తెనాలి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముమ్మలనేని అరుణ్ (45) యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లోని హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 7న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ గెలిచారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా గెలుపొందడం విశేషం.
ఈ పదవిలో అరుణ్ నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. రేపల్లె సమీపంలోని మైనేనివారిపాలెం గ్రామంలో జన్మించిన అరుణ్ అమృతలూరు మండలం మోపర్రులో అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగారు. ప్రస్తుతం యూకేలో డిఫెన్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అరుణ్ తండ్రి వెంకటరావు ఎక్స్ సరీ్వస్‌మెన్. తల్లి కృష్ణకుమారి గృహిణి. అరుణ్ కొత్తగూడెంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చదవండి:
Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా!
ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
Comments
Please login to add a commentAdd a comment