CM pinarayi Vijayan
-
కేరళ లోని మలపురంలో హౌస్ బోటు ప్రమాద ఘటన
-
నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా?
తిరువనంతపురం: కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి.. పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే.. కాల్చేసిన, పాతేసిన ఆనవాలు ఎక్కడా దొరక్కపోవడంతో.. క్లూస్ టీమ్‌కు సైతం ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో తినేసి ఉంటారని భావిస్తున్నారు. రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలుగా చేసినట్లుగా నిందితులు(దంపతులు భగవంత్ సింగ్, లైలా.. స్నేహితుడు షఫీ).. అంగీకరించారు. బహుశా తర్వాత ఆ భాగాలను తినేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఈ మేరకు వాంగ్మూలం ఇవ్వగా.. భగవంత్ సింగ్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఈ విషయంపై ధృవీకరణ కోసం.. ముగ్గురు నిందితులను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. తాంత్రికుడు చెప్పాడని.. జూన్ 8, సెప్టెంబర్ 26వ తేదీల్లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ ఇద్దరినీ నర బలి ఇచ్చినట్లు విచారణలో తేలింది. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక నిందితుల కస్టడీ కొరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భగవంత్ సింగ్ మసాజ్ థెరపిస్ట్. దీంతో డబ్బు ఆశతో పాటు నిందితుల లైంగిక ఆనందం, తాంత్రిక పూజల కోణంలోనూ ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. రోజెలిన్, పద్మను కట్టేసి.. ఆపై క్రూరంగా చంపి.. ఆపై ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. రోజెలిన్ జూన్ నుంచి కనిపించకుండా పోగా.. కడవంతర(ఎర్నాకుళం)కు చెందిన పద్మ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయ్యింది. పద్మ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ నరబలి వ్యవహారం చిక్కింది. షఫీ వాళ్లను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. సీఎం పినరయి విజయన్ స్పందన ఇక భగవంత్ సింగ్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, అధికార పార్టీ మూలాలు ఉండడంతో.. బీజేపీ విమర్శలకు దిగింది. దీంతో ఈ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కేసును త్వరగా చేధించిన పోలీసులను అభినందిస్తూ.. సిట్ బృందం ద్వారా విచారణ కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరబలి రాకెట్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారాయన. జబ్బుపడిన మనస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కార్యకలాపాల్లో మునిగిపోతారని, ఇలాంటి ఆచారాలు నాగరిక సమాజానికి సవాలుగా పరిణమిస్తాయని విజయన్ పేర్కొన్నారు. సంబంధిత వార్త: మహిళల బలి.. తల నరికి, నాలుక కోసి.. -
రెండు రోజులుగా చావు అంచున వేలాడుతూ, చివరికి..
ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్ ఆర్మీ ఎంట్రీతో సీన్ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు. సీఎం చొరవతో.. కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది. ముందు తిండి.. ఆపై బాబును సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక.. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు. Worries have been put to rest as the young man trapped in the Cherad hill in Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/YAwHQOxZAP — Pinarayi Vijayan (@vijayanpinarayi) February 9, 2022 -
Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం: కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్ ఉంటుందని సీపీఎం యాక్టింగ్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ చెప్పారు. కోవిడ్నేపథ్యంలో ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం పూర్తవుతుందని ఆయన సోమవారం పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వానికి ఓటేసినందున మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఎల్డీఎఫ్ కేబినెట్లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని తెలిపారు. (చదవండి: మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్) -
కేరళకు ‘మలబార్ గోల్డ్’ 7 కోట్లు విరాళం
తిరుపతి కల్చరల్: కేరళ వరద బాధితుల సహాయార్థం మలబార్ గోల్డ్ గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో రూ.7 కోట్లు విరాళంగా అందజేసినట్లు తిరుపతి మలబార్ గోల్డ్ డైరెక్టర్లు రెజీష్, హరి తెలిపారు. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రంలోని అన్ని మలబార్ బ్రాంచ్‌లు స్పందించి ఈ నిధులను సమకూర్చాయన్నారు. ఇందులో రెండు కోట్లు తక్షణ సాయంగా, 5 కోట్లు నిరాశ్రయుల కోసం మలబార్ హౌసింగ్ చారిటీ ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మలబార్ గ్రూప్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ కేరళ ముఖ్యమంత్రిని కలిసి చెక్కును అందించినట్లు తెలిపారు. -
కేరళ పునర్నిర్మాణం: సీఎం వినూత్న సూచన
