councilor
-
బీఆర్ఎస్ మహిళా నేత ఆత్మహత్య.. వివాహ వేడుకలకు హాజరై..
మిర్యాలగూడ అర్బన్ : మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా కౌన్సిలర్ బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్, శివాని హైస్కూల్ చైర్మన్ కుందూరు నాగలక్ష్మి(45) తన భర్త కుందూరు శ్యాంసుందర్‌రెడ్డితో కలిసి స్కూల్ హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులో నివాసముంటున్నారు. తన భర్తతో కలిసి గురువారం రాత్రి ఓ వివాహ వేడుకలకు హాజరై రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చారు. అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించిన ఆమె శుక్రవారం ఉదయం బయటకు రాలేదు. రోజువారీ పనుల్లో భాగంగా శ్యాంసుందర్‌రెడ్డి బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. బెడ్రూం తలుపు వేసి ఉండటంతో ఎంతకు తలుపు రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపును తెరిచి చూడగా నాగలక్ష్మి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ పి.వెంకటగిరి కౌన్సిలర్ బలవన్మారణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అమెరికాలో ఉన్న తన తమ్ముడు వచ్చే వరకు మృతదేహాన్ని భద్రపరిచేందుకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నాగలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందని, మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి సరోజనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిలర్ మృతితో మిర్యాలగూడలో విషాదం అలుముకుంది. ఎమ్మెల్యే పరామర్శ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి పంపే వరకు ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. మృతురాలికి కుమారుడు కేశవ సుదీప్‌రెడ్డి, కూతురు జీవన సంయుక్త ఉన్నారు. -
యూకేలో కౌన్సిలర్‌గా ఎన్నికైన తెలుగు వ్యక్తి మువ్వల చంద్రశేఖర్
ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో లండన్ నగరంలో గల 'స్లో బరో' లోని లాంగ్లే మేరీస్ వార్డు నుంచి అందరు తెలుగు వ్యక్తులు గర్వపడేలా రెండవసారి అత్యధిక మెజారితో 'మువ్వల చంద్రశేఖర్' గెలుపొందారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బ్రిటన్ ప్రధాన మంత్రి 'రిషి సునాక్' నేతృత్వం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నుంచి బంపర్ మెజారితో గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా నా గెలుపుకి సహకరించిన యూకేలోని తెలుగువారందరికీ ఎల్లవేళలా ఋణపడి ఉంటానని పేర్కొన్నారు. లాంగ్లే మేరీస్ వార్డులో ఉన్న వివిధ దేశాలవారందరికీ తనవంతు సహకారం అందించి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో నేను వార్డు సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని గుర్తించి మళ్ళీ అవకాశం కల్పించినందుకు తప్పకుండా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. థేమ్స్ నదీ తీరాన ఒక తెలుగు బిడ్డగా గెలుపొందడం నాకు గర్వంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆప్యాయమైన స్నేహం, మంచి పలకరింపు తనం తన సొంతమని తోటి స్నేహితుడు, తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అడ్వైజరీ చైర్మన్ వెంటెద్దు మట్టారెడ్డి అన్నారు. -
వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి
జడ్చర్ల: వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్‌గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన చైతన్య, వసీంలు పట్టణంలోని 25వ వార్డు పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌లో తనను కూడా సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుతూ కౌన్సిలర్ లత కోరగా...అడ్మిన్‌గా అవకాశం కల్పించారు. కొద్దిరోజుల తర్వాత గ్రూపు నుంచి తమనే తొలగించిందని, తమ గ్రూపును తమకు ఇప్పించాలంటూ చైతన్య, వసీంలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై సదరు కౌన్సిలర్ స్పందిస్తూ...గ్రూప్‌ను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలనే తాను అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నానని, తాజా ఫిర్యాదుతో తాను ఆ గ్రూప్‌నుంచి వైదొలుగుతున్నానని, మరో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు. -
కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్!
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్): అది విద్యుత్ శాఖకు చెందిన సబ్‌స్టేషన్ స్థలం.. దానిలో షెడ్లు నిర్మించడానికి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నించారు.. ఇదేమిటని అడ్డుకున్న విద్యుత్ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ తీరుతో మండిపడ్డ విద్యుత్ సిబ్బంది పట్టణం మొత్తానికి కరెంట్ కట్ చేశారు, జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్‌బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో చిరు వ్యాపారులు షెడ్లు కోల్పోయారు. వారికి స్థానిక సబ్‌స్టేషన్ స్థలంలో షెడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు నిర్ణయించారు. సోమవారం సబ్‌స్టేషన్ ఆవరణలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ రామ్మూర్తి, లైన్మెన్లు అక్కడికి చేరుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ స్థలంలో షెడ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటూ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని విద్యుత్ లైన్మెన్లు పాషా, సృజన్ వీడియో తీయడం మొదలుపెట్టారు. అది చూసిన కౌన్సిలర్లు రెవెల్లి మహేశ్, వేల్పుల సుధాకర్, 11వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల స్వర్ణలత భర్త, ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుడిగా పేరున్న లక్ష్మణ్ తదితరులు ఆగ్రహంతో లైన్‌మన్లపై దాడి చేశారు. విద్యుత్ సరఫరా నిలిపేసి నిరసన తమ ఉద్యోగులపై దాడికి నిరసనగా విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది చెన్నూర్‌లో సుమారు 6 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంచిర్యాల– చెన్నూర్ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. -
కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్..
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ కీచకుడిలాగా ప్రవర్తించాడు. తాడిపత్రికి చెందిన 33 వ వార్డు కౌన్సిలర్ విజయ్‌కుమార్ ఒక మహిళను వేధించడమే కాకుండా అసభ్యపదజాలంతో మెసేజ్‌లు పంపాడు. దీంతో విసిగిపోయిన సదరు మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చదవండి: ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు...
భార్యాభర్తల స్థితి నుంచి తల్లిదండ్రులవ్వటం అనేది ప్రకృతి సహజంగా జరుగుతున్న మార్పు. అంతవరకు ఆడుతూపాడుతూ ఉన్న జంట, ఒక్కసారిగా బాధ్యతగల తల్లిదండ్రులుగా మారిపోతారు. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిద్రాహారాలకు దూరమౌతారు. ఇది సృష్టి ధర్మం. ఇటీవల లండన్‌లో జరిగిన సంఘటన తల్లులు ముక్కున వేలేసుకునేలా చేసింది. సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. లండన్‌కి చెందిన 19 సంవత్సరాల వెర్ఫీ కుడీకి 20 నెలల పసి పాప ఉంది. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటం వల్లనేమో, ఆమె తన సరదాలకు దూరంగా ఉండలేకపోయింది. కుడీ తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకోవటం కోసం ఇంటి నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎలిఫెంట్ అండ్ క్యాజిల్‌కి వెళ్లారు. అక్కడే ఆరు రోజుల పాటు ఉండిపోయారు. ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పసిపాప. తిరిగి వచ్చిన తనకు కుమార్తె చనిపోయి కనిపించింది. అందుకు తాను బాధపడట్లేదని, ఇది అతి సహజంగా జరిగిందంటున్నారు వెర్ఫీ కుడీ. ఇది ఇలా ఉంటే... ఖమ్మంలో గిరిజన జాతికి చెందిన కవిత, కావ్య, రాణి అనే ముగ్గురు మహిళల మీద హత్యానేరం మోపబడింది. అక్కడి రైతులు పత్తి పంట పండిస్తున్నారనే కోపంతో వీరు ఆ రైతుల మీద హత్యా యత్నం తలపెట్టడంతో అక్కడి ఆదివాసీలకు జైలు శిక్ష వేశారు. అందులో ఈ ముగ్గురూ పసిపిల్లల తల్లులు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు తల్లులతో పాటు జైలు జీవితం అనివార్యంగా గడపాలి. అక్కడ ఆ తల్లి తన వేడుక కోసం పసిబిడ్డను విడిచిపెట్టి, ఆమె మరణానికి కారణమయ్యారు. ఇక్కడ ఆవేశంలో చేసిన పనికి ఈ పసిపిల్లలు బలవుతున్నారు. నిండు నూరేళ్ల జీవితం మసకబారిపోతోంది. తల్లిదండ్రులతో గడపవలసిన బాల్యం ఒకచోట బాల్య దశలోనే ముగిసిపోయింది, మరోచోట బాల్యమంతా జైలులో గడవబోతోంది. ‘‘ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీనేజ్ తల్లుల సమస్యలపై దృష్టి సారించాలి. సరైన వయసు