సాక్షి, అమరాతి: బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..ఎన్నడూలేని విధంగా పెద్ద సంఖ్యలో కులాలకు ప్రాతినిథ్యం కల్పించనుంది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి కార్పొరేషన్లు తోడ్పాటు అందించనున్నాయి. మొత్తంగా 56 కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
30 వేల పైబడి జనాభా ఉన్నవారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నామినేటెడ్ పదవుల్లో పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించనున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లుగా 29 మంది మహిళలను, 27 మంది పురుషులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అలాగే.. డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకూ ఛైర్మన్ పదవుల్లో ప్రాతినిథ్యం కల్పించనున్నారు. డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయింపులు ఉండనున్నాయి.
(చదవండి: ‘స్పందన’పై సీఎం జగన్ సమీక్ష.. కలెక్టర్లకు సూచనలు)
జిల్లా | పురుషులు | స్త్రీలు | మొత్తం |
అనంతపురం | 2 | 2 | 4 |
చిత్తూరు | 2 | 2 | 4 |
తూర్పుగోదావరి | 1 | 3 | 4 |
గుంటూరు | 2 | 2 | 4 |
కడప | 2 | 2 | 4 |
కృష్ణా | 2 | 3 | 5 |
కర్నూలు | 2 | 2 | 4 |
నెల్లూరు | 2 | 2 | 4 |
ప్రకాశం | 2 | 2 | 4 |
శ్రీకాకుళం | 3 | 3 | 6 |
విశాఖ | 2 | 3 | 5 |
విజయనగరం | 2 | 2 | 4 |
పశ్చిమగోదావరి | 3 | 1 | 4 |
27 | 29 | 56 |
Comments
Please login to add a commentAdd a comment