
సాక్షి, తాడేపల్లి: నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment