AP: అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల | Ap Government Advisor Sajjala Comments On Anganvadis Strike | Sakshi
Sakshi News home page

అంగన్వాడీలు రాజకీయాలకు బలి కావొద్దు: సజ్జల

Published Mon, Jan 8 2024 9:07 PM | Last Updated on Fri, Feb 2 2024 11:06 AM

Ap Government Advisor Sajjala Comments On Anganvadis Strike - Sakshi

సాక్షి,తాడేపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తాడేపల్లిలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఆందోళనలపై అనేక స్థాయిల్లో చర్చించామని, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. 

‘అంన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది. వాట్సాప్‌ గ్రూపుల్లో వారి ఆడియోలు మేం విన్నాం. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు. రాజకీయ అజెండాకి బలి కావద్దు. ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం. గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్టొద్దు. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుంది.

మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్వాడీలను రెచ్చగొడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్‌వాడీలకు అన్యాయం చేశారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుతున్నాం. సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. 

175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్థులు లేరు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. మేము కాన్ఫిడెంట్‌గా  సీట్లపై నిర్ణయాలు తీసుకుంటున్నాం. లోకేష్, గంటా శ్రీనివాసరావు, అనిత, జవహర్ ఇలా ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు మారారో తెలియదా.. అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా మాకు ఇబ్బంది లేదు.

వాలంటీర్లు ఉద్యోగులు కాదు, అలాంటప్పుడు ఎన్నికల విధుల్లో ఎలా పాల్గొంటారు? ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటమి తప్పదని ఊహించే ముందుగా కారణాలు వెతుక్కుంటున్నారు. గతంలో ఓడిపోగానే ఈవీఎంలపైకి నెట్టారు’అని సజ్జల గుర్తుచేశారు. 

ఇదీచదవండి.. రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement