kalyandurgam
-
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
-
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
-
Kalyandurg: టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం చెలాయించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ- వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. -
మరోసారి బయటపడ్డ టీడీపీ గ్రూపు రాజకీయాలు
అనంతపురం: చంద్రబాబు పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడుల మధ్య వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో సమావేశం జరగ్గా, పరస్పరం బాహాబాహికి దిగారు ఉన్న, ఉమా వర్గీయులు. ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ పరిశీలకుడు బీటీ నాయుడు సమక్షంలోనే టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇరు వర్గాలు బాహాబాహికి దిగడం టీడీపీలో గ్రూపు రాజకీయాలకు అద్దం పడుతోంది. -
కళ్యాణదుర్గం: వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు
-
CM Jagan Kalyandurgam Tour : కళ్యాణదుర్గంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం జిల్లా: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ, బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు. ‘‘ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. ప్రతి ఏటా మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ ‘‘ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోంది. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబు కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయి’’ అని సీఎం దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. ‘‘ఏ సీజన్లో పంటనష్టం జరిగినా ఆ సీజన్ ముగియక ముందే పరిహారం అందిస్తున్నాం. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ‘‘మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని సీఎం చెప్పారు. -
టీడీపీలో ఆధిపత్య పోరు.. సీనియర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి!
కళ్యాణదుర్గం(అనంతపురం): కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు, సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సీనియర్ నేతలు గ్రూపులు ప్రోత్సహిస్తున్నారంటూ ఇన్చార్జ్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే.. ఇన్చార్జ్ తమను ఏమాత్రం గుర్తించకుండా.. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ సీనియర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఉమాకు అనుకూలంగా మీడియాలో కథనం రావడంతో ఇరు వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు మరింత తీవ్రమయ్యాయి. ఏకంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరితో పాటు ఆయన వర్గీయులు సదరు మీడియా యాజమాన్యాన్ని కలిసి ఏకపక్షంగా వార్తలు రాయడం ఏంటని నిలదీసినట్లు సమాచారం. విభేదాలు మొదలైందిలా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వరనాయుడును అధిష్టానం ప్రకటించింది. తమకు కాకుండా స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంపై ఉన్నం వర్గీయులు భగ్గుమన్నారు. అప్పట్లో రెబల్ అభ్యర్థిగా ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై అధిష్టానం జోక్యం చేసుకుని ఉన్నంను బుజ్జగించి రాజీ చేసింది. అయినా స్థానికేతరుడికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ లోలోన మదనపడుతూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కె.వి.ఉషశ్రీచరణ్ చేతిలో ఉమామహేశ్వరనాయుడు ఓడిపోయారు. తన ఓటమికి ఉన్నం వర్గీయులే కారణమని అప్పట్లో ఉమా ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు ఓ పేరును ప్రతిపాదిస్తే...ఉన్నం మరో పేరును ప్రతిపాదించి పోటాపోటీగా నామినేషన్లు వేయించారు. దీనిపై మూడేళ్ల నుంచి టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఆధిపత్య పోరుకు ఆజ్యం పోశారు. వీరి తీరుతో విసిగివేసారిన కేడర్ తలోదారి చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్‌పై ఎవరికి వారు ప్రచారాలు ఇటీవల ఇరు వర్గాల టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు విడివిడిగా చర్చించారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఉమా చెప్పారు. ఉన్నం వర్గీయుల్లో ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదంటూ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్ చౌదరి, మాజీ ఎంపీపీ చౌళం మల్లికార్జున అభిప్రాయం వెలిబుచ్చినట్లు తెలిసింది. ఇలా ఎవరికి వారు టికెట్ తమకంటే తమకే అంటూ అనుయాయుల వద్ద చెప్పుకుంటున్నారు. అయితే కళ్యాణదుర్గంలో టికెట్ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టం చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. -
మృత్యువులోనూ వీడని స్నేహం
కళ్యాణదుర్గం: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. ఆదివారం మధ్యాహ్నం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. రెండు కుటుంబాల్లోనూ విషాదం.. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సిద్ధం చంద్రశేఖరరెడ్డి, సరస్వతి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమారుడు సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి. పిల్లలిద్దరికీ పెళ్లి కాలేదు. అలాగే ధర్మవరంలోని గాందీనగర్‌కు చెందిన అంకె రామాంజనేయులు, రామసుబ్బమ్మ దంపతులకూ ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. కుమారుడు అంకె బాలచంద్ర ఎంటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి కాలేదు. కుమార్తెకు వివాహమైంది. రోడ్డు ప్రమాదంలో కుమారులను కోల్పోవడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ‘ఒక్క గానొక్క కుమారుడిని తీసుకుపోయావా.... దేవుడా... ఇక మాకు దిక్కెవరు?’ అంటూ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇటీవలే ఇద్దరూ పరిచయమై... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్ధం లక్ష్మీకాంతరెడ్డి, అంకె బాలచంద్ర మధ్య ఇటీవలే స్నేహం పెరిగింది. వీరిలో లక్ష్మీకాంతరెడ్డి అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బాలచంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో లక్ష్మీకాంతరెడ్డితో కలిసి అనంతపురంలో ఒకే గదిలో ఉంటున్నాడు. ప్రమాదాన్ని తొలుత చూసిన తండ్రి.. మృతుడు సిద్దం లక్ష్మీకాంతరెడ్డి తండ్రి చంద్రశేఖరెడ్డికి సొంతంగా బొలెరో వాహనం ఉంది. రోజూ అనంతపురంలోని టమాట మండీకి సరుకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం అనంతపురానికి టమాట లోడుతో వెళ్లిన ఆయన అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో గోళ్ల వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎవరో దురదృష్టవంతులు చనిపోయారనుకుని ముందుకెళ్లిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ మార్గంలో వస్తున్న తోటి డ్రైవర్లకు ఫోన్ చేసి ‘గోళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది... జాగ్రత్తగా రండి’ అంటూ సూచించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత చూస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది తన కుమారుడేనని తెలుసుకుని గుండెలవిసేలా రోదించాడు. (చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’) -
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా
కళ్యాణదుర్గం (అనంతపురం): అందంగా లేదని కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటన కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో నివాసముంటున్న కుళ్లాయప్ప బేల్దారి పని చేసుకునేవాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి చెందిన అపర్ణ (27)ను ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలంగా కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవపడేవాడు. అందంగా లేవని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపి విడాకులు తీసుకునేందుకు అపర్ణ సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కుళ్లాయప్ప మద్యం మత్తులో ఇంటికి చేరుకుని రోజువారీగానే భార్యతో గొడవ పెట్టుకుని కత్తితో అపర్ణ పొట్టలో బలంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అపర్ణను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. హతురాలి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టారు:ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్
-
టీడీపీలో కుతకుతలు: నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం
కల్యాణదుర్గం రూరల్: కల్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లోనే వర్గ విభేదాలు బయట పడుతుండడంతో ఆ పార్టీ పరువు పోతోంది. తాజాగా బీటీపీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కాలువ వెంబడి పాదయాత్ర చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం- ఒంటిమిద్ది మధ్యలో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్ర ముందు వరుసలో మాజీ మంత్రులతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరి తదితరులు కలిసి సాగుతుండగా... వెనుక ఉన్న టీడీపీ కల్యాణదుర్గం ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, అనుచరులు కల్పించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ముందు వరసలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఒకానొక దశలో మారుతీ చౌదరి, ఉమా వర్గీయులు పరస్పరం బూతులతో విరుచుకుపడ్డారు. కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత పాదయాత్ర కాస్త ముందుకు సాగగానే నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
మున్సిపల్ ఫలితాలు: ఇంగ్లిష్ మహాలక్ష్మి!
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి ప్రత్యేకంగా నిలిచారు. ఇంటర్ చదివి టీటీసీ పూర్తి చేసిన మహాలక్ష్మికి అధికారులు తెలుగులో ఉన్న ప్రమాణ పత్రాన్ని అందించారు. ఆమె దాన్ని సొంతంగా ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకుని మరీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చదవండి: తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
కల్యాణదుర్గం టీడీపీ నేతల మధ్య విభేదాలు
-
కళ్యాణదుర్గం టీడీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
-
తమ్ముళ్ల నయాదందా!
