Andhra Pradesh: CM Jagan Comments On Chandrababu And Yellow Media In Kalyandurg - Sakshi
Sakshi News home page

చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు: సీఎం జగన్‌

Published Sat, Jul 8 2023 12:58 PM | Last Updated on Sat, Jul 8 2023 5:21 PM

Cm Jagan Comments On Chandrababu And Yellow Media In Kalyandurg - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ, బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు.

‘‘ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టాం. ప్రతి ఏటా మూడు విడతల్లో వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నాం. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

‘‘ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోంది. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబు కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయి’’ అని సీఎం దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం​ వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు.

‘‘ఏ సీజన్‌లో పంటనష్టం జరిగినా ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం అందిస్తున్నాం. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం​ చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు.

‘‘మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని సీఎం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement