బాబు, పవన్‌కు విశ్వసనీయత, విలువల్లేవ్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Slams Chandrababu Pawan At Banaganapalli | Sakshi
Sakshi News home page

మోసగాళ్లు మళ్లీ వస్తున్నారు.. బాబు, పవన్‌పై బనగానపల్లె సభలో సీఎం జగన్‌ పంచులు

Published Thu, Mar 14 2024 1:32 PM | Last Updated on Thu, Mar 14 2024 3:38 PM

CM YS Jagan Slams Chandrababu Pawan At Banaganapalli - Sakshi

సాక్షి, నంద్యాల:  పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు.  బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన.  

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమంమే ఈ వైఎస్సార్ ఈబీసీ నేస్తం. 

పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం. 

ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు. 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు.  అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది.ూ ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం 610 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. 

వైఎస్సార్ చేయూత ద్వారా 4560 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4560 సంవత్సరాల వయసున్న కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడటం, ఆర్థిక సాధికారతకు సహకారం అందిస్తున్నట్లుగానే వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 33,14,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి మంచి జరిగించాం.  మొత్తంగా 4560 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 44,74,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి. 

అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ గానీ, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదు, వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదుూ అర్హత ఉంటే చాలు.. ప్రతి అక్కచెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తున్నాం.  అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ ఇస్తూ అండగా నిలబడుతున్న పరిస్థితి.ూ గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరిగింది.  సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరుమీదే, వారి పేరు మీదే బ్యాంకు అకౌంటు తెరిచి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తున్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే.. 

.. మీ మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లతో అడగండి. 10 సంవత్సరాల డేటా ఇవ్వండని అడగండి.  చంద్రబాబు 5 సంవత్సరాలకు సంబంధించనది, మన 5 సంవత్సరాల పాలన డేటాను ఒకసారి చూసుకోండి. చంద్రబాబు 5 సంవత్సరాల డేటా చూస్తే మీ బ్యాంకు అకౌంటుకు ఒక్క రూపాయి అయినా పంపించాడా?.ూ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంటు డీటెయిల్స్ చూస్తే ఎన్ని లక్షల రూపాయలు నేరుగా మీ చేతికే వచ్చిందన్నది కనిపిస్తుంది.  గతంలో ఏ పథకం ఉందో ఎవడికీ తెలియదు. ఎప్పుడిస్తారో తెలియదు. అసలిస్తారో లేదో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్.  ఒకటో తేదీ ఉదయం ఆదివారమైనా, సెలవుదినమైనా లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంటికే వచ్చి మీ మనవడిలా, మనవరాలిలా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకం ప్రతి కుటుంబానికీ అందుతోంది. 

ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం..ూ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి.  ఇందులో రూ.1.89 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. మహిళా సాధికారత పరంగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి, అందులో ఏదైతే హామీలిచ్చామో ఆ హామీలన్నీ ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటికి వచ్చి మన ప్రజా ప్రతినిధులు మీరే చూడండి. చెప్పిన ప్రతి ఒక్కటీ జగనన్న చేసి చూపించాడని, మీరే టిక్కు పెట్టండని ధైర్యంగా మీ ఇంటి గడప తొక్క గలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ూ మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలివ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేయడం అనే సంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ గా భావించిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది. 

మరోవంక.. మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబును, దత్తపుత్రుడిని చూడండి. ూ వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.ూ ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. ఒక్క స్కీము కూడా గుర్తుకురాని పరిస్థితి.  దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. ఏదేండ్లకోకసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు. 

ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కల్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగేనే స్టేజీ మీద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు. చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు.  ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు.

ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నా.  ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా?.  ఈ మాదిరిగా పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు.  మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. 

2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పేజీ నంబర్ 16, 17లో.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలు గుర్తుచేస్తా.

మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామన్నారు.
పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. 
పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. 
పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు అందిస్తామన్నారు. 
పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు.
సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ పై రూ.100 సబ్సిడీ. 5 ఏళ్లలో రూ.6,00 ఇస్తామన్నారు.
హైస్కూలు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు.
మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్..

ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించిన 9 హామీలు... ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన సీఎం అయిన తర్వాత 2014-19లో ఆయన, ఆయనతోపాటు దత్తపుత్రుడు, ఈ బీజేపీ ముగ్గురూ కలిసి ఫొటోలు దిగి, మేనిఫెస్టో రిలీజ్ చేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపిచాడు. ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా.. 

