
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న రాజన్న తనయుడికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వారిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ... గిరిజనులంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే గిరిజన హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.