Kumbha Ravibabu
-
అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ బాబే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు కొంచెం కూడా మేలు చేయలేదని.. అలాంటి వ్యక్తిని గిరిజనులు ఎప్పటికీ నమ్మరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. చంద్రబాబు అరకులో సభ పెట్టి వైఎస్సార్సీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చాడా? అసత్య ప్రచారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు గిరిజన ద్రోహి అయితే సీఎం జగన్ గిరిజన బంధువు. బాబు తన హయాంలో గిరిజన శాఖకు మంత్రిని కూడా పెట్టలేదు. అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తున్నారు. గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత సీఎం జగన్దే. చంద్రబాబూ ఎందుకు సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారో చెప్పాలి. గిరిజనులకు బుద్ధిలేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఈ రాష్ట్రంలోని ఏడు గిరిజన అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇదే గతిపడుతుంది. బాబుకు ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు? రాష్ట్రంలో 38 లక్షల మంది గిరిజనులు తమకు ప్రత్యేకమైన గిరిజన కమిషన్ కావాలని అడిగితే, చంద్రబాబు ఆ ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్ సీఎం అయిన వెంటనే గిరిజన కమిషన్ ఏర్పాటుచేసి మా హక్కులకు భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఏ సీఎంకి రాని అద్భుతమైన ఆలోచనతో గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలనిపించలేదు? చంద్రబాబు ఇప్పుడొచ్చి ఎన్నెన్నో మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటే దాన్ని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి సాగును విపరీతంగా ప్రోత్సహించారు. అదే సీఎం జగన్ ఆ సాగును అరికట్టడమే కాక వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. -
గిరిజన ద్రోహి చంద్రబాబు: ఎమ్మెల్సీ రవిబాబు ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కుంభా రవిబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. చంద్రబాబు.. గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావ్?. గిరిజనులకు బుద్ధి లేదంటావా. గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారు. దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందింది. మూడు లక్షల 26 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా ?. అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎవరికీ రాని ఆలోచన. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఈరోజు సీఎం జగన్ చొరవతో అరకు కాఫీకి మరింత ఖ్యాతి దక్కింది. చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు మేలు చేశాడు. జీవో నంబర్-97ను తెచ్చింది చంద్రబాబే. గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతోంది. రాబోయే ఎన్నికల్లో మేమంతా ముఖ్యమంత్రి జగన్కు అండగా ఉంటాం. ఏడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సీఎం జగన్కు కానుకగా ఇస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంపదనంతా హైదరాబాద్లో పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృత్తం కాకూడదు. పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని కామెంట్స్ చేశారు. -
సీఎం జగన్ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
సాక్షి, తాడేపల్లి: నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా. కుంభా రవిబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. -
ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా కుంభా రవిబాబు బాధ్యతలు స్వీకరించారు
-
ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్గా కుంభా రవిబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా కుంభా రవిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 32 లక్షల మంది గిరిజనుల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ఆదివాసీల పక్షపాతిగా నిలిచారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. గతంలో అటకెక్కిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కుంభా రవిబాబు వెల్లడించారు. చదవండి: ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్ పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్ -
చంద్రబాబు గిరిజన ద్రోహి: కుంభా రవిబాబు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుని గిరిజనుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి, వారి సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్టీ కమిషన్ బిల్లు ప్రవేశపెడితే.. శాసన మండలిలో చంద్రబాబు అడ్డుతగిలారని అన్నారు. ఎస్టీ కమిషన్ను, ఎస్సీ కమిషన్ నుంచి వేరుచేసి గిరిజనులకు మేలు జరుగాలని చూస్తే.. దానిని అడ్డుకున్న చంద్రబాబు చరిత్రలో గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారని, ఎస్టీకి సంబంధించి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్టీకి సంబంధించి అన్ని అసెంబ్లీ స్దానాలు, ఎంపీ స్దానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో.. ఓర్వలేకే ఎస్టీ కమిషన్ బిల్లుకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. కేంద్రంలోలానే రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ప్రత్యేకంగా ఉంటే.. ఎస్టీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గిరిజనులు లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మాత్రమే అని విమర్శించారు. టీడీపీకి గిరిజనులు ఓట్లేయలేదు, ఎందుకు పని చేయాలని అడిగిన వ్యక్తి చంద్రబాబు అని, అరుకు నియోజకవర్గంలో ఆయన దతత్త తీసుకున్న గ్రామాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇక కిడారి శ్రావణ్ తండ్రి చనిపోవడం, త్వరలో ఎన్నికలు వస్తుండడంతో .. సానుభూతి ఓట్లు పడుతాయని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. అలానే గిరిజన కార్పోరేషన్ ను కూడా ప్రభుత్వం పడిపోతుందని తెలిసి నెలరోజుల ముందు ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కుంభా మండిపడ్డారు. ఆదివాసిల గుండెల్లో ఎక్కడ జగన్ శాశ్వతంగా నిలిచిపోతారోనని చంద్రబాబు నాయుడు ఈర్ష్య పడుతున్నారని అన్నారు. -
వైఎస్సార్సీపీలోకి కుంభా రవిబాబు
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న రాజన్న తనయుడికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వారిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ... గిరిజనులంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే గిరిజన హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.