Tadepalligudem Assembly Constituency
-
సూపర్ సిక్స్‌తో చంద్రబాబు కలరింగ్.. తీరా తిరిగి చూస్తే..
తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన సంయుక్త బహిరంగ సభ సపలం అయినట్లా? విఫలం అయినట్లా? ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌లు అర్థవంతమైన ప్రసంగాలు ఎందుకు చేయలేకపోయారు? తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన దూషణలకు దిగడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు టీడీపీని నిప్పుతో అభివర్ణించుకుని పవన్‌కల్యాణ్‌ను గాలితో పోల్చడం, ఇద్దరు కలిసి వైఎస్సార్సీపీని బుగ్గి చేస్తామనడం, పవన్కల్యాణేమో వైఎస్సార్సీపీని పాతాళానికి తొక్కేస్తామని అనడం.. ఇవన్ని చూస్తే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతామన్నట్లుగా లేదా! గత కొద్ది రోజులుగా ఈ సభకు టీడీపీ మీడియా వీర హైప్ ఇచ్చింది. రెండు పార్టీలు కలిస్తే లక్షల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టింది. ఆరు లక్షల మంది వస్తారని కథనాలు ఇచ్చింది. తీరా చూస్తే సభ ఏర్పాట్లు చేసిందే లక్ష నుంచి రెండు లక్షల మంది పట్టేంత మైదానంలో. కుర్చీలు వేసిందే పదివేల మందికట. అయినా సభ సూపర్ సక్సెస్ అయిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో ప్రచారం చేసి ప్రజలను మోసం చేయడానికి యత్నించాయి. తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం పట్టారని, జన సమూహం నిండు మనసుతో ఆశీర్వదించారని ఈనాడు పత్రిక రాయడం జనాలను మభ్య పెట్టడం కాక మరేమిటి! జనం పర్వాలేదని రాస్తే ఏదో సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా అతిశయోక్తులతో రాయడం, వచ్చిన జనం మనసులోకి రామోజీరావు బృందం దూరి చూసినట్లుగా వారంతా నిండుమనసుతో ఆశీర్వదించారని రాశారంటేనే టీడీపీ కరపత్రంగా ఈనాడును ఎలా మార్చింది ఇట్టే తెలిసిపోతుంది. వైఎస్సార్సీపీ సిద్ధం సభకు లక్షల మంది వచ్చి హోరెత్తిస్తే, టీడీపీ, జనసేన సభకు అంత కలిపి నలభై.. ఏభై వేల మంది రాకపోయినా, తెలుగుదేశం పత్రికలు ఆహో, ఓహో అంటూ ఊదరగొట్టాయి. సభకు అటంకాలు కల్పించినా జనం తరలివచ్చారని మభ్యపెట్టే యత్నం చేశాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఒకరినొకరు పొగుడుకోవడానికి, జెండాలు మార్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం, కేవలం కింద స్థాయిలో కొట్టుకున్నట్లు రెండు పార్టీల నేతలను ఎలాగోలా బుజ్జగించడానికి చేసిన యత్నంగానే కనిపిస్తుంది. కాకపోతే పవన్‌కల్యాణ్ మాదిరి జనసైనికులంతా చంద్రబాబుకు లొంగిపోతారా? లేదా? అన్నదే చర్చనీయాంశం. పొత్తులపై ఎవరూ సలహాలు ఇవ్వనక్కర్లేదని, యుద్ధం చేసే యువత కావాలని పవన్‌కల్యణ్ చెప్పడం ద్వారా చేగొండి హరిరామజోగయ్య వంటి వృద్దనేతలను అవమానించడానికి కూడా వెనుకాడలేదు. అందుకే జోగయ్య కూడా తమ సలహాలు వినకపోతే పవన్, చంద్రబాబుల ఖర్మ అని వ్యాఖ్యానించడం విశేషం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మధ్యలో చంద్రబాబు తన సూపర్ సిక్స్ తో అంతా మారిపోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఆయన సంపద సృష్టించి లక్షల కోట్లు పంచుతానని అంటే. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏపాటి సంపద సృష్టించారా? ఎంత పేదలకు ఇచ్చారు? అది నిజమే అయితే ఈపాటికి ఏపీలో పేదరికం ఉండకూడదు కదా! అసలు సూపర్ సిక్స్ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నాలుగైదు రెట్లు ఇస్తామని చెప్పారంటేనే చంద్రబాబు వైఫల్యం చెందినట్లు కదా! వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కితేనేమో శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన వీరు ఇప్పుడు ఐదు రెట్లు బటన్లు నొక్కుతామని అంటున్నారు. దీనిని జనం విశ్వసిస్తారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటలు బద్దలు కొడతాం అంటూ కోతలు కోసిన పవన్‌కల్యాణ్ అసలు జనసేనకు బలమే లేదని, అందుకే తెలుగుదేశంపై ఆధారపడి పోటీచేస్తున్నామని చెప్పడం ద్వారా పార్టీ పరువును తీసేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వేల కోట్లు ఉన్నాయట. తన వద్ద ఏమీ లేవట. తానే కదా.. ఒక్క సినిమా తీస్తే వందల కోట్లు వస్తాయని చెప్పింది.. ఆ సంగతి మర్చిపోయారు. పోల్ మేనేజ్ మెంట్ చేయడం తెలియదట. అందుకే టీడీపీపై ఆధారపడ్డారట. అంటే టీడీపీ బాగా డబ్బు ఖర్చు చేస్తుందని, ఆ పార్టీ వద్ద వేల కోట్లు ఉన్నాయని పవన్‌కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పిచ్చి వ్యాఖ్యలు చేయడం, తన మూడు పెళ్లిళ్లు గురించి, పెళ్లాల గురించి మాట్లాడి, వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాలుగో పెళ్లామా అని అసభ్యంగా మాట్లాడడం చూస్తే ఆయన వెర్రి పరాకాష్టకు చేరినట్టలే అనిపిస్తుంది. చంద్రబాబును, లోకేష్‌ను తాను గతంలో ఎలా విమర్శించింది.. అవినీతి ఆరోపణలు చేసింది.. మర్చిపోయి ఇప్పుడు సమర్దిస్తున్న తీరు ఆయన నైజంను తెలియచేస్తుంది. తన తల్లిని దూషించిన లోకేష్‌ను క్షమించనని చెప్పింది పవన్‌కల్యాణ్ కాదా? చంద్రబాబుకు మనం బానిసలమా? పదో, పరకో సీట్లు పడేస్తే లొంగుతామా? అని చెప్పింది ఆయన కాదా? ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్న తీరు చూస్తే జనసేనకు సీట్లు ఇవ్వకపోయినా, పవన్‌కల్యాణ్‌కు ఏదో బాగానే గిట్టుబాటు అయిందన్న భావన కలగడం లేదా? అమరావతి రాజధానిని కుల రాజధాని అని అన్నది ఆయనే. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించింది ఆయనే. ఇప్పుడు నవనగరాల సృష్టికర్త అని చంద్రబాబును పొగుడుతున్నది పవన్ కళ్యాణే. ఇదంతా అవకాశవాదం కదా అని జనసైనికులు ఎవరైనా అనుకుంటే దానికి ఏమి సమాధానం దొరుకుతుంది! ఏదో పవర్‌ఫుల్‌గా మాట్లాడానని పవన్‌కల్యాణ్ అనుకోవచ్చేమో కానీ, కేవలం తెలుగుదేశం పార్టీకి బాగా పవర్‌ఫుల్‌గా బాకా ఊదారనే జనం అనుకుంటారు. ఈ సభకు లోకేష్ ఎందుకు రాలేదో తెలియదు. ఇక చంద్రబాబు ప్రసంగం తీరు చూస్తే.. మరీ అద్వాన్నంగా ఉంది. డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయనలో అధికార దాహం ఎంతగా ఉన్నది తెలిసిపోతుంది. ఎన్ని వీలైతే అన్ని అబద్ధాలు చెప్పడానికి ఆయన వెనుకాడడం లేదు. తానేమో స్వయంగా తన మామ ఎన్టీ రామారావును దారుణంగా అవమానించి పదవి నుంచి దించేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం షర్మిలకు ఏదో అన్యాయం చేశారంటూ పచ్చి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. సైకో భాషను వాడుతూ చంద్రబాబు రాష్ట్రం నాశనం అయిందని అంటారు. రాష్ట్రం నాశనం అవడం అంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంకు తాగునీరు, సాగునీరు ఇవ్వడమా? కుప్పంతో సహా వేలాది స్కూళ్లను బాగు చేయడమా? ఇంటింటికి డాక్టర్‌ను పంపడమా? కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టడమా? వారికోసం భారీ నీటి పథకం తేవడమా? పద్నాలుగు మెడికల్ కాలేజీలు తేవడమా? నాలుగు ఓడరేవులు నిర్మించడమా? లక్ష కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు తేవడమా? వలంటీర్ల వ్యవస్థను తెచ్చి పాలనను ప్రతి ఇంటికి చేర్చడమా? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించడమా? పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడమా? గ్రామాలలో వేలాది భవనాలు నిర్మించడమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడమా? పేద పిల్లలకు ఆంగ్ల మీడియంతో సహా అంతర్జాతీయ కోర్సులు అందించడమా..? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. వీటిలో ఒక్కదాని గురించి అయినా చంద్రబాబు మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదు! పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అమ్మ ఒడి తదితర స్కీములను ఇంకా ఎక్కువగా అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నారు? కుప్పంకు టాంకర్లతో నీరు తీసుకు వెళ్లి కుప్పం కాల్వలో పోశారని పచ్చి అబద్ధాన్ని చెప్పగలిగారంటేనే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిప్పుతో వైఎస్సార్సీపీని తగలపెట్టాలట. దానికి పవన్‌కల్యాణ్ అనే గాలి తోడయిందట. ఇలాంటివి వ్యాఖ్యలు అసూయతోనే చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఏపీ తగలబడాలన్న ఆలోచన ఉంటే తప్ప ఇలాంటివి ఊహకైనా వస్తాయా? ఏమి చేస్తాం. దురదృష్టం. చివరిగా ఈ వ్యాఖ్య చూడండి.. మనలో ఒకరు ఎక్కువకాదు.. తక్కువ కాదు.. ఒక పార్టీ వెనుకాల మరో పార్టీ నడవడం లేదు.. రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి.. అని చంద్రబాబు అనడం చూస్తే ఏమనిపిస్తుంది. జనసేనను బకరా చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు తేలడం లేదూ! పవన్‌కల్యాణ్‌కు సీఎం సీటు షేరింగ్ ఉంటుందని మాట మాత్రం చెప్పని చంద్రబాబు రెండు పార్టీలు సమానమని అంటున్నారు. అరవై సీట్లు కూడా ఇవ్వకుండా కేవలం 24 సీట్లతో సరిపెట్టి పవన్‌కల్యాణ్ పరువు తీసిన చంద్రబాబు రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. పవన్‌కల్యాణ్ చెవిలో పూలుపెట్టవచ్చు.. లేదా ఏదైనా వైఎస్సార్‌సీపీవారు ఆరోపిస్తున్నట్లుగా పవన్‌కల్యాణ్‌కు ప్యాకేజీ ఇచ్చి సంతృప్తి పరచవచ్చేమో కానీ, జనసైనికులను కూడా ఏమార్చగలరా? వారుఅంత తెలివితక్కువవారా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు. ‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్ -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
చంద్రబాబు చెప్తేనే పవన్‌కు సీటు: అడపా శేషు