తిరువనంతపురం: ప్రపంచంలోని కేరళీయులందరూ నెలజీతాన్ని విరాళమివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్త కేరళను పునర్నిర్మించుకోడానికి సాయపడాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి దాతలకు ఆయన వినూత్న సూచన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు నెల వేతనం సహాయం చేయడానికి ముందుకొస్తారని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ముఖ్యంగా దాతలు నెలకు మూడు రోజుల జీతం చొప్పున పదినెలలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాలనే సూచన చేశారు. దీని వల్ల దాతలకు పెద్ద భారం ఉండదని పేర్కొన్నారు. కేవలం వరద ప్రభావిత ప్రాంతాలను బాగుచేయడం మాత్రమే కాదు కేరళను పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధించడం సవాలే, కానీ సాధించి తీరాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది, ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా ఉన్న మలయాళీలంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆదివారం సమీక్షించిన కేరళ సీఎం ఇప్పటివరకూ మూడు లక్షలకు పైగా ఇళ్ళు శుభ్రపరిచినట్టు చెప్పారు. దీనితోపాటు ఇళ్లకు చేరిన బాధితులకు 10వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. 1,435 సహాయక శిబిరాలలో రాష్ట్రంలో మొత్తం 4.62 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారని వెల్లడించారు. వీరికి తగినంత ఆహార నిల్వలు ఉన్నాయి, అలాగే పాఠశాలలు బుధవారంనుంచి తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని అన్ని సహాయక శిబిరాలను ఇతర సమీప ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కేరళ వరదల్లో 357మంది చనిపోగా, లక్షలాదిమంది ప్రజలలు నీడ కోల్పోయి అనాధలుగా మిగిలిలారు. దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు వరద బీభత్సంనుంచి కోలుకునే పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రజలు గుండె నిబ్బరంతో శ్రమిస్తున్నారు. -
వరద ప్రళయం
తిరువనంతపురం/కొచ్చి/న్యూఢిల్లీ: కనీవినీ ఎరుగని తీవ్ర విపత్తుతో కేరళ అతలాకుతలమైంది. వర్ష సంబంధ ఘటనల్లో గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం రోజుల్లో మృతుల సంఖ్య 97కు పెరిగింది. వేల సంఖ్యలో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రైలు, విమాన సేవలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాల్లోని 13 జిల్లాల్లో హైఅలర్ట్ హెచ్చరికలు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సుమారు లక్షన్నర మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ నేవీ.. త్రిసూర్, అలువా, మువాత్తుపుజాలో వరదల్లో చిక్కుకున్న బాధితులను విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రక్షణశాఖ కేరళకు మిలిటరీ బృందాలను పంపింది. 35 అదనపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా ద్వారా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. విజయన్‌కు మోదీ హామీ.. ప్రధాని మోదీ గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. ‘కేరళలో వరద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి విజయన్‌తో చర్చించా. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రక్షణ శాఖను కోరాను. కేరళ ప్రజల సంక్షేమం, భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’నని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందని, సహాయక చర్యలకు కేంద్ర సాయం పెంచాలని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరినట్లు సీఎం విజయన్ వెల్లడించారు. ‘ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ తలెత్తలేదు. ఎప్పుడూ వరదలకు లోనుకాని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరదల నియంత్రణకు చేయాల్సినదంతా చేస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. అయినా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని విజయన్ సూచించారు. పెరియార్, చాలకుడి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్న దృష్ట్యా, వాటికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ అప్రమత్తం.. ప్రధాని మోదీ సూచన మేరకు కేరళలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) సమావేశమైంది. కేరళకు సుమారు వేయి మందితో కూడిన 35 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అదనంగా పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 ఎన్డీఆర్ఎఫ్ దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహాయకచర్యలను ముమ్మరం చేసేందుకు అదనపు మానవ వనరులు, పడవలు, హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద బాధితులకు నీరు, ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుదలను కేంద్ర జలసంఘం కమిషన్ చైర్మన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. విరాళాలకు రాహుల్ విన్నపం.. కేరళలో వరద పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం, కేరళ ఇంతటి కష్టకాలాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేరళ తీవ్ర ఇక్కట్లలో ఉంది. ప్రధానితో మాట్లాడి ఆర్మీ, నేవీ దళాలు మోహరించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశా’ అని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా వేదికగా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. తామెక్కడ ఉన్నామో, ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు చేరవేస్తున్నారు. సాయం కోసం విజ్ఞప్తిచేస్తున్న ప్రజల ఫొటోలు బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. పలు వార్తా చానెళ్లు కూడా బాధితులు, వారి కుటుంబాలను కలిపేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఏడు రోజులు ఉచిత కాల్, డేటా సేవలు వరద ప్రభావిత కేరళ ప్రజలకు టెలికాం కంపెనీలు వారంరోజుల పాటు ఉచిత కాల్, డేటా సేవల్ని ప్రకటించాయి. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లందరూ ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించగా, ఎయిర్‌టెయిల్, వొడాఫోన్, ఐడియాలు..తమ ప్రీపెయిడ్ కస్టమర్లు లిమిటెడ్ బ్యాలెన్స్‌తో కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు గడువును పొడిగించాయి. ఈ ఐదు కంపెనీలు వినియోగదారులందరికీ వారంపాటు ఉచితంగా డేటా సేవలను అందిస్తున్నట్లు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ మినహా మిగతా సంస్థలు ఉచిత డేటాకు 1 గిగాబైట్ పరిమితి విధించాయి. నేడు కేరళకు మోదీ.. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ చెప్పారు. శుక్రవారం వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తరువాత మోదీ కొచ్చి బయల్దేరుతారని వెల్లడించారు. రాత్రి అక్కడే బసచేసి శనివారం ఏరియల్ సర్వే చేపడతారని తెలిపారు. వరద బాధితులకు చేయూత పెరంబూరు(చెన్నై): కేరళ ప్రజలను ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ గురువారం కేరళ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ సీఎంను కలసి నటుడు కార్తీ రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. నటులు కమల్‌హాసన్, సూర్య, కార్తీ, శ్రీప్రియ, రోహిణి తదితరులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు, మెట్రోలకు అంతరాయం రాజధాని తిరువనంతపురం నుంచి రైలు సేవలు, కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. త్రిసూర్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడినట్లు వార్తలొచ్చాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల ముళ్లపెరియార్, ఇడుక్కి, ఇదమలాయర్, చెరుతోని గేట్లు ఎత్తేయడంతో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎర్నాకుళం, అలప్పుజా, పత్తినంతిట్టా జిల్లాల్లో వరదల విధ్వంసం సృష్టించింది. రన్‌వేపై చేరిన నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆగస్టు 26 వరకు అన్ని సేవలను నిలిపేస్తున్నట్లు కొచ్చి విమానాశ్రయం ప్రకటించింది. ముత్తం యార్డులో నీటి మట్టాలు పెరగడంతో గురువారం కొన్ని గంటలపాటు కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. సుమారు 25 రైళ్లను రద్దు లేదా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది. అలువా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అప్పుడే పుట్టిన శిశువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మువత్తుపుజాలోని ఓ ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో అందులో సుమారు 200 మంది రోగులు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. మురింగూర్‌లోని ఓ చర్చిలో చిక్కుకున్న సుమారు 1500 మందికి ఆహారం, నీరు అందించాలని మత గురువు పంపిన వీడియో పలు చానెళ్లలో ప్రసారమైంది. కొచ్చి సమీపంలోని శంకరాచార్య సంస్కృత కళాశాలలో వందల కొద్ది విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలిసింది. భుజాలపై చంటిబిడ్డలను మోస్తూ కొందరు ఛాతీ లోతున్న నీటిని దాటుదున్న చిత్రాలు టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. రోడ్లు, బ్రిడ్జీలు కుప్పకూలడం, కొన్నిచోట్ల బీటలువారడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై సహాయక చర్యలకు అదనపు వనరులు సమకూర్చుకునేందుకు నవంబర్ 30 వరకు మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ముళ్లపెరియార్పై తేల్చండి: సుప్రీం కేరళను భారీ వర్షాల నేపథ్యంలో ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టాన్ని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విపత్తు నిర్వహణ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తమిళనాడు, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించాలని సూచించింది. ఈ సందర్భంగా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గింపుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకురావద్దనీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. డ్యామ్‌పై నీటిమట్టంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. డ్యామ్ నీటిమట్టం పెరగడంపై దిగువన ఉన్న ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనిఉన్నాయనీ, దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమై డ్యామ్ నీటిమట్టాన్ని 3 అడుగులు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కమిటీని ఆదేశించింది. అలాగే భారీ వర్షాలు, వరద కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం నాటికి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తాగునీరు, వ్యవసాయం కోసం పెరియార్ నదిపై ఈ డ్యామ్‌ను 122 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మేరకు ట్రావెన్కోర్ రాజు(కేరళ)తో మద్రాస్(తమిళనాడు) ప్రెసిడెన్సీ కార్యదర్శి 1895లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ డ్యామ్‌లోని నీటితో పాటు నిర్వహణ, ఇతర అధికారాలు తమిళనాడు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. కాగా, డ్యామ్ కేరళలో ఉన్నందున అక్కడి ప్రభుత్వానికి కొంతమొత్తం అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కొచ్చిలో వరద నీటిలో మునిగిపోతున్న యువకుడిని కాపాడుతున్న వ్యక్తి వరద నీటిలోనే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం పెరియార్ డ్యామ్ -
కొచ్చి విమానాశ్రయం మూసివేత
తిరువనంతపురం/కొచ్చి: కేరళపై వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్ట గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరింది. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, చిన్న విమానాలను కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయంలో దింపేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. కొచ్చికి రావాల్సిన, కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలూ విధించబోమని విమానయాన సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై విజయన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌లతో చర్చించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీనిచ్చినట్లు విజయన్ చెప్పారు. విద్యుత్తు సరఫరా, సమాచార వ్యవస్థలు, తాగునీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మొత్తం 14 జిల్లాలకూ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఒక్కరోజులోనే వివిధ జిల్లాల్లో కలిపి 25 మంది మరణించారు. వీరిలో 11 మంది మలప్పురం జిల్లాకు చెందిన వారే. కేరళలో వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ఆగస్టు 8 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. నిరాశ్రయులుగా మారిన ఒకటిన్నర లక్షల మందిని శరణార్థి శిబిరాలకు తరలించారు. అన్ని నదుల్లోనూ వరదే పెరియార్, చాలక్కిడిపుజ, పంపా సహా కేరళ వ్యాప్తంగా నదులన్నీ వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ముళ్లపెరియార్ డ్యాం సహా రాష్ట్రంలోని 35 ఆనకట్టల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాదనం దిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూ ర్, కొజికోడ్ జిల్లాల్లో గంటలకు 60 కి.మీ. వేగంతో వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. బుధవారం ఉదయం మలప్పురం జిల్లాలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ఆ ఇంట్లోని దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు మరణించారు. ఇడుక్కి జిల్లాలోనూ ఇళ్లపై కొండ చరియలు పడి ఇద్దరు మహిళలు మరణించారు. త్రిస్సూర్‌లో ఓ మత్స్యకారుడు విద్యుదాఘాతంతో చనిపోయాడు. మంగళవారం రాత్రి మున్నార్‌లో ఓ హోటల్‌పై కొండ చరియలు పడటంతో అక్కడ పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కార్మికుడు మరణించారు. రాజధాని సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. -
తక్షణ సాయం100 కోట్లు
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ తెలిపారు. అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్‌తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్‌నాథ్‌కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
జీవితంలో ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు
తిరువనంతపురం : ప్రకృతి బీభత్సానికి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ చివురుటాకులా వణికిపోయింది. జీవితంలో ఇంతటి ఘోరమైన పరిస్థితిని చూడలేదని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న జనం వాపోతున్నారు. బిక్కు బిక్కుమంటూ శిబిరాల్లో గడుపుతున్న వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో చేదు అనుభం. డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వేరే ఇంటికి మారాం...కానీ కొండచరియలు తమ బంధువులను పొట్టన పెట్టుకున్నాయని, స్థానికులు తన పాపను రక్షించారంటూ అమ్మమ్మ తాతమ్మలను కోల్పోయిన బిబిన్ (23) కన్నీరుమున్నీరయ్యారు. అయితే సుబేష్అనే స్తానికుడు బిబిన్ భార్య, బిడ్డను రక్షించాడు. తెల్లవారుఝామున మా కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. క్రమంగా ఇది చాలా అసాధారణ దుఃఖంతో హృదయ విదారకంగా మారిపోయింది. దీంతో పరిస్థితి అర్థమై తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నామని మరో బాధితుడు చెప్పారు. 59 ఏళ్ల మనియమ్మది ఇదే అనుభవం. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. కొండచరియలు పడుతున్నాయి, భారీ వర్షం, ఇంతలో భయంకరమైన ధ్వనులను వినిపించాయి. అంతే తన పదేళ్ల మనుమరాల్ని తీసుకుని బయటపడ్డానని తెలిపింది. కేరళలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం కన్నీటి సంద్రంగా మారారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 30 మంది చనిపోగా అనేక కుటుంబాల్లోని 54వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అరటి, కొబ్బరి పంటలు నాశనమయ్యాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లోని అతి ప్రమాదకర స్థాయి మరింత ఆందోళన సృష్టిస్తోంది. మరోవైపు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం, కాలికట్లో ఆగస్టు 12వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సహాయ కార్యక్రమాలను సత్వరమే అందించేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్, వాయు దళాలతో పాటు స్థానిక పోలీసు, ఇతర పరిపాలనా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇడుక్కి మున్నార్ రిస్టార్ట్స్‌లో విదేశీయులు చిక్కుకుపోయారు. దాదాపు 54మందిలో సగం మంది ఇక్కడ ఉండిపోయారు. అయితే నేవీ, వాయు రక్షణ దళం బృందం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. ఇది ఇలా ఉంటే ఇప్పట్లో కేరళకు వెళ్లవద్దని అమెరికా హెచ్చరికలు చేసింది. కాగా మృతుల కుటుంబాలకు రూ.4లక్షల సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయినవారికి రూ.పది లక్షల పరిహారం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ ఎత్తున విరాళాల్సిందిగా కేరళ సీఎం ప్రజలకు విజ్తప్తి చేశారు. మరోవైపు వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. వరద పరిస్థితి, అందుతున్న సాయంపై ప్రధానమంత్రి ఇప్పటికే పినరయి విజయన్‌తో మాట్లాడారు. ఇప్పటికే ఒక కేంద్ర బృందం కేరళలో పర్యటించింది. వరద ప్రభావం తెల్సుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. -
‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కత్తితో భవన్ ఆవరణలోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానంటూ హల్ చల్ చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విమల్ రాజ్(46) అనే వ్యక్తి ఈ ఉదయం చేతిలో కొన్ని పేపర్లు.. జేబులో జాతీయ జెండా, కత్తితో కన్నౌట్ ప్లేస్(ఢిల్లీ)లోని కేరళ భవన్ వద్దకు చేరుకున్నాడు. మెయిన్ గేట్ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, కానీ, ఆ పని జరగట్లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతలో అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొడవూర్, కరిపుజ్జాకు చెందిన విమల్‌కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్ రిపోర్ట్‌లేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం ఐబీహెచ్‌ఏఎస్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో సీఎం విజయన్ లోపలే ఉన్నారు. -
సీఎంను చంపేస్తానంటూ వ్యక్తి హల్ చల్!
-
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ముఖ్యమంత్రి!
సాక్షి, హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గురువారం మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లో అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. పోలీసు స్టేషన్‌లోని మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. కేరళ సీఎం విజయన్ రాక సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సెల్యూట్ విజయన్.. పెరియార్ కల నిజం చేశావు!
సాక్షి, చెన్నై: ఆరుగురు దళితులు సహా మొత్తం 36మంది బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఇటీవల కేరళకు చెందిన ట్రావన్‌కోర్ దేవస్థానం నియామక బోర్డు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రావన్‌కోర్ ఆలయ బోర్డు (టీడీబీ) గతంలోనూ బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించినప్పటికీ.. దళితులను పూజారులుగా నియమించడం ఇదే తొలిసారి. మొత్తం 62 మంది పూజారులను తాజాగా టీడీబీ నియమించగా.. అందులో 36మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా రిజర్వేషన్ వర్తింపజేస్తూ.. రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ఆధ్వర్యంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూజారి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 62 పోస్టుల్లో 26మంది బ్రాహ్మణులు పూజారులుగా ఎంపికయ్యారు. కేరళ సర్కారు తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించిన ట్రావన్‌కోర్ ఆలయ బోర్డ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమల్ హాసన్ సెల్యూట్ అర్పించారు. Bravo Travancore Dewasom board.Salute to Kerala CM Mr. Pinarayi Vijayan.4 appointing 36 non-Brahmin priests. Periar's dream realized — Kamal Haasan (@ikamalhaasan) 9 October 2017 -
లాల్–నీల్ జెండాలు ఏకం చేస్తాం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు, సామాజిక న్యాయ (లాల్–నీల్) జెండాలు ఏకమయ్యేలా ఆదివారం హైదరాబాద్‌లో సమరసమ్మేళన బహిరంగసభ జరగబోతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మహాజన పాదయాత్ర కోఆర్డినేటర్ బి. వెంకట్ వెల్లడించారు. శుక్రవారం ఎంబీభవన్‌లో పార్టీ నేతలు జి.నాగయ్య, టి.జ్యోతిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎం పాదయాత్ర నేపథ్యంలో సామాజిక తరగతులను విస్మరిస్తే భవిష్యత్ ఉండదని ప్రభుత్వం గుర్తించిం దన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు చట్టబద్ధతను సాధించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమన్నారు. బీసీలు, ఎంబీసీలకు ప్రకటించిన పథకాలకు బడ్జెట్ కేటాయింపులు, జీవోలు కాకుండా అసెంబ్లీలో చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్‌కు కేరళ సీఎం విజయన్ సీపీఎం బహిరంగసభలో పాల్గొనేందుకు శనివారం రాత్రి కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం 4.30కు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో కేరళ సాంస్కృతిక సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సరూర్‌నగర్ ఔట్‌డోర్ స్టేడియంలో సీపీఎం బహిరంగసభలో ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. -
కేరళ సీఎం పర్యటనను అడ్డుకుంటాం
ఎమ్మెల్యే రాజాసింగ్ సాక్షి, హైదరాబాద్: కేరళలో వీహెచ్‌పీ నేతలను హత్య చేయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఈ నెల 19న సీపీఎం నిర్వహించే బహిరంగ సభలో కేరళ సీఎంను పాల్గొనకుండా నిలువరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. -
కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం..