వచ్చేవరకు తల్లి కాకుండా చట్టాలు సవరించాలి. తల్లి కాబోయే ముందు రాబోయే సాధక బాధకాలు వివరంగా తెలియజేయాలి. సరైన పెంపకంలో పెరగని పిల్లలు ఏ మార్గంలో పయనిస్తారో చెప్పడం కష్టం. ఆ దుస్థితి ముందు తరాల వారికి రాకూడదంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కళ్ళు తెరవాలి’’ అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్ శ్రీమతి కె. శోభ. తల్లిదండ్రుల లాలనలో బాల్యం అందంగా గడవాలి. వృద్ధాప్యంలో సైతం బాల్యాన్ని తలచుకునేలా ఉండాలి. అటువంటి బాల్యం మొగ్గలోనే వాడిపోవటం, జైలులో గడవటం... పిల్లల ఎదుగుదలకు అవరోధాలు. ‘‘జైలుకి వెళ్లిన ఆదివాసీలు తమ పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి. అందువల్ల ఆ పిల్లలు జైలు వాతావరణంలో పెరుగుతారు. వాళ్లని లోపల ఉంచే హక్కు ఎవరికీ లేదు. ముగ్గురు పాపంపుణ్యం తెలియని పిల్లల్ని అక్కడ ఉంచటం వల్ల వాళ్లకి ప్రపంచం తెలియదు. తల్లులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు. పిల్లల్ని బతికించుకోవటానికి వారు ఈ పనులు చేశామంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వారు ‘అడవి మా హక్కు’ అన్నారు. తరతరాలుగా అది వారి హక్కు. ఒక ఆదివాసీ ఒక మాట అన్నారు, ‘చెరువులో నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా’ అని. ఆదివాసీలు చెట్లు కొట్టడం వల్ల అడవి తరిగిపోదు. ఆవేశంలో వారు చేసిన పనికి, ఆ తల్లుల కారణంగా పిల్లల్ని జైలులో పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. పిల్లలు స్వేచ్ఛను అనుభవించటం కోసం తల్లుల్ని వదిలేయాలి’’ అంటున్నారు సామాజిక వేత్త దేవి. ఇప్పుడు వెర్ఫీ కుడీకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఖమ్మం మహిళలకు కూడా జైలు శిక్ష పడింది. – వైజయంతి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి! అంతులేని స్వేచ్ఛ, సమానత్వం పొంగిపొర్లే దేశం ఒకటి. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొనే దేశం మరోటి. రెండుచోట్లా బాధితులు పసివారే. దేశాల అభివృద్ధితో సంబంధం లేదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి. తల్లి తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. కానీ తల్లే తన పసికందు మరణానికి కారణమవడం విచారకరం. పైగా విచారణలో కూడా ఆమెలో బాధ, పశ్చాత్తాపం కనపడలేదట. మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం లేకుండా అమాయకంగా ప్రేమలో చిక్కుకునే అమ్మాయిలు ఇలాగే ఉంటారు. రైతు మహిళల అరెస్టు సైతం ఇదే కోవకు వస్తుంది. తల్లులు జైలులో ఉంటే పాల బుగ్గల పసివారి సంగతి ఏమిటి ? ఇటీవలి కాలంలో తల్లుల కోపానికి బలవుతున్న పిల్లల సంఘటనలు అనేకం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం సరైన చదువు లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం. - కె. శోభ , ఫ్యామిలీ కౌన్సెలర్ వారిని నిందించకూడదు.. పసిబిడ్డను నిర్లక్ష్యం చేయటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు 20 సంవత్సరాల లోపు వయసున్నవారు పిల్లల్ని కనకూడదు. అనివార్యంగా కన్నప్పటికీ వారికి బాధ్యతగా పెంచటం తెలియదు. వెర్ఫీ కుడీ చేసిన పనికి ఆమె మీద నింద మోపకూడదు. ఆడుకునే వయసులో తిరగాలనే కోరికను వదులుకోలేరు. వాళ్లకి బాధ్యత తెలీదు. బిడ్డను పెంచలేమనుకుంటే, బేబీ కేర్ సెంటర్లకు అప్పచెప్పాలి. అలా చేసి ఉంటే ఆ పసిపాప మొగ్గలోనే రాలిపోయేది కాదు కదా. ఇలా చేయటాన్ని సమర్థిస్తున్నామని కాదు. అదొక మార్గం మాత్రమే అని చెబుతున్నాం. – దేవి, సామాజికవేత్త -
Arun Mummalaneni: యూకే ఎన్నికల్లో ‘అరుణోదయం’
తెనాలి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముమ్మలనేని అరుణ్ (45) యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 7న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ గెలిచారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా గెలుపొందడం విశేషం. ఈ పదవిలో అరుణ్ నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. రేపల్లె సమీపంలోని మైనేనివారిపాలెం గ్రామంలో జన్మించిన అరుణ్ అమృతలూరు మండలం మోపర్రులో అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగారు. ప్రస్తుతం యూకేలో డిఫెన్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అరుణ్ తండ్రి వెంకటరావు ఎక్స్ సరీ్వస్‌మెన్. తల్లి కృష్ణకుమారి గృహిణి. అరుణ్ కొత్తగూడెంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా! ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా -
‘అసెంబ్లీలో కలకలం: ఆత్మహత్యకు యత్నం’
న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె అధికార పార్టీకి చెందిన నాయకురాలే కావడం గమనార్హం. ఆమె చర్యతో ఆ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు అందరూ కల్పించుకుని ఆమెతో ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం ఆ సమస్యపై ఆమె ప్రభుత్వ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలోని మల్కాగంజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ గుడి దేవి మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి హాజరైంది. అయితే సమావేశానికి కిరోసిన్ బాటిల్‌తో వచ్చింది. తన ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్మికులను తొలగించారని ఆమె ఆందోళన చేసింది. 206 మంది ఉండాల్సిన కార్మికుల్లో 115 మందిని తొలగించడంతో ప్రస్తుతం 85 మంది ఉన్నారని తెలిపింది. దీంతో తన ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయింది. సమస్య పరిష్కరిస్తారా లేదా అని కిరోసిన్ బాటిల్‌తో గుడి దేవి హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్ డబ్బాను తీసుకుని శాంతపరిచారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. -
మున్సిపల్ ఫలితాలు: ఇంగ్లిష్ మహాలక్ష్మి!
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి ప్రత్యేకంగా నిలిచారు. ఇంటర్ చదివి టీటీసీ పూర్తి చేసిన మహాలక్ష్మికి అధికారులు తెలుగులో ఉన్న ప్రమాణ పత్రాన్ని అందించారు. ఆమె దాన్ని సొంతంగా ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసుకుని మరీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చదవండి: తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
నే గెలిచా... లేవండీ!
అమలాపురం టౌన్: ఏవండీ.. లేవండీ.. ఎన్నికల్లో నే గెలిచా.. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. మీరు లేరనే మాట నన్ను కుంగదీస్తుందండీ... అంటూ అమలాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి ఆమె భర్త మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుర్గాబాయి తల్లి శనివారం తెల్లవారు జామున మరణించారు. ఆ బాధను దిగమింగుకుని తప్పని పరిస్థితుల్లో అమలాపురం ఎస్కేబీఆర్ కౌంటింగ్ హాలుకు ఆదివారం ఉదయం ఆమె వచ్చారు. లెక్కింపు సమయంలో బరువెక్కిన హృదయంతోనే ఆమె ఉన్నారు. పదో వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించడంతో అంతా కృతజ్ఞతలు చెబుతుండగా.. ఇంతలో ఆస్పత్రిలో ఉన్న తన భర్త కూడా మరణించినట్లు సమాచారం తెలియడంతో కుంగిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, భర్త చనిపోవడంతో ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. వారిద్దరూ ఐసీయూల్లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నా ఆ బాధను దిగమింగి మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేసిన బాధ్యతతో ప్రచారం చేశారు. చివరికి తల్లీ భర్త మరణించడంతో కౌన్సిలర్‌గా గెలిచిన ఆనందం పంచుకునే అవకాశం లేకుండా పోయింది. దుర్గాబాయి దీన గాథను చూసి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానిక ప్రజలు చలించిపోయారు. ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. మంత్రి పినిపే విశ్వరూప్, బేబీ మీనాక్షి దంపతులు, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర సంతాపం తెలిపారు. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
మా భర్తలను అనుమతించండి
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం నెలకొంది. సమావేశానికి తమ భర్తలను అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్‌ను కమిషనర్ అంగీకరించలేదు. దీంతో కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేములవాడలో 5 రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోంది. దీని సమీక్షలో మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఇది అధికారిక సమావేశం.. కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోవాలి’అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనికి చైర్పర్సన్ సహా మిగిలిన కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్న చైర్పర్సన్ సహా కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమాల్లో కేవలం కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావాలి కదా అని బదులిచ్చారు. రెండోసారి కమిషనర్ కౌన్సిలర్లను ఆహ్వానించినప్పుడు మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరయ్యారు. అనంతరం సమావేశం సజావుగా సాగింది. -