ఇందిరమ్మ లేఅవుట్పై కన్ను! కార్యకర్తలకే పట్టాలు ఇప్పించేందుకు గూడుపుఠాణి ఇంటి పట్టాలు అమ్ముకుని రూ.లక్షలు గడిస్తున్న వైనం పేదల సొంతింటి కల చెదిరిపోనుంది. మూడేళ్లుగా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వని టీడీపీ ప్రజా ప్రతినిధులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లే అవుట్‌పై కన్నేశారు. ఇందులోని ఖాళీ ప్లాట్లను టీడీపీ కార్యకర్తలకే దక్కేటట్లు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారులకు నియోజకవర్గ ప్రధాన నేత మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. - కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలోని ఐదుకల్లు రోడ్డు, శెట్టూరు రోడ్డులో 2010లో సర్వే 384, 385, 386 ,498–1 భూముల్లో 18 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కొనగోలు చేసి ఇందిరమ్మ లేఅవుట్ కింద 1,154 ప్లాట్లను వేసి అర్హులైన పేదలకు స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో ఏడాది క్రితం నాలుగు వందల ప్లాట్లు ఖాళీగా ఉండగా, మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారుల సర్వేలో 288 మాత్రమే ఖాళీగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందకు పైగా ప్లాట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు పట్టాలు పొంది, ఒక్కొక్కటి రూ. 1లక్షకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాలను తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్తున్నారు. అర్హుల పేరుతో దోపిడీ ఎలాగో తమ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వదన్న భావన బలంగా ఉన్న టీడీపీ నేతలు... ఇందిరమ్మ లే అవుట్లపై కన్నేశారు. ఈ లే అవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను తమ అనుయాయులకు ఇప్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నేతలు గూడుపుఠాణీ చేస్తున్నారు. అర్హులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు బాహటంగా చూపుతూ.. లోలోన టీడీపీ కార్యకర్తలకే పట్టాలు దక్కేటట్లు పావులు కదిపారు. ఇంటి పట్టాల కోసం 650 దరఖాస్తులు అందగా, ఇందులో 125 మందికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం. అనర్హులకు ఇస్తే సహించం ఇందిరమ్మ లే అవుట్లో టీడీపీ నాయకులకే పట్టాలిచ్చి పేదలకు అన్యాయం చేస్తే సహించం. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల ప్రకారం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు చేస్తాం. – నాగరాజు, ఎంఆర్పీఎస్ నాయకుడు, కళ్యాణదుర్గం సత్తా ఇంటే భూమి కొని పట్టాలివ్వండి అర్హులకు ఇంటి పటాలిస్తే తప్పుపట్టం. అయితే అనర్హులైన వారికి ఇందిరమ్మ లే అవుట్లో అక్రమంగా పట్టాలిస్తే ఊరుకోం. టీడీపీ నేతలకు సత్తా ఉంటే భూమి కొనుగోలు చేసి ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టి పట్టాలిస్తే అభ్యంతరం లేదు. – బోయ నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు, కళ్యాణదుర్గం న్యాయపోరాటానికి సిద్ధం టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందిరమ్మ లే అవుట్లో ప్లాట్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకపోతే న్యాయం పోరాటం చేస్తాం. – బిక్కి హరి, వైఎస్సార్సీపీ నాయకుడు, కళ్యాణదుర్గం సిఫార్సులకు తలొగ్గామనడం సబబు కాదు అధికార పార్టీ నేతల సిఫార్సులకు తలొగ్గామని చెప్పడం సబబు కాదు. అనర్హులకు పట్టాలిస్తారని విమర్శించడం సరైందికాదు. దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి అర్హులను గుర్తించి వారికే పట్టాలు అందజేస్తాం. – రవీంద్ర, తహసీల్దార్, కళ్యాణదుర్గం -
ఇష్టారాజ్యం
