
సాక్షి, అమరావతి: ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్‌గా కుంభా రవిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 32 లక్షల మంది గిరిజనుల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ఆదివాసీల పక్షపాతిగా నిలిచారన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసీల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. గతంలో అటకెక్కిన రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని అమలు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కుంభా రవిబాబు వెల్లడించారు.
చదవండి:
ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్
పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్
Comments
Please login to add a commentAdd a comment