కేరళ సీఎంకు చెక్కును అందజేస్తున్న మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్
తిరుపతి కల్చరల్: కేరళ వరద బాధితుల సహాయార్థం మలబార్ గోల్డ్ గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో రూ.7 కోట్లు విరాళంగా అందజేసినట్లు తిరుపతి మలబార్ గోల్డ్ డైరెక్టర్లు రెజీష్, హరి తెలిపారు. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రంలోని అన్ని మలబార్ బ్రాంచ్‌లు స్పందించి ఈ నిధులను సమకూర్చాయన్నారు. ఇందులో రెండు కోట్లు తక్షణ సాయంగా, 5 కోట్లు నిరాశ్రయుల కోసం మలబార్ హౌసింగ్ చారిటీ ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మలబార్ గ్రూప్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ కేరళ ముఖ్యమంత్రిని కలిసి చెక్కును అందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment