
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని ఉద్ధరిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
(చదవండి: అవినీతి నేతకు అధ్యక్ష పదవా?)
Comments
Please login to add a commentAdd a comment