తాడేపల్లి: పవన్‌ను నమ్మిన వారికి గతంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు కూడా జనసేన తీసుకోలేదని చెప్పారు. కాపులను పవన్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఒక పార్టీకి అధినేత ఎలా ఉండాలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాలని అడపా శేషు అన్నారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. 'పవన్ పనైపోయింది. కాపు సోదరులారా మేల్కొనండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు. కాపులారా పవన్ ను చూసి మోసపోకండి. చంద్రబాబు,పవన్ మాటలు నమ్మకండి. తమ నాన్నే సీఎం అన్న లోకేష్ మాటలు పవన్ కు ఈ రోజు గుర్తొచ్చాయి. చంద్రబాబు ప్రొడ్యూసర్ ఐతే...ఆ సినిమాకు పవన్ ప్యాకేజ్ స్టార్. పవన్ కు తోడుగా ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టార్ షర్మిలమ్మ వచ్చింది. కొత్త ప్యాకేజ్ స్టార్ వచ్చింది.. కాబట్టే పవన్ మాట్లాడటం లేదు. పవన్ ను చంద్రబాబు పక్కన పెట్టేశాడు. కాబట్టే టీడీపీ సీట్లు ప్రకటించుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ మీకు ఒక్క సీటు కూడా ఇప్పించలేడు.' అని అడపా శేషు అన్నారు. జనసేనలోకి ఎవరొచ్చినా పవన్ ప్రేమగా చూసుకుంటానంటున్నాడు కానీ.. సీట్లిస్తానని చెప్పడం లేదని అడపా శేషు తెలిపారు. చంద్రబాబు పాదాల దగ్గర కాపులను పవన్ తాకట్టు పెడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్ కు సీటు ఎక్కడో ఈరోజుకీ చంద్రబాబు చెప్పలేదని విమర్శించారు. చంద్రబాబు వదిలేసినా.. పవన్ వదిలిపెట్టేలా లేడని వ్యంగ్యస్త్రాలు సందించారు. చంద్రబాబు చెప్తేనే పవన్ కు సీటు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దోచుకోవడానికి అవకాశం లేదు.. కాబట్టే చంద్రబాబు, పవన్‌కు జగన్ మోహన్ రెడ్డి శత్రువులా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇదీ చదవండి: తమ్ముడు పవన్ ఇది తెలుసుకో..: మంత్రి అంబటి -
మంగళగిరిలో లోకేశ్ ఓటమి తథ్యం
మంగళగిరి/తాడేపల్లి రూరల్: గడిచిన రెండు దఫాలుగా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ ఓటమి తథ్యమన్నారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత) చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకంగా చెప్పారు. మంగళగిరిలో మిద్దే సెంటర్లో నిర్వహించే సామాజిక సాధికార యాత్ర మహాసభకు ముందు పెద్దఎత్తున పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొనాలని, మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడో చనిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడగొట్టి, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాబోయే తరాలకు సైతం ఆ పార్టీ తీరని ద్రోహం చేసిందన్నారు. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని అన్నారు. ఈ బస్సుయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకుడు రాపాక శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం విజయసాయిరెడ్డి చొరవతో తెనాలి–మంగళగిరి రహదారికి ఆర్అండ్బీ శాఖ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. విజయసాయిరెడ్డి సోమవారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న తెనాలి–మంగళగిరి రహదారి విషయాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చొరవ తీసుకోవడంతో అధికారులు 24 గంటల్లోనే రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఐదారు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజన ద్రోహి చంద్రబాబు: ఎమ్మెల్సీ రవిబాబు ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కుంభా రవిబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. చంద్రబాబు.. గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావ్?. గిరిజనులకు బుద్ధి లేదంటావా. గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారు. దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందింది. మూడు లక్షల 26 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా ?. అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎవరికీ రాని ఆలోచన. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే. చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఈరోజు సీఎం జగన్ చొరవతో అరకు కాఫీకి మరింత ఖ్యాతి దక్కింది. చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు మేలు చేశాడు. జీవో నంబర్-97ను తెచ్చింది చంద్రబాబే. గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతోంది. రాబోయే ఎన్నికల్లో మేమంతా ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉంటాం. ఏడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపదనంతా హైదరాబాద్‌లో పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృత్తం కాకూడదు. పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని కామెంట్స్ చేశారు. -