ఇదేంది చైర్మన్ గారూ..!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్(వైఎస్సార్) : ఐదు రోజుల క్రితం టీడీపీ 30వ వార్డు కౌన్సిలర్ సీతారామిరెడ్డిని ఫిబ్రవరి, మార్చి నెలల కౌన్సిల్ సమావేశాలకు రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28వ తేదీన కౌన్సిల్ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌కు దిక్కుతోచలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశమే చివరిదిగా చెప్పుకుంటున్నారు. దీంతో కోరం లేక వాయిదా పడిన సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అత్యవసర కౌన్సిల్ సమావేశంగా ఏర్పాటు చేసినట్లు అజెండా రూపొందించి సోమవారం పంపిణీ చేశారు. సస్పెండ్ రద్దు మొదటి అంశంగా... అయితే ఈ అజెండాలో మొదటి అంశంగా సస్పెం డ్ అయిన టీడీపీ కౌన్సిలర్ జి.సీతారామిరెడ్డిని సస్పెండ్ నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ముం దుంచారు. జనవరి 31న జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్ ప్రవర్తనకు చైర్మన్ మున్సి పల్ యాక్ట్, 1965 సెక్షన్ 51–5 ప్రకారం రెండు నెలలు సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 27న నోటీసులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్ 28న జరిగే కౌన్సిల్ స మావేశంలో సభ్యుల నిర్ణయానికి ఉంచాలని కోరా రు. కానీ ఎలాగైనా సీతారామిరెడ్డిని కౌన్సిల్ సమావేశానికి రాకుండా చేయాలని అజెండాలో ఈ అం శాన్ని చేర్చలేదు. కౌన్సిల్ సమావేశానికి ఎవ్వరూ రాక వాయిదా పడటంతో చైర్మన్ మార్చి నెల సమావేశం మొదటి అంశంగా చేర్చాలని చెప్పారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా సస్పెండ్ చేయడమేంటి సారూ.. కౌన్సిల్ సభ్యున్ని రెండు, మూడు నెలలు సస్పెండ్ చేయాలంటే సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన మరుసటి సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయితే అదేదీ తమకు వర్తించదన్నట్లు, రెండు నెలలు సస్పెండ్ చేసిన చైర్మన్ వారం రోజులకే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాలోకి తీసుకురావడంపై తోటి కౌన్సిలర్లు నవ్వుకుంటున్నారు. తప్పుడు విధానాల్లో సస్పెండ్ చేసిన చైర్మన్, కమిషనర్లపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని కౌన్సిలర్ సీతారామిరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు అంటున్నారు. ముక్తియార్ మాటపై నిలబడతారా... టీడీపీ కౌన్సిలర్ సీతారామిరెడ్డిని సస్పెండ్ చేసిన సందర్భంలో కౌన్సిలర్ ముక్తియార్ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఇక తాము ఏ కౌన్సిల్ సమావేశాలకు వెళ్లమని, అన్నీ రిక్విజేషన్ సమావేశాలే నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విధంగా మంగళవారం జరిగే సమావేశానికి ఎంపీ రమేశ్ వర్గం టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా మాట నిలబెట్టుకుంటారా, లేక అంతా ఉత్తుత్తి ప్రకటనలేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మెజారిటీ లేకుండానే ర్యాటిఫై... చైర్మన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని అంశాలను ర్యాటిఫై చేయాలని అనుకుంటే మెజారిటీ కౌన్సిల్ సభ్యులు తన వర్గంలో ఉండాలి. అప్పుడు ఆ అంశం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోతుంది. అయితే ఈ చైర్మన్ వర్గంలో 9 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ రమేశ్ వర్గంలో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ రెండో అంశంలోని రూ.39.88 లక్షల పనికి, 3వ అంశంలోని రూ.39 లక్షల పనికి, 6వ అంశంలోని రూ.39 లక్షల పనికి దాదాపు రూ.కోటికిపైగా పనులకు ర్యాటిఫై చేశారు. మరి కౌన్సిల్ సభ్యులు ఈ అంశాలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో కోరితే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. చైర్మన్ చర్యలపై భగ్గుమంటున్న టీడీపీ కౌన్సిలర్లు ఈ అంశాలను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. -
ఫిరాయింపు కౌన్సిలర్ వినూత్న నిరసన
-
బీజేపీ కౌన్సిలర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు
వడోదర : గుజరాత్లో ఓ బీజేపీ కౌన్సిలర్‌కు ప్రజలు చుక్కలు చూపించారు. నిర్మాణాల కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెట్టుకు కట్టేసి కొట్టారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. హష్ముఖ్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్లో బీజేపీ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. అయితే, వడోదర మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ఆదేశాల మేరకు స్ధానిక అధికారులు ఆ ప్రాంతాల్లోని ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి వేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రాంత వాసులంతా మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లగా తాము నోటీసులు పంపించామని, కౌన్సిలర్ వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో మరింత ఆగ్రహంతో అక్కడికి వెళ్లి ఆయనను ప్రశ్నించగా తనకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వారంతా కూడా ఆయనపై చేయి చేసుకున్నారు. చెట్టుకు కట్టేసి చొక్కా చింపేసి పిడిగుద్దులు గుప్పించారు. తమ ఇళ్లను కూల్చి వేసే నోటీసులు వచ్చినా ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా కూడా మారింది. దీనికి సంబంధించి 30మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
అడ్డదారితో అసలుకే ఎసరు
ఏలేశ్వరం : ‘ఏరు దాటే వరకూ బోటు మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య’ అన్న రీతిలో వ్యవహరించిన అవకాశవాదానికి భంగపాటు తప్పలేదు. పదవి కోసం పార్టీ ఫిరాయించిన ఆ నాయకురాలు చివరికి ‘రెంటికీ చెడక’ తప్పలేదు. హెచ్చరిఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచి, తర్వాత టీడీపీ ప్రలోభాలకు లొంగి, చైర్పర్సన్ పదవిపై వ్యామోహంతో ఆ పార్టీలోకి ఫిరాయించిన కొప్పాడ పార్వతిపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులను కోల్పోయారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, ఇందిరాసాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారథి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ కేటీ సుధాకర్ గురువారం తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీకి పది, వైఎస్సార్ సీపీకి తొమ్మిది, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. టీడీపీకి ఆధిక్యత ఉన్నా చైర్పర్సన్ పదవిని చేపట్టడానికి ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందలేదు. ఎస్సీ మహిళలకు కేటాయించిన రెండు వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీటితో పాటు మరో రెండు జనరల్ వార్డుల నుంచీ ఆ పార్టీకే చెందిన ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామంతో టీడీపీ అనైతికంగానైనా చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎస్సీ మహిళా కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలు పెట్టింది. చివరికి ఆరో వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన కొప్పాడ పార్వతి పార్టీ ఫిరాయించి, టీడీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీనిపై వైఎస్సార్ సీపీ విప్ సామంతుల శ్రీరామసూర్యకుమార్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఎన్నికల అధికారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్వతిపై అనర్హత వేటు వేశారు. వైఎస్సార్ సీపీలో ఆనందోత్సాహాలు చైర్పర్సన్ పార్వతిపై అనర్హత వేటు పడడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక బాలాజీ చౌక్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. చివరికి న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. పార్టీ నేతలు అలమండ చలమయ్య, సామంతుల సూర్యకుమార్, బదిరెడ్డి గోవిందు, మలకల వేణు, వాగుబలరామ్, దాకమర్రి సూరిబాబు, తొండారపు రాంబాబు, పతివాడ బాబూరావు, గంగిశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు వాడపల్లి శ్రీను, బదిరెడ్డి అశాలత, గొడత చంద్ర, భజంతుల మణి, ఎస్ఎం సుభానీ, వరుపుల నె హ్రూ, కోసూరి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
ఓటయితే ఎయ్యరాదే..!