- పవన్ విద్యుత్ కంపెనీల బరి తెగింపు - రైతుల నుంచి కారుచౌకగా భూముల కొనుగోలు - కొనని వాటిలోనూ పనులు - అడ్డగోలు వ్యవహారాలకు అధికార పార్టీ నేతల అండ - న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న బాధితులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పవన్ విద్యుత్ (గాలిమరలు) కంపెనీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన దళారుల సాయంతో రైతుల నుంచి భూములను కారుచౌకగా కొట్టేయడమే కాకుండా పక్క రైతుల పొలాల్లోనూ దౌర్జన్యంగా పనులు చేస్తున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వారికి బాసటగా నిలవాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కొందరు బాధితులు న్యాయస్థానాల తలుపు తడుతున్నారు. కళ్యాణదుర్గం : పవన విద్యుత్ తయారీకి కళ్యాణదుర్గం ప్రాంతం అత్యంత అనువైనది. దీంతో ఈ ప్రాంతానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. భారీసంఖ్యలో గాలిమరలను ఏర్పాటు చేస్తున్నాయి. అసలే కరువు ప్రాంతం కావడం, వర్షాధార భూములు అధికంగా ఉండడం, వరుస పంట నష్టాలతో రైతులు కూడా కష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీల పని సులువు అవుతోంది. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు మండలాల్లో కనుచూపు మేర ఎక్కడ చూసినా గాలిమరలే దర్శనమిస్తున్నాయి. హీరో, సుజలాన్, యాస్పిన్, గమేశా, గ్రీన్కో, యాక్సిస్, ఎకోరియన్, విండ్‌పవర్ సంస్థలు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరిని దళారులుగా నియమించుకుని, వారి సాయంతో రైతుల నుంచి తక్కువ ధరతోనే భూములు కొనుగోలు చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా సమీప రైతుల పొలాల్లోనూ పనులు చేపడుతూ..వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కంపెనీల ఆగడాలను అరికట్టి, రైతులకు అండగా నిలవాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. రైతులు ఫిర్యాదులు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా వారిలో చలనం కన్పించడం లేదు. బరి తెగించి నిర్మాణాలు కంబదూరు మండలం తిమ్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో రైతులు నరసన్నగౌడ్, మంజునాథ, రవిచంద్రగౌడ్ నుంచి సర్వే నంబర్లు 22–1ఏ, 1బీ, 1సీలలోని 16 ఎకరాల భూమిని విండ్ పవర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. ఇదే భూమిని వాయి ఉజ్రా భారత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నాలుగింతల ఎక్కువ ధరకు విక్రయించింది. పై సర్వే నంబర్లలోని భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాల్సి ఉండగా.. దాన్ని వదిలి పక్కనే ఉన్న రైతు రవిచంద్ర గౌడ్‌కు చెందిన సర్వే నంబర్ 22–1లోని 7.50 ఎకరాల పొలంలో పనులు చేపడుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసింది. దీనిపై బాధిత రైతు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సర్వేయర్ తిమ్మరాజు పొలాన్ని సర్వే చేశారు. వాయి ఉజ్రా కంపెనీ కొనుగోలు చేయని పొలంలో సబ్‌స్టేషన్ నిర్మించినట్లు ఆయన గుర్తించారు. ఇదే విషయాన్ని తహసీల్దార్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కంపెనీ నిర్వాకంపై బాధిత రైతు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు. ఇదే కంపెనీ నిర్వాహకులు తమను ధర విషయంలో మోసం చేశారంటూ కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తావ్రేనాయక్, రామ్మూర్తి కోర్టును ఆశ్రయించారు. అలాగే ఎస్.మల్లాపురం చెరువులో అనుమతులు లేకుండానే ప్రైవేట్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి, వర్లి, కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూ గ్రామాల పరిధిలోనూ ఓ కంపెనీ వారు ఈ తరహాలో మోసాలకే పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్లి చెరువులో అనుమతుల్లేకుండా ఏకంగా రోడ్డు నిర్మిస్తున్నారు. సామాజిక బాధ్యతకు మంగళం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పవన విద్యుత్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద వివిధ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సమీప గ్రామాల్లో తాగునీరు, పాఠశాలల అభివృద్ధి, వీధిలైట్లు, ఆలయాల అభివృద్ధి, సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు చేయూతనివ్వాలి. అయితే.. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యనేత కనుసన్నల్లోనే... కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని శాసిస్తున్న టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లోనే గాలిమరల వ్యవహారాలు నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ కంపెనీ భూసమీకరణ చేయాలన్నా, ఇతరత్రా పనులు చేపట్టాలన్నా సదరు నాయకుడి అండ తప్పనిసరి. ఆ నేతను ప్రసన్నం చేసుకుంటే పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. ఎవరైనా అడ్డొచ్చినా వారి మనుషులే చూసుకుంటారు. భూసమీకరణ విషయంలో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రైతులకు అన్యాయం చేస్తున్నా సదరు నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రేపు 'రాయదుర్గం–కళ్యాణదుర్గం' ప్యాసింజర్ రైలు ప్రారంభం
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం సెక్షన్లో నూతన రైలు మార్గాన్ని ప్యాసింజర్ సర్వీస్‌తో ఈ నెల 30న శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాయదుర్గం నుంచి తుంకూరు వరకూ 207 కిలోమీటర్ల రైల్వేలైను నిర్మాణంలో కళ్యాణదుర్గం (40 కిలోమీటర్లు) వరకు రైలుమార్గం పూర్తయింది. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు చేసి రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం ప్యాసింజర్ సర్వీసు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చీఫ్కమర్షియల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు రిమోట్ వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభిస్తారు. స్థానికంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయచౌదరి, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్ హాజరై జెండా ఊపీ రైలును ప్రారంభించనున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే జైన్, ఇతర ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. -
పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము : డీఎస్పీ
కళ్యాణదుర్గం : పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని డీఎస్పీలు అనిల్, నర్సింగప్ప, వంశీధర్‌గౌడ్ అన్నారు. ఇటీవల బదిలీ అయిన సీఐ మన్సురుద్దీన్, కంబదూరు ఎస్ఐ నగేష్ బాబు, కానిస్టేబుల్ కిష్టప్ప, గంగన్నలకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సన్మాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీలు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది కత్తిమీద సాములాంటిదని, ఒత్తిళుకు తట్టుకుని పనిచేసినప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎల్ఎంమోహన్రెడ్డి,మాజీ మార్కెట్‌యార్డు చైర్మెన్ మచ్చన్న,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు, మున్సిపాపల్ చైర్మెన్ వైపీ రమేష్, మార్కెట్‌యార్డు చైర్మెన్ బాదన్న, తెలుగుయువత నాయకుడు మారుతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉమామశ్వేర్నాయుడు తదితరులు బదిలీపై వెళ్లిన సీఐ,ఎస్ఐ,కానిస్టేబుళ్లను సత్కరించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
కళ్యాణదుర్గం: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో బుధవారం గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. హజీజ్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఉదయం 10 గంటల సమయంలో దుకాణ నిర్వాహకుడు గ్యాస్‌స్టౌలు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్లైట్లు, చిన్న గ్యాస్ స్టౌవ్‌లకు వినియోగించే చిన్న సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో హజీజ్, అతని భార్య, కుమార్తెలు అక్కడి నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ క్రమంలో హజీజ్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఉన్నఫలంగా భారీగా పేలుడు శబ్ధం వచ్చి మంటలు ఎగిసి పడడంతో ఇరుగు పొరుగు వ్యాపారులు, నివాసమున్న కుటుంబాల వారు పరుగులు తీశారు. రూ.15 లక్షలకు పైగా ఆస్తి నష్టం హజీజ్ ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో గ్యాస్లైట్లు, గ్యాస్‌స్టౌవ్‌లు, బ్యాటరీలు, కుక్కర్లు, మిక్సీలు, జార్లు అన్నీ కాలిబూడిదయ్యాయి. దీంతో బాధితునికి రూ.15 