AP: సీఎం జగన్‌ హయాంలో పేదరికం తగ్గింది: మంత్రి మేరుగ | Minister Meruga Nagarjuna Press Meet On Welfare Schemes In AP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ హయాంలో పేదరికం తగ్గింది: మంత్రి మేరుగ

Published Tue, Jan 9 2024 3:12 PM | Last Updated on Fri, Feb 2 2024 2:35 PM

Minister Meruga Nagarjuna Press Meet On Welfare Schemes In Ap  - Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తోందని  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ  మంత్రి  మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ స్కీమ్‌లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్‌ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. 

‘ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్‌కు దూరం చెసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు.175 నియోజక వర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రీ కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడు.

విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పని చేస్తుందో వివరించామని చెప్పారు.

గతంలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారు. మతం మారినా ఇంకా ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారు. జైనులుగా బుద్దులుగా మారిన ఎస్సీలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. ఎస్సీలకు ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మేరుగ తెలిపారు. 

ఇదీచదవండి..లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడిపై వేటు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement