సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
కాగా, కుంభా రవిబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు.
చంద్రబాబు.. గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావ్?. గిరిజనులకు బుద్ధి లేదంటావా. గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారు. దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందింది. మూడు లక్షల 26 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా ?.
అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎవరికీ రాని ఆలోచన. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే.
చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఈరోజు సీఎం జగన్ చొరవతో అరకు కాఫీకి మరింత ఖ్యాతి దక్కింది. చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు మేలు చేశాడు. జీవో నంబర్-97ను తెచ్చింది చంద్రబాబే. గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతోంది.
రాబోయే ఎన్నికల్లో మేమంతా ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉంటాం. ఏడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపదనంతా హైదరాబాద్‌లో పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృత్తం కాకూడదు. పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment