రుణం అందుకున్న ట్రాన్స్‌జెండర్ ఆషాడం ఆశ
కరీంనగర్: ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌కు సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ట్రాన్స్‌జెండర్‌కు రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ ఆషాడం ఆశ (ఎస్సీ)కు ఫొటోగ్రఫీ యూనిట్ స్థాపన కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మరో ట్రాన్స్‌జెండర్ నక్క సింధుకు.. ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆయన అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment