ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు! | CM Jagan Kept His Word | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు!

Published Mon, Oct 19 2020 3:18 PM | Last Updated on Mon, Oct 19 2020 3:25 PM

 CM Jagan Kept His Word - Sakshi

అమరావతి : కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్పటి నుంచి బీసీలు రాజ‌కీయ‌, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. గతంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ బహుజనులకు సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు. అక్టోబర్‌ 18 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన గౌరవం దక్కిన రోజని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గొప్ప మానవతావాది అని, వెనుకబడిన తరగతుల మహానాయకుడని పేర్కొన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లతో పాటు రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో బీసీలకే ప్రాధాన్యతనిచ్చినట్టు వివరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెనుకబడిన కులాల వారికి గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement