ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ | Sit rocked collecterate | Sakshi
Sakshi News home page

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

Published Tue, Aug 5 2014 3:02 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ - Sakshi

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

  • వివిధ సంఘాల ఆందోళన
  •  ఐకేపీ యానిమేటర్ల భారీ ప్రదర్శన
  •  కలెక్టరేట్ ముట్టడికి యత్నం
  •  అడ్డుకున్న పోలీసులు
  •  తోపులాట
  •  అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్
  • చిలకలపూడి (మచిలీపట్నం) : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ యూనియన్లు, కులసంఘాలు, కాంట్రాక్టు సిబ్బంది తదతరులు నిర్వహించిన ధర్నాలతో సోమవారం కలెక్టరేట్ దద్ధరిల్లింది. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు సిబ్బంది అక్రమ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న పోలీసులకు వీరికి తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల వద్దకు కేవలం ముఖ్యనాయకులను మాత్రమే కలెక్టరేట్ లోపలికి పంపడంతో బయట నినాదాలు తారాస్థాయినందుకున్నాయి.
     
    సబ్సిడీ రుణాల కోసం....
     
    ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు అందజేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జి.నటరాజ్ మాట్లాడుతూ లబ్ధిదారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకు ఆమోదపత్రం తప్పనిసరిగా ఉండాలని  అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.  జాయింట్ కలెక్టర్ జె. మురళీకి వినతిపత్రం అందజేశారు. నాయకులు కె.కళ్యాణ్, డి.సాల్మన్‌రాజు, బి.ఆదిశేషు, టి .దనుంజయ, సీహెచ్.రాజేష్, సీహెచ్. జయరావు తదితరులు పాల్గొన్నారు.
     
    వేతనాల కోసం ఔట్‌సోర్సింగ్ మెసెంజర్లు...

    పెండింగ్‌లో ఉన్న సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ మెసెంజర్ల వేతనాలను వెంటనే చెల్లింటాలని కోరుతూ  ధర్నా నిర్వహించారు.  ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదన్నారు. జూన్ నెల నుంచి రూ. 7,500  చొప్పున మెసెంజర్లకు చెల్లించాల్సి ఉంటే అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. అనంతరం ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు.
     
    ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సమస్యలపై...
     
    దళిత గిరిజనుల సర్పంచుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని   ధర్నా చేశారు.   సంఘం రాష్ట్ర కన్వీనరు అన్నవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణలను అనుసరించి 29 అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  జాయింట్ కలెక్టర్ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా కన్వీనరు నీలం పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు జి.జోజిబాబు, కార్యదర్శి పి.బాబూరావు, సర్పంచులు ఎం.చినరామయ్య, దాసరి అనిత పాల్గొన్నారు.
     
    ఎఫ్‌ఏల తొలగింపు యత్నాన్ని నిరసిస్తూ....
     
    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పథకంలో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించాలని ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.   కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయనేతల ప్రోద్భలంతో ఎన్నో వేల మంది కూలీలకు పనికల్పిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను, మేట్లను తొలగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement