సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా)
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైఎస్ జగన్ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment