swearing
-
ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణస్వీకారం
-
అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం
-
అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణం
-
ఎమ్మెల్యేగా సీతక్క ప్రమాణం
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ప్రమాణం
-
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రమాణం
-
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ శాసనమండలి: నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ -
NED క్యాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేకే రాజు
-
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా శేషగిరిరావు ప్రమాణస్వీకారం
-
లోక్‌సభలో తిరుపతి ఎంపీ ప్రమాణ స్వీకారం
-
కేంద్రమంత్రి గా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం
-
Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం: కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్ ఉంటుందని సీపీఎం యాక్టింగ్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ చెప్పారు. కోవిడ్నేపథ్యంలో ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం పూర్తవుతుందని ఆయన సోమవారం పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వానికి ఓటేసినందున మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఎల్డీఎఫ్ కేబినెట్లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని తెలిపారు. (చదవండి: మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్) -
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
-
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14 శాతం ఓట్లు సాధించింది. స్టాలిన్ కేబినెట్లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు. దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే! -
మున్సిపల్ ఫలితాలు: ఇంగ్లిష్ మహాలక్ష్మి!
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి ప్రత్యేకంగా నిలిచారు. ఇంటర్ చదివి టీటీసీ పూర్తి చేసిన మహాలక్ష్మికి అధికారులు తెలుగులో ఉన్న ప్రమాణ పత్రాన్ని అందించారు. ఆమె దాన్ని సొంతంగా ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకుని మరీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చదవండి: తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైఎస్ జగన్ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
శశికళ ప్రమాణంపై సందిగ్ధత.
-
టీడీపీ నేతల దూషణ పర్వాలపై అధికారుల సీరియస్
► అటవీశాఖ ఉన్నాతాధికారుల ఆగ్రహం ► తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం ఏలూరు: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే అటవీశాఖ అధికారులు, ఉద్యోగులపై దాడులు, దూషణ పర్వాలు చోటుచేసుకోవడాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో లెక్కలేనన్నిసార్లు అటవీశాఖ ఉద్యోగులు ఆ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఆ శాఖ అధికారులైతే నాలుగైదుసార్లు దారుణ పరాభవం చవిచూశారు. గతేడాది ఫిబ్రవరిలో టి.నరసాపురం మండలం కొత్తగూడెం అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరు వేయడాన్ని అడ్డుకున్నందుకు అటవీ శాఖలో ఆగ్రహంఆ ప్రాంత అటవీ అధికారికి టీడీపీ నేతలు చుక్కలు చూపించారు. ఫారెస్ట్ అధికారితోపాటు ఆయన సహాయకుడిని చితకబాదేశారు. ఆనక తెల్లకాగితంపై సంతకం పెట్టించుకుని ‘నీ సంగతి ఇక్కడ కాదు. ఊళ్లోనే తేలుస్తా..’ అంటూ గ్రామంలోకి తీసుకువెళ్లి అందరి ముందు పంచాయతీ పెట్టారు. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు అధికారి ‘బాబోయ్ నేనిక్కడ ఉద్యోగం చేయను. ఇక్కడి నుంచి బదిలీ చేయించండి’ అని కన్నీటి పర్యంతమై ఆ నేతలనే ప్రాధేయపడిన వైనం ఏడాది కిందట జిల్లాలో అటవీశాఖ అధికారుల దుస్థితిని తెలియజేసింది. ఉన్నతాధికారులకు విషయం తెలిసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అభద్రతా భావంతో కొల్లేరు అధికారులు కొల్లేరు అభయారణ్యం పరిధిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులైతే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతోనే రెండేళ్లుగా బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. అభయారణ్యం పరిధిలో ఎటువంటి రోడ్డు నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉండగా.. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్‌లో ఆటపాక పక్షుల దొడ్డిగట్టుపై రోడ్డు నిర్మాణాన్ని స్థానికులు రాత్రికి రాత్రే పూర్తి చేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు చింతమనేనికి భయపడి ఏమీచేయలేక తమపై దాడి జరగడం వల్లే రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ‘కావాలంటే నేను కొట్టినట్టు కేసు పెట్టుకోండి. రోడ్డు నిర్మాణానికి అడ్డురాకండి’ అని చింతమనేని స్పష్టం చేయడంతో ఉన్నతాధికారుల వద్ద తమ ‘స్కిన్’ కాపాడుకునేందుకు అటవీ అధికారులు అప్పట్లో దాడి ‘డ్రామా’ను రక్తికట్టించారన్న వాదనలు ఉన్నాయి. ఆ మేరకు పోలీస్ కేసు పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదంటేనే ఆ ఘటన వెనుక వాస్తవం ఏంజరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా అటవీశాఖ అధికారులు భయపడుతూ పనిచేస్తున్న పరిస్థితుల్లోనే ఏలూరు ఇన్చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) పి.శివశంకర్‌రెడ్డి రెండురోజుల క్రితం అదే చింతమనేనితో తెగించి మాట్లాడటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిరాయితీ భూముల్లో చేపల పట్టుబడి కుదరదంటూ శివశంకర్‌రెడ్డి స్పష్టం చేయగా, చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసి సెలవులో వెళ్లిపోవాల్సిందిగా సూచించడం తెలిసిందే. శివశంకర్‌రెడ్డి కూడా సెలవులోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇలా సెలవులోకి పంపేస్తే .. మరో అధికారి వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నరగా ఇన్చార్జిల పాలనే ఇప్పటికే ఏలూరు డివిజన్లో పనిచేసేందుకు అటవీశాఖ అధికారులెవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రెండేళ్లకాలంలో ఇప్పటివరకు ఆరుగురు అధికారులు మారారు. ఇందులో ఐదుగురు ఇన్చార్జిలుగా వ్యవహరించిన వారే. శివశంకర్‌రెడ్డి కూడా రెండు నెలల కిందటే ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు. తాజా వివాదం నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం నుంచే సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో సెలువులు మంజూరు చేస్తే పరిస్థితి మరీ చేయిదాటిపోతుందని భావించిన ఉన్నతాధికారులు ఆయన సెలవుకు మంజూరు చేయలేదని అంటున్నారు. అటవీశాఖ మంత్రితోపాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. -
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
-
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
చిత్తూరుజిల్లా: నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి ప్రమాణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో ఉమ్మారెడ్డితో మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటాలో ఉమ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, బొత్సా సత్యనారాయణతో పాటు పలువరు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉమ్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు, గుంటూరు జిల్లా నేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులకు ఉమ్మారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పెద్దల సభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మారెడ్డి వెల్లడించారు. -
ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటలో ఎంపికైన నలుగురు టీడీపీ నేతలు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నేతలు టిడి జనార్దన్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, జి.శ్రీనివాసులు చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.అంతకుముందు వీరంతా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత శాసనమండలికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి టిడి జనార్దన్, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్తోపాటు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్, చిత్తూరు జిల్లాలోని సీనియర్ నేత జి.శ్రీనివాసులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
'ఇక బహిరంగంగా మద్యం తాగం'
పంజగుట్ట: బహిరంగంగా మద్యం తాగుతున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నపోలీసులు వారిచే మరోసారి బహిరంగంగా మద్యం తాగనని ప్రతిజ్ఞ చేయించారు. పోలీసుల వివరాల ప్రకారం శుక్రవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్స్ సమీపంలో ఉన్న గణేష్ వైన్స్ వద్ద, రాజ్‌భవన్ రోడ్డు, బంజారాహిల్స్ రోడ్డు నెం బర్ 1 వైన్స్‌ల ముందు ప్రధాన రహదార్లపై మద్యం తాగుతున్న 26 మందిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ డీసీపీ వెంకటేశ్వర్రావు సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్లపై మద్యం తాగడం తప్పు, మద్యం తాగడం వల్ల సాధారణ వ్యక్తులకు, మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుచేత మరోసారి బహిరంగంగా మద్యం తాగము. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము’ అని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. -
నేడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
-
బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు...
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం హాజరు కావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్ హైదరాబాద్‌లో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, నిర్మాల సీతారామన్, రవిశంకర్ ప్రసాద్‌లతో సహా సుమారు పదిమంది కేంద్రమంత్రులు వస్తున్నారని చెప్పారు. పార్టీ సీనియర్ నేత అద్వానీ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన నిన్న తెలిపారు. అలాగే... ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రమణ్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), ప్రకాశ్ సింగ్ బాదల్ (పంజాబ్), మనోహర్ పారికర్ (గోవా)లు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. వీరితో పాటు...ఒడిశా, తమిళనాడు ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జయలలితలు కూడా హాజరు అవుతున్నట్లు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. -
సామాన్యుడికి మోదం..అవినీతిపరులకు ఖేదం!
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడినే పార్టీ పేరుగా మార్చుకున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అనూహ్య విజయంతో ఢిల్లీ గ ద్దెపైకి ఎక్కేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 12 గంటలకు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్ఆద్మీపార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై సామాన్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా.. అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తమకు మేలు జరుగుతుందని ఢిల్లీలోని జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లోని లక్షలాదిమంది నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. వందల్లోంచి వేలల్లోకి చేరిన విద్యుత్, నీటి బిల్లులు చెల్లించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మధ్యతరగతివారు సైతం ఆప్ ఇచ్చిన హామీల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవస్థలో మార్పు తెస్తామంటూ ప్రతి పనిలోనూ వినూత్నతను ప్రదర్శించడంతో ఎగువ మధ్య తరగతి, ఉన్నత చదువు ఉన్న వర్గాల వారికి చేరువైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఏం చేయబోతుందోనన్న ఆసక్తిని కనబరుస్తోంది. అందరి దృష్టీ కేజ్రీవాల్‌పైనే: అవినీతి వ్యతిరేక ఉద్యమంలో గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులను తట్టుకుని స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. విద్యుత్ చార్జీల్లో 50 శాతం వరకు తగ్గుదల, ప్రతి ఇంటికీ 700 లీటర్ల ఉచిత మంచినీరు ప్రధాన హామీలతో ఎన్నికల్లో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సామాన్యుడి గొంతుకనంటూ దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన కేజ్రీవాల్ వేసే ప్రతి అడుగుపైనా అటు రాజకీయ వర్గాలు, ఇటు మీడియా, సామాన్యులతో సహా దేశవ్యాప్తంగా ప్రజలు దృష్టి సారించారు. తన ప్రమాణ స్వీకారానికి వీఐపీలు ఎవరూ లేరని, ఢిల్లీవాసులంతా ఈ కార్యక్రమానికి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానం పంపారు. తనతో సహా, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సైతం ఢిల్లీ మెట్రోరైలులో రావాలని మరోమారు ఆసక్తి పెంచారాయన. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం అనంతరం చేయబోయే కీలక ఉపన్యాసంలో ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవినీతిపరుల గుండెల్లో గుబులు: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జనంలో గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి పదవిలోకి రానుండడంతో అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులుకు కారణమవుతోంది. ఎప్పుడు ఎటునుంచి తమపై దృష్టి పడుతుందోనన్న మీమాంసలో వారున్నారు. ఇటీవల ఢిల్లీలోని స్థానిక చానళ్లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ వారంతా ‘పరేషాన్’గా కనిపించారు. జల్‌బోర్డు అధికారులతో ఓ టీవీ చానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో కొందరు అధికారులు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పెద్దలే తమతో అక్రమాలు చేయించారంటూ షీలాదీక్షిత్ సర్కార్‌పై నిందలు వేశారు. మరికొందరు లెక్కల్లో బొక్కలు బయటపడకుండా ఫైల్స్ చించివేస్తూ కనిపించారు