 ఇంతటి దారుణంగా మోసం చేస్తున్న ఈ వ్యక్తులకు మనం మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనల్ని మోసం చేస్తూ, రంగు రంగుల మేనిఫెస్టో అని పేర్లు చెబుతూ, మళ్లీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని చెబుతూ, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబితే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా, న్యాయమేనా? ఆలోచన చేయమని అడుగుతున్నా.  మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో రిలీజ్ చేస్తే ఒక బైబిల్ గా, భగవద్గీత, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి ఆశీస్సులు అడుగుతున్నాడు. మరోవైపున పచ్చి మోసగాళ్లు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయామాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతోంది. 

ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. అబద్ధాలు చెప్పడం చేతకాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఇంకా ఎక్కువ వింటాం. మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టోకన్నా ఇంకా రంగురంగుల మేనిఫెస్టో ఇస్తారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.  మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని పిలుపునిస్తున్నా.  మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతామని గట్టిగా చెప్పండి. 

కాసేపటి క్రితం రామిరెడ్డి అన్న.. బనగానపల్లెకు ఔకు రిజర్వాయర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారారూ.100 కోట్లు ఖర్చయ్యే నీళ్ల సప్లయ్ గురించి అడిగాడు. ఇది కచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. వంద పడక సీహెచ్ సీ ఆస్పత్రిని. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు.
పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకొంటే 100 మందికిపైగా హాస్పటల్ లో ఉండి అండగా ఉండే కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరిగింది. 
దేవుడి చల్లని దీవెనలుండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 

మీ అందరితో ఇంకో చిన్న విన్నపం చేయదల్చుకున్నా. ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తున్నాం ఈబీసీ నేస్తం కూడా. డబ్బులొచ్చే కార్యక్రమం ఒక వారం అటో ఇటో జరుగుతుంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరుతాయి.  ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఆంధ్రజ్యోతి టీవీ, టీవీ5 చూడొద్దండి. ఆటోమేటికలీ డబ్బులు పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా పర్లేదు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయి ఉన్న మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తున్నాం.  న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి, అన్యాయంగా చూపించే ఒక చెడిపోయి ఉన్న కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా యుద్ధం చేస్తున్నామన్నది మర్చిపోకండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడి దయతో నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. 

మన రామిరెడ్డి అన్న.. మీ అందరికీ పరిచయస్తుడే. నిరుడుకన్నా ఇంకా గొప్ప మెజార్టీతో ఆశీర్వదించమని కోరుతున్నా. అటువైపున టీడీపీ అభ్యర్థి చాలా ధనవంతుడు. చాలా డబ్బులున్నాయి.ఓటుకు రూ.2 వేలైనా రూ.3 వేలైనా ఇస్తాడు. రామిరెడ్డి అన్న ధనవంతుడు కాదు. ఆ మాదిరిగా ఇవ్వలేకపోవచ్చు. రామిరెడ్డి అన్నను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకూ కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయన్నది మనసులో పెట్టుకోండి. 
వాళ్లిచ్చే డబ్బులు రెండువేలిచ్చినా, మూడు వేలిచ్చినా వద్దనద్దండి. ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు, బటన్ నొక్కేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. 

కాబట్టి జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రామిరెడ్డి అన్నను కచ్చితంగా గెలిపించుకోవాలన్నది గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, అక్కచెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాల్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం పండుగగా జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం.. ఇవన్నీ జరగాలన్నా. 

ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని ఒక మనవడిగా, మనవరాలిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా.. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష వస్తాయి.ూ పేదల బతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి. అంధకారమయమైపోతాయి.  పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ గుర్తెరగమని సవినంగా కోరుతున్నా. 

వీళ్లు ఎంత అన్యాయస్తులు వీరంటే.. ఇదే బనగానపల్లెలో మనం 3200 మంది ఇళ్ల స్థలాలిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకుపోయి చంద్రబాబు గారు.. ఎక్కడ జగన్ కు మంచి పేరొస్తుందో, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటిస్థలాలు ఇవ్వకూడదని కోర్టుకుపోయి అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఇదే బనగానపల్లెలో కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలివ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడుల్లో నాడునేడు చేయాలన్నా యుద్ధం చేయాలి.  ఇంగ్లీషు మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి. పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నది అందరూ గుర్తెరగాలి.  ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపోమాపో జడ్జిమెంట్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. వారంరోజుల్లోపు 3200 కుటుంబాలకు మంచి శుభవార్త వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నా. మంచి జరిగించేదానికి ఎప్పుడూ మీ బిడ్డ అండగా, తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement