ద్రలను తప్పకుండా వేయించే దానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయమ ని, మరోసారి తప్పకుండా వేలిముద్రలు వేయాలని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చెబుతుండడంతో అటు అధికారులు, ఇటు రుణ లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు.
బయోమెట్రిక్‌పై ఫిర్యాదులు
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలకు చెందిన వారికి ఆయా కార్పొరేషన్లకు సం బంధించి సబ్సిడీ రుణాలను 2016–17కు అందించనుంది. కాగా ఇంత వరకు ఎప్పు డూ లేనంతగా ఈ ఏడాదికి రుణాల పొందే వారికి తప్పకుండా బయోమెట్రిక్ వేయా లని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న చోట వయసు పై బడే కొద్దీ వేలిముద్ర సరిగా పడడం లేదని చాలా చోట్ల ఫిర్యాదులు కూడా అధికారులకు వస్తున్నాయి.
లబ్ధిదారుల ఎంపికలో జాప్యం
రుణ లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే చాలా జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడితే ఒక వేళ కొందరికి వేలిముద్రలు పడకపోయినట్లైతే మళ్లీ వారి స్థానంలో మరొకరని ఎంపిక చేయాలంటే చాలా ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో లబ్ధిదారులకు ఏ విధంగా బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రం ప్రస్తుతం ఆ విధానాన్ని నిలిపివేశామని చెబుతుతున్నారు. మండలాలోని ఎంపీడీఓల వద్ద నుంచి రుణ లబ్ధిదారుల పూర్తి సమాచారం వస్తే తిరిగి మళ్లీ బయోమెట్రిక్ పెట్టే యోచనలో ఉన్న ట్లు మరొకొందరు అధికారులు చెపుతుండటం గమనార్హం.
దళితుల సంఘాల ఆగ్రహం
ఎప్పుడూ లేని విధం గా ఈ సారి పేదలకు ఇచ్చే రుణాలకు బ యోమెట్రిక్ విధానం పెట్టడం ఏమిటని పలువురు దళిత సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నిలిపివేశాం
ఈ ఏడాదికి ఇచ్చే సబ్సిడీ రుణాల విషయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేయాలని జీఓ ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం అమలు చేయకుండా నిలిపివేశాం. తిరిగి ఎప్పుడు అమలు చేస్తామనేది పరిశీలీస్తున్నాం. వాటి వల్ల ఇబ్బందుల ఉన్నాయని పలువురు అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి ఎప్పుడు అనేది నిర్ణయిస్తాం.
–రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