నాయకుడు : ‘తాత మన వార్డు కౌన్సిలర్ సీటు ఆడోళ్లకచ్చిందే. నా భార్యను నిలబెట్టిన. ఏట్లైన మనమే గెలుస్తమన్న నమ్మకముందే. ఎందుకైన మంచిదని ముందగల్లా మన అనుకున్నోళ్లను కలుస్తున్న. మన గల్లీల ఏఇంట్లో ఎంతమంది ఉన్నరో.. ఓళ్లకు ఎంజెప్తే సమజైతదో నీ పక్కా ఎరుక్కుంటదని అచ్చిన్నే. మన గల్లీలో రచ్చబండ పెట్టినప్పుడు ముసలోలందరిని కూడగట్టుకుని ఫించన్లు కావాలే.. అని లొల్లి పెట్టి, అచ్చిన ఆఫీసర్లను పరేషాన్ జేసినవ్ గదనే. మీ లొల్లికి బుగులు పడి ఫించన్ రానోళ్లందరి అప్లికేషన్లు తీసుకున్నరు. తాత : అవ్ బిడ్డ మంచి ముచ్చట యాదిజేసినవ్. నాఅసుంటి ముసలోల్లు పాపం పించిన్లు రాక,అరిగోసపడుతున్నరు. గల్లీల మీటింగ్‌లు పెట్టినప్పుడల్లా అప్లికేసన్లు ఇచ్చుడుకే సరిపోయింది. పించిన్లు రాలేదు. మీటింగులల్లా 65 ఏళ్ల నిండి గరీబోళ్లందరికి ఫించన్లు ఇస్తమని, దరఖాస్తుపెట్టుకొమ్మని లీడర్లు, ఆఫీసర్లు చెబితే నమ్మి ఆశపడ్డం. పెద్ద లీడర్లు చెబుతున్నరు నిజంగా ఇత్తరేమోనని కూడబెట్టుకున్న పైసలు ఖర్సుబెట్టి ఫొటువోలు దిగి, అప్లికేసను పెట్టుకున్నం. ఆడికెళ్లి పించిన్ కోసం తిరగనిగడప, మొక్కని కాళ్లు లేవు బిడ్డ. ఎవరికి కనికరం రాలేదాయె. దేవుడా నీవె దిక్కని దినాలు ఎల్లదీస్తున్నం. ఎవరిని అడిగిన.. ఇగో అస్తయ్ అగో అస్తయ్ అంటున్నరు. ఇప్పుడేమో ఎలచ్చన్లు అచ్చినయ్, అయ్యిపోయేదాక రావంటున్నరు. మళ్లీ ఓట్లడుగ అస్తర గదా బిడ్డ అప్పుడు శెప్తామని ఎదురుచూస్తున్నం. నాయకుడు: తాతా ఇగో గా పార్టీ రాజుగాడు గట్లనే జెప్పి అందర్ని పరేషాన్ జేసిండు. ఇగ రందిపెట్టుకోకు. ఈ ఎలచ్చన్ల నా భార్యను గెలుపిస్తే, గల్లీల ఇంటింటికి తిరిగి ముసలోల్లందరి పేర్లు రాసుకుని, అల్లకు పించిన్లు ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకముంచే.. నేన్ జూస్కుంట. మీకందరికి పించిన్లు ఇప్పించే జిమ్మెదారి నాది, ఏం ఫికర్ జేయకు. తాత: పోయిన ఎలచ్చన్ల కౌన్సిలర్‌గా గెలిసిన రాజుగాడూ.. ఓట్ల ముందు గివే మాటలు జెప్పిండు.. మరి గెలిసినంక అడిగితే. తాత నాచేతుల ఏముంది, సర్కారోళ్లు ఇస్తేనే గదా అన్నడు. మల్ల మల్ల అడిగితే కోపమైతుండని, ఇడసబెట్టేసినం. పించిన్లు, ఇల్ల జాగలు , రేషన్‌కార్డులు, ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తమని మస్తు మాటలు జెప్పిండు. కడుపు కాలేటోళ్లకు రాలేదు. పెద్ద లీడర్లు చెప్పినోళ్లకొచ్చినయ్. ముచ్చట్లపడి అసలు మాట మరిసిపోయిన బిడ్డ.. ఓట్లల్ల నువ్వే నిలబడుతున్న అంటివి గదా? నాయకుడు : అవ్ తాత.. నేనే పోటీ చేద్దామనుకుని, యాడాది సంది గల్లీలదిరుగుతున్న. అందరి కాడి కెళ్లి చెప్పిన. అందరు మంచ్చిగన్నరు. గని ఏంజేద్దాం. నా