తిరువనంతపురంః పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులకు పూర్తిస్థాయి మద్దతునిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. రక్షణ రేఖ వెంబడి ఏడు ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యానికి అభినందనలు తెలిపింది. సర్జికల్ స్ట్రైక్ కు పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశాన్ని, ప్రజలను రక్షించేందుకు సైన్యం చేపట్టిన చర్యలను కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా అభినందించింది. దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలతో పరిస్థితి మరింత హీన స్థితికి దిగజారకుండా నివారించాలని, సమస్యకు పరిష్కారం కనుగోవాలని తీర్మానం ద్వారా వెల్లడించింది. దేశాన్ని, ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకున్న భారత ఆర్మీకి అసెంబ్లీ పూర్తిస్థాయి మద్దతును ప్రకటించింది. పఠాన్ కోట్, ఉడి వంటి దాడులను నిరోధించేందుకు ఇకపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. దౌత్య స్థాయిలో సమస్యకు ఓ పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో క్లుప్తంగా ప్రసంగించిన అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల భారతసైన్యం తెలివైన చర్యకు సాల్యూట్ చెప్పారు. . ప్రభుత్వ విధానాలకు పూర్తి మద్దతు పలుకుతున్నామన్న ఆయన.. చాలాకాలంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్నిభారత్ కు ఎగుమతి చేస్తోందని, అందుకు ఇండియన్ ఆర్మీ గట్టి జవాబునివ్వడం మెచ్చుకోదగిన చర్య అని అన్నారు. -
రోడ్డుపై ఆ ఘటన చూసి చలించిపోయిన హీరో!
వానాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లనిండా ఎటుచూసినా గుంతలే.. ఇక వాటిపై ప్రయాణించాలంటే వాహనదారులకు నరకమే కనిపిస్తుంది. ఇలాంటి రోడ్లను ప్రత్యక్షంగా చూసి ఓ నటుడు చలించిపోయాడు. రోడ్డు మీద గుంతల కారణంగా తన ముందే ఓ యువకుడు బైకు మీద నుంచి పడి గాయాలపాలు కావడం ఆయనను కలిచివేసింది. వెంటనే ఫేస్బుక్ వేదికగా ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ ఆయన ఓ వీడియో పెట్టాడు. ఈ వీడియోను 11 లక్షలమంది చూశారు. 35వేలమంది షేర్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోను పెట్టింది మలయాళం హీరో జయసూర్య. తాను చూసిన ఘటనను హృద్యంగా వివరిస్తూ.. అస్తవ్యస్తమైన రోడ్ల కారణంగా పన్నుచెల్లింపుదారులైన సామాన్యులు బలి అవుతున్నారని జయసూర్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లు బాగుచేసి.. ప్రజలను రోడ్డుప్రమాదాల నుంచి కాపాడాలని ఆయన సీఎంకు విన్నవించారు. ఈ వీడియోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రతి ఏడాది రోడ్లు చెడిపోతుంటాయని, వాటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుందని సీఎం విజయన్ ఫేస్బుక్లో తెలిపారు. రోడ్లను బాగుచేసి.. ప్రజలకు మంచి రవాణా అవకాశాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.