AP: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. అందరూ ఆహ్వానితులే: విజయసాయిరెడ్డి అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి అన్నాయి. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ►ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. -
పనికిరాని బాబు.. పచ్చి మోసగాడు
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు పచ్చి మోసగాడు.. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ, నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా..’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అవమానాలను ఓర్చుకున్నానని, ఇక భరించలేక బయటికి వచ్చేయాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ‘సీఎం జగన్ పేదల పక్షపాతి. ఆయన విధానాలు నాకు నచ్చాయి. సీఎం జగన్ వెనుక నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీ కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తా..’ అని పేర్కొన్నారు. తాను నైతిక విలువలు పాటించే వ్యక్తినని, టీడీపీకి రాజీనామాతోపాటు ఎంపీ పదవికి రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో పంపుతానన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరతానని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. నాతో నెల జీతాలు ఇప్పించారు.. పేదలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట నడవాలని నిర్ణయించున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్ పెట్టించి తనను దూషించారని, చెప్పు తీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గొట్టంగాడు అని దారుణంగా అవమానించినా భరించానన్నారు. ‘ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజాలపై మోశా. కొందరికి నెలవారీ జీతాలు ఇవ్వమని చంద్రబాబు చెబితే డబ్బులు ఖర్చు పెట్టా. తొమ్మిదేళ్లుగా పార్టీలో ఉంటే నేను చేసిన తప్పేమిటో కనీసం చెప్పాలి కదా?’ అని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. బొండా భార్యను నిలబెడితే ప్రమాదం.. ‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బొండా ఉమ భార్యను నిలబెడితే చాలా ప్రమాదం. నీ కుమార్తెను పోటీ చేయించు అని చంద్రబాబు నాతో అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారు. ఆయన మూడు రోజులు అడిగితేనే ముందుకొచ్చాం. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మంది హితవు చెప్పినా వినకుండా పార్టీలో కొనసాగా’ అని కేశినేని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమాలకు హాజరు కానివ్వలేదు ‘చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రపంచానికి తెలుసు. ఇంత దగా చేస్తాడనుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకు నేను హాజరు కావాలి. కానీ సీఎం కార్యక్రమాలకు చంద్రబాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతా’ అని ఎంపీ కేశినేని చెప్పారు. బెజవాడ, గుంటూరు నిజం.. అమరావతి ఓ కల ‘నాకు విజయవాడ అంటే ప్రాణం. విజయవాడ కోసం చంద్రబాబు రూ.100 కోట్లైనా ఇచ్చాడా? కానీ విజయవాడ కోసం నేను ఎంతో చేశా. షాజహాన్ తాజ్‌మహల్ కడితే నేను అమరావతి కడతానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. విజయవాడ, గుంటూరు మాత్రమే నిజం.. అమరావతి ఒక కలే. అది భ్రమరావతి. అక్కడంతా రియల్ ఎస్టేట్’ అని కేశినేని నాని పేర్కొన్నారు. లోకేశ్.. ఆఫ్ట్రాల్ ‘టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది. చివరకు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో, రౌడీలతో కొట్టించాలని లోకేశ్ ఎందుకు ప్రయత్నించారు? లోకేశ్ అనే వ్యక్తి ఆ్రఫ్టాల్..! చంద్రబాబు కుమారుడిగా మినహాయిస్తే ఆయనకు ఎలాంటి అర్హతా లేదు. అతడికి పార్టీ అన్నీ ఇచ్చినా ఓడిపోయాడు. నేను నా సొంత వనరులతో గెలిచా. అలాంటిది అతడి వద్ద మోకరిల్లాలంటే సాధ్యం కాదు’ అని కేశినేని స్పష్టం చేశారు. కేశినేని బాటలో క్యాడర్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడటంతో నగర పరిధిలో పార్టీ క్యాడర్ ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మూడు నియోజకవర్గాల్లోనూ కేశినేని నానికి బలమైన క్యాడర్ ఉంది. నానికి మద్దతుగా వారంతా వైఎస్సార్సీపీలో చేరనున్నారు. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు క్యాడర్‌ను పట్టించుకోరన్నది బహిరంగ రహస్యమే! లోకేశ్ వ్యవహార శైలితో పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ కీలక నేతలంతా అక్కడే ఉండటం ఇకపై వారంతా సమన్వయంతో పని చేస్తారనే సానుకూల సంకేతాలను పంపింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఎంపీ కేశినేని నానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి జగ్గయ్యపేట, తిరువూరు వరకు బలమైన అనుచర గణం ఉంది. ప్రధానంగా వారంతా దేవినేని ఉమా బాధితులే కావడం గమనార్హం. గ్రామాల్లో కేశినేని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ స్థాయి నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తదితరులకు కేశినేని నానితో మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా వారు కలసి పని చేయడాన్ని అన్ని వర్గాలు ప్రశంసించాయి. తాజా పరిణామాలు తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయనున్నాయి. కాగా, చంద్రబాబు పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి అని ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బాబు మోసాలను బహిర్గతం చేస్తూ కేశినేని మాట్లాడిన మాటలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కేశినేని పార్టీని వీడటం ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’
