
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి ప్రత్యేకంగా నిలిచారు. ఇంటర్ చదివి టీటీసీ పూర్తి చేసిన మహాలక్ష్మికి అధికారులు తెలుగులో ఉన్న ప్రమాణ పత్రాన్ని అందించారు. ఆమె దాన్ని సొంతంగా ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకుని మరీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
చదవండి:
తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్
మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్
Comments
Please login to add a commentAdd a comment