
తిరువనంతపురం: కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్ ఉంటుందని సీపీఎం యాక్టింగ్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ చెప్పారు. కోవిడ్‌నేపథ్యంలో ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం పూర్తవుతుందని ఆయన సోమవారం పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వానికి ఓటేసినందున మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఎల్డీఎఫ్ కేబినెట్‌లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని తెలిపారు.
(చదవండి: మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్)