
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment