
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని.. అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెఫ్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి అన్నారు.
చదవండి: డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు
రాజకీయ నేపథ్యం:
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి 2007–09లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడుగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి నక్కా ఆనందబాబుపై గెలుపొందారు.