అదృష్టం బాగ లేదేమో. మన గల్లీ సీటు ఆడోల్లకు అచ్చింది. ఆడోళ్లను ఇంటి బయటకు తెచ్చుడెందుకని సప్పుడు సెయకుండా ఉన్నుంటి. ఓ పార్టీవోల్లు మేమే ఖర్సుపెడుతం పోటీ చేయమని కబురు పంపిండ్రి. జర ఇంట్ల అరుసుకుంటని జెప్పిన, టైం లేదు.. ఎనకముందు సూడకు మేమున్నం గదా అన్నరు ఆ పార్టీవోళ్లు. గంతే పెళ్లాంను ఎంట దీస్కుని పోయి నామినేషన్ ఏసొచ్చిన. తాత : అవ్ బిడ్డ.. నీ భార్య ఓట్లల్ల గెలిస్తే గల్లీల్ల తిరగాలే. మీటింగులకు పోవాలే. గల్లీలో మంచి చెడ్డ ఏం జరిగిన ముందుగల్ల నిలబడాలే. ఎవరికి ఏమాపత్ అచ్చిన సూడాలే. నీకేమో పెద్దగా కూడవెట్టినై లేకపాయే. ఉన్న రెండెకరాల ఎవుసం చేసుకుని బతకాలే. పెళ్లాం నువ్వు చెరొక పని చేసుకుంటే మంచిగా బతకొచ్చు గదా. గీ ఓట్లల్ల నిలబడితే నీకేమోస్తదంటవ్. ఎలచ్చన్లంటే వట్టిది కాదు. లచ్చలు ఖర్సు పెట్టాలే. పార్టీలోల్లు ఎంతిస్తరు బిడ్డ. బాకీ చేసుకుని పరేషాన్ గాకు. ఒకయాల నీ పెళ్లాం గెలిచిందనుకో.. ఇంట్లో పని వోళ్లు జేస్తరంటవ్. నీ కిద్దరు పిల్లలున్నరు గదా. పొద్దుగల్లానే ఆళ్లని తయారుజేసి బడికి పంపాలే. గిట్ల మస్తు పనులుంటయ్. నాయకుడు: నువ్ జెప్పింది సైయే తాత. నా పెళ్లాం గెలిస్తే యాడికిబోదు. నేనే అన్నీ జూస్కుంట. మూడు నెలకొపారి మున్సిపాలిటిల మీటింగ్ ఉంటదట. దానికి బోతే సరిపాయే. గల్లీల దిరిగేదిముంటది. ఎవుసం చేసుకుంటా అంతా నేనే చూస్తా. తాత: ఇంతకి మన గల్లీల ఎంతమంది పోటీ జేస్తుండ్రు. పెద్ద లీడర్ల సుట్టాలు ఏవరైన ఉన్నరా? పోయిన ఎలచ్చన్ల గెలినోళ్లు, గెలువ నోళ్లు, పక్క గల్లీల నుంచి వచ్చినోళ్లు పోటీ జేస్తుండ్రని విన్న బిడ్డ నిజమేనా? పెద్ద లీడర్లు గల్లీల్ల పెచారంకు అస్తరటని గూ విన్న బిడ్డ.. నాయకుడు: అవ్ తాత.. మస్తుమంది నామినేషన్లు ఏసిండ్రు. రెండు రోజుల దాకా పోటీల ఎవరుంటరో దెల్వదు. ముందగల్ల నా సంగంతి సూడరాదే. పెద్ద,సిన్న లీడర్ల ముచ్చట మనకేందుకే తాత. తాత: గిప్పుడు అసలు ముచ్చట కాడికి అచ్చినవ్. మన గల్లీలో ఏళ్ల కిందట కట్టిన మోరీలు కూలీపోయినయ్, గలీజు నీళ్లు రోడ్లమీదకొచ్చి కంపు ఆసనోస్తుంది, ఆనకాలంలా సంటి పోరగాండ్లకు రోగాలొచ్చి దవాఖానకు పాలైండ్రు. మన గల్లీ పక్కపొంటి పారుతున్న చెరువు కాల్వలో మేము సిన్నప్పుడు ఈతకొట్టినం, నీళ్తు ఎప్పుడు తాజాగా ఉండేయి. ఇప్పుడేమో మోరీల నీళ్లు కలిసి కంపు ఆసనొస్తుంది. పెద్దలీడర్లు గల్లీల్ల ఓట్లడుగ అస్తే అల్ల సంగతి అరుసుకుందామని జూస్తున్నా. నాయకుడు : ఇగో తాత గా పెద్దలీడర్లను ఏమన్న అడుక్కో.. ఏమన్న జేస్కో.. గని నా మాట యాదికుంచుకో. జర మనోళ్ల ఓట్లన్నీ మనకే ఏసేటట్లు సూడే. గా పక్క గంగన్న తాత దగ్గరికి గూడ పోయి ఓ మాటజెప్పెస్తా.