సాక్షి, తాడేపల్లి: ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిం చడం నేరమా? అని ఎల్లో మీడియాను నిలదీశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. నీటి సమస్యలపై అధికారుల్ని నిలదీస్తే.. ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంతవరకూ జగనన్న బాటలోనే నడుస్తానని ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. నా మాటల్ని ఎల్లోమీడియా వక్రీకరించింది మొన్న నేను ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై మాట్లాడాను. మా దగ్గర స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, నా ఆవేదనను ఎల్లోమీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసింది. నా మాటలు తప్ప వేరే వార్తలేమీ లేనట్టు ఒక రోజంతా పనిగట్టుకుని హైలెట్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగనన్నకు నేను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఎల్లోమీడియా ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మరి, అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పాను కదా..? ఆ మాటల్ని ఎల్లోమీడియా ఎందుకు హైలెట్ చేయలేదు. కొన్ని ఛానెళ్లు ఆ మాటల్ని కట్ చేసి మిగతా విషయాల్ని మాత్రమే ఎందుకు హైలెట్ చేశాయని ప్రశ్నిస్తున్నాను. అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడా.. మా నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో నేను చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, ఎలాంటి పరిష్కారం లభించనందున.. సీఎం గారికి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. లేకుంటే, మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. ఆ మాటల్ని కాస్తా.. ఎల్లోమీడియా తమకు అనుకూలంగా నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. వారి ఛానళ్లుల్లో ప్రసారం కూడా చేశారు. అధికారులపై ఆవేదనతో మాట్లాడాను తప్ప ఎల్లోమీడియా ప్రచారంలో ఉన్న అంశాలేమీ నిజంకాదు. ఎల్లోమీడియా కథనాల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈనాడు తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాను ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? అయితే, ఈరోజు ఈనాడు పత్రిక ఏదేదో ఊహించి అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘దళిత మహిళ ప్రశ్నించడమే నేరమా..?’ అనే శీర్షికన కథనం ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను.. ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది కూడా స్పష్టంగా రాయాలి కదా..? నేను ప్రశ్నించింది అధికారులనే కానీ.. జగనన్నను కాదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. జిల్లాస్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు..జగనన్న దగ్గరకు వెళ్తేనే పనులు అవుతున్నాయని అన్నాను. అందులో తప్పేంటి..?. ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు నాకు బాధ కలిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్ని వత్తిళ్లు చేయడం సాధారణం. మరి, అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా హైలెట్ చేసి మా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే ఎల్లో మీడియా పైత్యం ఎంతవరకు సబబు..? సొంతచెల్లెలుగా చూసుకున్న జగనన్న రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో నేనేదో భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి వచ్చిన మనిషిని కాదు. మేము జగనన్నను 2014 ఎన్నికల ముందు కలిసినప్పుడు.. ఆయనతో మాట్లాడిన రోజే మేమొక స్పష్టతకు వచ్చాం. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నాము. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో వారి విజన్‌ను కలిసిన మొదటి రోజునే మేము అర్ధం చేసుకున్నాం కాబట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా నన్ను చూసుకున్నారు. వారు చెప్పిందే వేదవాక్కుగా పనిచేయడమే తప్ప.. ఏనాడూ వారిని ధిక్కరించే మనస్తత్వం నాదికాదు. ఈ విషయాన్ని మీడియా మొత్తానికి స్పష్టం చేస్తున్నాను. జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా నా రాజకీయ భవితవ్యం జగనన్న చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను మరలా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటి నేను వైఎస్ఆర్సీపీని వీడిపోతున్నట్లు.. జగనన్నను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లోమీడియాలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగనన్న ఎస్సీలకు చేసిన మేలు దేశచరిత్రలో లేదు ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు. దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా ఆయన మేలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే నాయకుడిగా జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం అందరూ కళ్లకు కట్టినట్లు చూస్తోన్న నిజం. కనుకనే, ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చిత్రపటాలు ప్రతీ పేదింట పెట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..? చంద్రబాబును భుజాలపై మోస్తోన్న ఈనాడు పత్రికతో సహా ఇతర ఎల్లోమీడియా ఏం కోరుకుంటున్నాయి..? ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదనుకుంటున్నాయా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదని మీర నుకుంటున్నారా..? అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. మీరు నామీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారే..? జగనన్నకు అపాదిస్తే దళిత మహిళ నోటిని కట్టడి చేయవచ్చనుకున్నారా..? చంద్రబాబు, ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. పైగా, మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాయడం మానేయకపోతే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తున్నాను.. (అంటూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి చింపేశారు) నా జోలికొస్తే కోర్టుకీడుస్తాను చంద్రబాబుకు, ఇతర ఎల్లోమీడియాకు ఒక దళిత మహిళగా నేనొక హెచ్చరిక చేస్తున్నాను. నేను రైట్ పాత్‌లోనే నడుస్తున్నాను. ఊపిరున్నంత వరకు జగనన్న నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాను. నేను రైట్‌గానే ఆలోచిస్తున్నాను. జగనన్నకు నన్ను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా నా జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను. చీడపురుగు చంద్రబాబు దేశం వదిలిపోవాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయానికి దిగజారిపోతున్నాడు. ఆయనకు తోడుగా ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు పనిచేస్తూ.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుపై, ఇతర పార్టీ నేతలపై, ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలుండవా..? అలాంటిది, మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాకు గొడవలుంటే.. ఎవరి నియోజకవర్గాల్ని వారు అభివృద్ధి చేసుకునే క్రమంలో చిన్నపాటి వివాదాలు పడితే.. మీకేంటి అంత బాధా..? అధికారుల్ని ప్రశ్నించినంతమాత్రానా.. దాన్ని జగనన్నకు అపాదించి నీ ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తావా..? నీ కుట్ర బుర్రలో నుంచి వచ్చిన విషపు ఆలోచనేనని మేము గ్రహించాము. జగనన్న రాజకీయ వ్యూహానికి భయపడి నువ్వు ఆంధ్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంటున్నావు. అందుకే, నిన్ను శాశ్వతంగా ఇక్కడ లేకుండా దేశం వదిలిపోయేలా చేయాలని జగనన్నను నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరముందని ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. -
AP: బీసీల అభివృద్ధికి సీఎం జగన్ తపన : సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్‌ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వివిధ స్కీమ్‌లను పరిశీలిస్తే నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశాం. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలో బీసీలు సీఎంలుగా ఉన్న ఏపీలో ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలి. రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశాయి. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడు. బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారు. మళ్లీ ఇప్పుడు మాత్రం జయహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకువచ్చారు’ అని సజ్జల వివరించారు. రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్దికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానన్నారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇదీచదవండి..పార్టీ ఫిరాయించిన వారితో వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా -
AP: సీఎం జగన్ హయాంలో పేదరికం తగ్గింది: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్‌లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ‘ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్‌కు దూరం చెసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు.175 నియోజక వర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రీ కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పని చేస్తుందో వివరించామని చెప్పారు. గతంలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారు. మతం మారినా ఇంకా ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారు. జైనులుగా బుద్దులుగా మారిన ఎస్సీలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. ఎస్సీలకు ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మేరుగ తెలిపారు. ఇదీచదవండి..లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడిపై వేటు -
AP: అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల
సాక్షి,తాడేపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. ‘అంన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేం విన్నాం. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు. రాజకీయ అజెండాకి బలి కావద్దు. ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం. గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుంది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్వాడీలకు అన్యాయం చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుతున్నాం. సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. మేము కాన్ఫిడెంట్‌గా సీట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకేష్, గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా.. అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా మాకు ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారు? ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి తప్పదని ఊహించే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారు. గతంలో ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారు’అని సజ్జల గుర్తుచేశారు. ఇదీచదవండి.. రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు -
రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీటర్లో అభినందించాని గుర్తు చేశారు. ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏం ఉందని అన్నారు. కేసీఆర్‌కు తొంటి విరిగింది కాబట్టి సీఎం జగన్ పరామర్శించారని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలి నాని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు మద్దతివ్వడంలో వింత ఏముందని ప్రవ్నించారు. రేవంత్ ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్ ఏపీకి వస్తాడేమోనని అన్నారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ. 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడని మండిపడ్డారు. గుడివాడలో కూడా రూ. 100 కోట్లు ఇచ్చినతనికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడన్నారని విమర్శించారు. చదవండి: ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో(శనివారం) 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్రం నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరుగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొనున్నారు. -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా నేడు(శనివారం) విశాఖ నార్త్ నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా పెద్దాపురం, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరుగనుంది. విశాఖ నార్గ్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ ప్రతినిధుల మీడియా సమావేశం ఉండగా, పన్నెండు గంటలకు అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పోర్ట్ హాస్పిటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమురి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. మరొకవైపు కాకినాడ జిల్లా పెద్దాపురంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దాపురం వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ కొయ్యే మోషెన్‌రాజు తదితరులు హాజరుకానున్నారు. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం మూడు గంటలకు ముత్తుకూరులోని వాణి మహల్‌సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరు బస్టాండ్‌లో బహిరంగ సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీద మస్తాన్ రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర నేత ఖాదర్ బాషా, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, తదితరులు పాల్గొనున్నారు. -
AP: పవన్‌ను నమ్ముకుంటే.. ఖల్లాస్!
