‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’ | MLA Jonnalagadda Padmavathi Clarifies On Yellow Media Propaganda | Sakshi
Sakshi News home page

‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’

Published Tue, Jan 9 2024 9:25 PM | Last Updated on Fri, Feb 2 2024 4:53 PM

MLA Jonnalagadda Padmavathi Clarifies On Yellow Media Propaganda - Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిం చడం నేరమా? అని ఎల్లో మీడియాను నిలదీశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.  నీటి సమస్యలపై అధికారుల్ని నిలదీస్తే.. ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంతవరకూ జగనన్న బాటలోనే నడుస్తానని ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ..

నా మాటల్ని ఎల్లోమీడియా వక్రీకరించింది
మొన్న నేను ఫేస్‌బుక్‌ లైవ్‌లో నీటి కేటాయింపులపై మాట్లాడాను. మా దగ్గర స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, నా ఆవేదనను ఎల్లోమీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్‌ చేసింది. నా మాటలు తప్ప వేరే  వార్తలేమీ లేనట్టు ఒక రోజంతా పనిగట్టుకుని హైలెట్‌ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగనన్నకు నేను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఎల్లోమీడియా ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మరి, అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పాను కదా..? ఆ మాటల్ని ఎల్లోమీడియా ఎందుకు హైలెట్‌ చేయలేదు. కొన్ని ఛానెళ్లు ఆ మాటల్ని కట్‌ చేసి మిగతా విషయాల్ని మాత్రమే ఎందుకు హైలెట్‌ చేశాయని ప్రశ్నిస్తున్నాను. 

అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడా..
మా నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో నేను చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, ఎలాంటి పరిష్కారం లభించనందున.. సీఎం గారికి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. లేకుంటే, మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. ఆ మాటల్ని కాస్తా.. ఎల్లోమీడియా తమకు అనుకూలంగా నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. వారి ఛానళ్లుల్లో ప్రసారం కూడా చేశారు. అధికారులపై ఆవేదనతో మాట్లాడాను తప్ప ఎల్లోమీడియా ప్రచారంలో ఉన్న అంశాలేమీ నిజంకాదు. ఎల్లోమీడియా కథనాల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. 

ఈనాడు తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాను
ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? అయితే, ఈరోజు ఈనాడు పత్రిక ఏదేదో ఊహించి అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘దళిత మహిళ ప్రశ్నించడమే నేరమా..?’ అనే శీర్షికన కథనం ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను.. ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది కూడా స్పష్టంగా రాయాలి కదా..?

నేను ప్రశ్నించింది అధికారులనే కానీ.. జగనన్నను కాదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. జిల్లాస్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు..జగనన్న దగ్గరకు వెళ్తేనే పనులు అవుతున్నాయని అన్నాను. అందులో తప్పేంటి..?.
 
ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు నాకు బాధ కలిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్ని వత్తిళ్లు చేయడం సాధారణం. మరి, అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా హైలెట్‌ చేసి మా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే ఎల్లో మీడియా పైత్యం ఎంతవరకు సబబు..? 

సొంతచెల్లెలుగా చూసుకున్న జగనన్న
రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో నేనేదో భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి వచ్చిన మనిషిని కాదు. మేము జగనన్నను 2014 ఎన్నికల ముందు కలిసినప్పుడు.. ఆయనతో మాట్లాడిన రోజే మేమొక స్పష్టతకు వచ్చాం. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నాము. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో వారి విజన్‌ను కలిసిన మొదటి రోజునే మేము అర్ధం చేసుకున్నాం కాబట్టి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా నన్ను చూసుకున్నారు. వారు చెప్పిందే వేదవాక్కుగా పనిచేయడమే తప్ప.. ఏనాడూ వారిని ధిక్కరించే మనస్తత్వం నాదికాదు. ఈ విషయాన్ని మీడియా మొత్తానికి స్పష్టం చేస్తున్నాను. 

జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా
నా రాజకీయ భవితవ్యం జగనన్న చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను మరలా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటి నేను వైఎస్‌ఆర్‌సీపీని వీడిపోతున్నట్లు.. జగనన్నను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లోమీడియాలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 

జగనన్న ఎస్సీలకు చేసిన మేలు దేశచరిత్రలో లేదు
ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు. దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా ఆయన మేలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే నాయకుడిగా జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం అందరూ కళ్లకు కట్టినట్లు చూస్తోన్న నిజం. కనుకనే, ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చిత్రపటాలు ప్రతీ పేదింట పెట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. 

 సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..?
చంద్రబాబును భుజాలపై మోస్తోన్న ఈనాడు పత్రికతో సహా ఇతర ఎల్లోమీడియా ఏం కోరుకుంటున్నాయి..? ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదనుకుంటున్నాయా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదని మీర నుకుంటున్నారా..? అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. మీరు నామీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారే..? జగనన్నకు అపాదిస్తే దళిత మహిళ నోటిని కట్టడి చేయవచ్చనుకున్నారా..? చంద్రబాబు, ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. పైగా, మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాయడం మానేయకపోతే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తున్నాను.. (అంటూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి చింపేశారు)

నా జోలికొస్తే కోర్టుకీడుస్తాను
చంద్రబాబుకు, ఇతర ఎల్లోమీడియాకు ఒక దళిత మహిళగా నేనొక హెచ్చరిక చేస్తున్నాను. నేను రైట్‌ పాత్‌లోనే నడుస్తున్నాను. ఊపిరున్నంత వరకు జగనన్న నాయకత్వంలోనే వైఎస్‌ఆర్‌సీపీలోనే పనిచేస్తాను. నేను రైట్‌గానే ఆలోచిస్తున్నాను. జగనన్నకు నన్ను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా నా జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను.

చీడపురుగు చంద్రబాబు దేశం వదిలిపోవాలి
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయానికి దిగజారిపోతున్నాడు. ఆయనకు తోడుగా ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5లు పనిచేస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలుపై, ఇతర పార్టీ నేతలపై, ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలుండవా..? అలాంటిది, మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాకు గొడవలుంటే.. ఎవరి నియోజకవర్గాల్ని వారు అభివృద్ధి చేసుకునే క్రమంలో చిన్నపాటి వివాదాలు పడితే.. మీకేంటి అంత బాధా..? అధికారుల్ని ప్రశ్నించినంతమాత్రానా.. దాన్ని జగనన్నకు అపాదించి నీ ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తావా..?

నీ కుట్ర బుర్రలో నుంచి వచ్చిన విషపు ఆలోచనేనని మేము గ్రహించాము. జగనన్న రాజకీయ వ్యూహానికి భయపడి నువ్వు ఆంధ్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంటున్నావు. అందుకే, నిన్ను శాశ్వతంగా ఇక్కడ లేకుండా దేశం వదిలిపోయేలా చేయాలని జగనన్నను నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరముందని ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement