New MLCs
-
నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా ఎన్.నవీన్‌కుమార్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువు రు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం నవీన్‌కుమార్‌రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పుష్ప గుచ్ఛం అందజేసి అభినందించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగిన రోజు వెలువడిన ఫలితాల్లో తాను విజయం సాధించానని, తన గెలుపును తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న శాసన మండలి వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన తీన్మార్ మల్లన్న.. మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్, ఏఐసీసీ నాయకురాలు దీపాదాస్ మున్షీ సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మండలి లాన్లో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో కలిసి నూతన ఎమ్మెల్సీలు ఫొటోలు దిగారు. -
సీఎం జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. -
ఏపీ శాసనమండలి: నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యుల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ -
కొత్త ఎమ్మెల్సీలకు జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పీడీఎఫ్ అభ్యర్థులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం అభినందనలు తెలిపారు. అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి ఆయన ఒక్కొక్కరికీ ఫోన్లు చేశారు. మంచి ఫలితాలను సాధించారని అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, పీడీఎఫ్ విజయాన్ని పురస్కరించుకుని జగన్ తన చాంబర్లో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంచుకున్నారు.