సాక్షి, విజయవాడ: పవన్‌ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడమా? బాబోయ్.. అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ. తాజాగా కోర్ కమిటీ సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో దాదాపు అయిదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్దత, పొత్తుల అంశాలపై కీలకంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్దమవ్వాలనే దానిపై జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలను సేకరించారు. పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉండాలని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల శాతం పెరుగుతుందని నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపైనా బీజేపీ నేతలు చర్చించగా.. పవన్‌ను నమ్ముకుంటే బీజేపీకి ఎదురుదెబ్బేనని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసి భంగపడిన అనుభవాలను నేతలు గుర్తుచేసుకున్నారట. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలమా? అనే అంశంపైనా అభిప్రాయ సేకరణ జరిపారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ఏపీలో ఈ నెలలో అమిత్ షా పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి పర్యటన సమయంలోనే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరారట. చదవండి: చంద్రబాబుకి ఆ గేటు తెరిచే ఉద్దేశం లేదేమో! -
మా అభ్యర్థుల్ని మారిస్తే మీకేంటి నొప్పి: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారిస్తే రామోజీరావు, రాధాకృష్ణలకు నొప్పేంటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీ రావు, రాధాకృష్ణలకు భయం పుడుతోందని చెప్పారు. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని విమర్శించారు. ఓసీ నియోజకవర్గాలలో కూడా సీఎం జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆయన పార్టీ ఇక కనుమరుగు అవుతుందనే భయం పుట్టిందన్నారు. టీడీపీకి బీటీమ్ పురంధేశ్వరి పార్టీ బీటీమ్ అన్నారు. చంద్రబాబు కోసం తెగ తాపత్రయం పడుతోందన్నారు. ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారని మేరుగ ఫైరయ్యారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ ‘చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతోంది. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉంది. గతంలో ఇచ్చిన హామీల్లొ ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా. మా పార్టీ అభ్యర్థులను మారిస్తే మీకు నొప్పేంటి. మా అభ్యర్థులను చూస్తే రామోజీ, రాధాకృష్ణలకు భయం పుడుతోంది. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ..బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా’ అని మేరుగ ప్రశ్నించారు. బాబు రాజకీయ జీవితమంతా పొత్తులే ‘మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుంది. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యం. అందరం కలిసి జగన్‌ని గెలిపిస్తాం. ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు. మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూస్తే.. ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఏమైనా ఉందా..? ఆయన కాంగ్రెస్‌తో, బీజేపీతో, కమ్యూనిస్టులతో, ఆఖరుకు జనసేన పార్టీతోనూ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి గెలిచే దమ్ముంటే మూకుమ్మడిగా పార్టీల్ని కూడగట్టి పొత్తులు పెట్టుకోవడం ఎందుకు’ అని మేరుగ నిలదీశారు. బాబుకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలు సిద్ధం ‘సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఏనాడైనా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నావా..? రాజకీయాల్లో మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చేసిన హేళనలు, అసమానతలు మాకు గుర్తుకురావని అనుకుంటున్నావా..? ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా, మళ్లీ మేము గుర్తుకొస్తున్నామా..? ఒకపక్క, మా జాతి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ మా నాయకుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను అంత తేలిగ్గా వదులుతామా..? నీకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలంతా సిద్ధంగా ఉన్నారు’అని మేరుగ తెలిపారు. మీ కుట్రలన్నీ చివరికి నీటిమూటలే.. ‘చంద్రబాబు విషకూటమిలో పచ్చమీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పచ్చమీడియా రోజూ కారుకూతలు రాస్తూ.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు.. జరగనివి కూడా జరిగినట్లు అభూతకల్పనలు, కట్టుకథలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాలను రెచ్చగొడుతూ కార్మిక సంఘాలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. మీరెంత విషాన్ని నూరిపోసి, కుట్రలతో దొంగ ఉద్యమాలు చేయించినా అవన్నీ చివరికి నీటిమూటలుగానే తేలుతాయి. మీరు గుడ్డ కాల్చి మామీద వేయడానికి తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు’ అని మేరుగ అన్నారు. మళ్లీ సీఎంగా జగనన్నే అనేది ప్రజా నినాదం ‘పేదల ఆకలి చూసి తిండి పెట్టేది ఎవరు..? భావితరాల భవిష్యత్తు కోసం ఎవరు చూస్తున్నారు..? బడుగు, బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలబెట్టి ప్రోత్సహించే నాయకుడు ఎవరనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. అందుకే, వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే, మళ్లీ సీఎం జగనన్ననే అనేది ప్రజా నినాదమైంది. మీ పచ్చమీడియా పైత్యం, ఎన్ని వెర్రితలలేసినా ప్రజలు మీ మాటల్ని, రాతల్ని నమ్మరు గాక నమ్మరు’ అని మేరుగ నాగార్జున అన్నారు. ఇదీచదవండి..పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్