
పవన్‌ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే..
తాడేపల్లి: పవన్‌ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు కూడా జనసేన తీసుకోలేదని చెప్పారు. కాపులను పవన్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఒక పార్టీకి అధినేత ఎలా ఉండాలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాలని అడపా శేషు అన్నారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
'పవన్ పనైపోయింది. కాపు సోదరులారా మేల్కొనండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు. కాపులారా పవన్ ను చూసి మోసపోకండి. చంద్రబాబు,పవన్ మాటలు నమ్మకండి. తమ నాన్నే సీఎం అన్న లోకేష్ మాటలు పవన్ కు ఈ రోజు గుర్తొచ్చాయి. చంద్రబాబు ప్రొడ్యూసర్ ఐతే...ఆ సినిమాకు పవన్ ప్యాకేజ్ స్టార్. పవన్ కు తోడుగా ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టార్ షర్మిలమ్మ వచ్చింది. కొత్త ప్యాకేజ్ స్టార్ వచ్చింది.. కాబట్టే పవన్ మాట్లాడటం లేదు. పవన్ ను చంద్రబాబు పక్కన పెట్టేశాడు. కాబట్టే టీడీపీ సీట్లు ప్రకటించుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ మీకు ఒక్క సీటు కూడా ఇప్పించలేడు.' అని అడపా శేషు అన్నారు.
జనసేనలోకి ఎవరొచ్చినా పవన్ ప్రేమగా చూసుకుంటానంటున్నాడు కానీ.. సీట్లిస్తానని చెప్పడం లేదని అడపా శేషు తెలిపారు. చంద్రబాబు పాదాల దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్ కు సీటు ఎక్కడో ఈరోజుకీ చంద్రబాబు చెప్పలేదని విమర్శించారు. చంద్రబాబు వదిలేసినా.. పవన్ వదిలిపెట్టేలా లేడని వ్యంగ్యస్త్రాలు సందించారు. చంద్రబాబు చెప్తేనే పవన్ కు సీటు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దోచుకోవడానికి అవకాశం లేదు.. కాబట్టే చంద్రబాబు, పవన్‌కు జగన్ మోహన్ రెడ్డి శత్రువులా కనిపిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: తమ్ముడు పవన్ ఇది తెలుసుకో..: మంత్రి అంబటి