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు శ్రమించిన ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఒకే అగ్ని మాపక వాహనంతో మంటలు ఆర్పేందుకు సాధ్యపడకపోవడంతో రాయదుర్గం అగ్నిమాపక వాహనాన్ని రప్పించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రమించారు. భవనానికి సంబంధించిన పక్క గోడలు ధ్వంసం చేసి మంటలార్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రమాద సంఘటనను తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, తహశీల్దార్ రవీంద్ర మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆర్డీఓ రామారావు కూడా సంఘటనా స్థలాని చేరుకుని పర్యవేక్షించారు. -
మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ
గుప్త నిధుల వేటగాళ్లే ఎత్తుకెళ్లారని అనుమానాలు రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ పోలీసు అదుపులో ఇద్దరు నైట్వాచ్మెన్లు, మరో వ్యక్తి మండల కేంద్రంలోని చోళరాజుల పాలనలో నిర్మించిన పురాతన ఆలయం శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఉన్న ఒక చిన్న శివలింగాన్ని బుధవారం తెల్లవారుజామున దుండుగులు ఎత్తుకెళ్లారు. ఆలయ ఈఓ రామాంజినేయులు అందించిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించగానే ముఖ మండంపం ఉంది. అందులో ఒక చిన్నపాటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కూడా పూజలు నిర్వహించే వారు. ఇందులో గుప్త నిధులు ఉంటాయన్న ఉద్దేశ్యంతో దుండుగులు ఆలయంలోకి ప్రవేశించి అక్కడే ఉన్న నైట్వాచ్మ్యాన్లు శివన్న, శ్రీహరిలను బెదిరించి శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ నగేష్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి అక్కడ ఉన్న ఇద్దరు నైట్వాచ్మ్యాన్లను విచారించారు. అయితే వారు తాము రాత్రికి ఆలయం గేటు వేసుకుని పడుకుని ఉంటే ఇద్దరూ వ్యక్తులు 2 గంటల ప్రాంతంలో గోడదూకి ఆలయంలోకి ప్రవేశించారని ముఖానికి నల్ల బట్టలు కట్టుకుని ఉండడంతో వారిని గుర్తు పట్టలేదు. తమను కత్తులతో బెదిరించి మాపై మత్తు మందును చల్లడంతో తాము మత్తులోకి వెళ్లాము. అంతే ఏమి జరిగిందో ఉదయం దాకా తెలియదని అప్పటికే శివలింగం లేని విషయాన్ని ఈఓకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అయితే వారు చెప్పే మాట్లాల్లో వాస్తవం కనిపించకపోవడంతో పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుప్త నిధుల కోసమే... మల్లేశ్వరాలయంలో జరిగిన శివలింగం చోరీ గుప్త నిధుల కోసమేనని తెలుస్తోంది. గతంలో కమలం పువ్వును ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. అలాగే రెండోసారి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని, ఇప్పుడు శివలింగాన్ని ఎత్తుకెళ్లడంతో గుప్త నిధుల కోసమే చోరీలకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. రంగంలోకి దిగిన క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ : మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శివలింగం చోరీ ఘటనపై పోలీస్ శాఖ ఛాలెంజ్‌గా తీసుకుంది. వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో రంగలోకి దించారు. వారు వచ్చి ఆలయ చుట్టుపక్కల తనిఖీలు చేశారు. ఎక్కడా క్లూ లభించలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ : చోరీ జరిగినకంబదూరు మల్లేశ్వరస్వామి ఆలయాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ మన్సురుద్దీన్ పరిశీలించారు. ఈ ఘటనపై అక్కడి సిబ్బంది, ఆలయ అధికారులను విచారించారు. 24 గంటల్లో కేసును ఛేదిస్తామని చెప్పారు. -
జాతరకు వెళ్లొచ్చేసరికి...
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దొడగట్టులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ఇతర కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి జాతరకు వెళ్లగా... ఇంట్లో ఒంటరిగా ఉన్న వీరాంజనేయులు (28) దూలానికి ఉరేసుకున్నాడు. జాతర నుంచి బుధవారం తెల్లవారుజామున వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కట్న జ్వాలే కాటేసిందా?
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : బుధవారం కళ్యాణదుర్గంలో తన ముగ్గురు పిల్లలపై డీజిల్ పోసి తల్లి కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు కారణం వరకట్న వేధింపులే అని తెలుస్తోంది. ఈ ఘటనలో కుమారుడు, కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె భయంతో పరిగెత్తి ప్రాణం కాపాడుకుంది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలోని వడ్డే కాలనీలో నివాసముంటున్న వడ్డే నాగరాజుకు కర్ణాటకలోని తుంకూరు జిల్లా కొరటిగెర గ్రామానికి చెందిన శోభతో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 30 తులాల బంగారు, రూ.10 లక్షల కట్నంగా ఇచ్చామని శోభ తల్లి కొల్లారమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పిల్లలు హరిణి (6), ఐశ్వర్య (4), శ్రీనివాసులు (18 నెలలు) పుట్టాక అల్లుడు, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారని చెప్పింది. ఇదే విషయాన్ని తన కూతురు ఎన్నో సార్లు తనతో చెప్పుకుని ఏడ్చిందని వాపోయింది. దీన్ని బట్టి చూస్తే తన కూతురు శోభను అదనపు కట్నం కోసం అత్తింటి వారే ఒంటిపై డీజిల్ చల్లి నిప్పంటించి చంపారని ఆమె ఆరోపించింది. తన కుమార్తెతో పాటు మనవడు శ్రీనివాసులు, మనవరాలు హరిహణిని కూడా పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమైంది. కాగా, శోభ పరిస్థితి విషమంగా ఉండటంతో పుట్టింటి వారు ఆమెను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. అంతకు ముందు ఆస్పత్రిలో శోభ నుంచి జూనియర్ సివిల్ జడ్జి శైలజ వాంగ్మూలం సేకరించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. శోభ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకుందో తమకు తెలియడం లేదని, ప్రాణాలు తీసుకునేంత పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని శోభ అత్తింటి వారు ఆస్పత్రిలో రోదించారు. -
జేసీ సోదరులపై భారీ ఫ్లెక్సీలు!
కళ్యాణదుర్గం : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి పలు అరాచకాలకు పాల్పడ్డారంటూ వెలిసిన ఫెక్సీలు కలకలం సృష్టించాయి. జేసీ ప్రభాకరెడ్డి క్రిమినల్ అంటూ గత రాత్రి కళ్యాణదుర్గంలో ఫెక్సీలు వెలిశాయి . టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బాధితులతో కలిసి కరపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని ప్రధాన కూడళ్లలో పంపిణీ చేశారు. కరపత్రం, ఫ్లెక్సీలలోని సారాంశం ఇలా ఉంది. ‘‘జేసీ సోదరుల స్వగ్రామం తెలంగాణలోని గద్వాల్ పట్టణం. తాడిపత్రికి వలస వచ్చి రాజకీయ పెత్తనం చెలాయిస్తూ స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థిగా పోటీ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మద్దులచెరువు సూరితో చేతులు కలిపి పరిటాల రవీంద్రను హతమార్చారు. సీబీఐ విచారణలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరును తొలగింప చేసుకున్నారు. సూరి జైలు నుంచి విడుదలైతే తాడిపత్రిలో ఊరేగించి భారీ విందు ఇచ్చారు. పరిటాల రవీంద్ర మృతి అనంతరం పరిటాల సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే తాడిపత్రి నుంచి రౌడీలను పంపి భయభ్రాంతులకు గురి చేశారు. తాడిపత్రి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కి వారిని జేసీ సోదరుల కనుసన్నల్లో ఉంచుకున్నారు. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. ముస్లింలపై దౌర్జన్యానికి పాల్పడుతూ మసీదును ధ్వంసం చేయించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలంటే జేసీ సోదరులకు చాలా చులకన. జేసీ సోదరుల వద్ద బడుగు, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలు చేతులు కట్టుకుని నిలుచుకోవడం వాస్తవం కాదా? జేసీ సోదరుల అరాచకాలను విలేకరులు పత్రికల్లో కథనాలు రాస్తే ఇక వారు బలిపశువులే. తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నది జేసీ సోదరులనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పదవీ వ్యామోహం కోసం వారు ఎంతకైనా బరి తెగిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక దొడ్డి దారిలో పదవులను సంపాదించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రజలారా మీరే ఆలోచించండి’’ అంటూ ఆ కరపత్రం, ఫ్లెక్సీలో పొందుపరిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే టీడీపీకే తీవ్ర నష్టమంటూ తెలుగు తమ్ముళ్ళు ఈ ఫెక్సీల ద్వారా చంద్రబాబుకు పరోక్షంగా హితవు పలికారు. మరి సైకిల్ ఎక్కాలనుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ ఫెక్సీలు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపుతాయో మరి.