టీడీపీ రెండో జాబితా విడుదల.. పలువురికి షాక్‌ | TDP Second List Released By Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ రెండో జాబితా విడుదల.. పలువురికి షాక్‌

Published Thu, Mar 14 2024 1:06 PM | Last Updated on Thu, Mar 14 2024 3:10 PM

TDP Second List Released By Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుంటూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో​ జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  

ఇక, రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. 

  • రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు.
  • రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తికి  దక్కని చోటు. 
  • చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి.
  • మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్‌కు నిరాశ. 
  • మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్‌కు అవకాశం..
  • గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్‌కు కేటాయింపు.
  • గాజువాకలో జనసేనకు నిరాశ.
  • సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు.

రెండో జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నేతలకు దక్కని చోటు

  • టిక్కెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు 
  • పెనమలూరులో బోడేకు నో టికెట్ 
  • టిక్కెట్ లేదని చంద్రబాబు నుంచి ఫోన్ 
  • కొన్ని అనివార్య కారణాలతో సీటివ్వలేకపోతున్నామని చంద్రబాబు నుంచి ఫోన్
  • టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో బోడే ప్రసాద్ , బోడే అనుచరులు 
  •  చివరి ప్రయత్నంగా టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి టిక్కెట్ ఇవ్వాలని అడిగేందుకు సిద్ధమవుతున్న బోడే 
  • టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధప్రసాద్, దేవినేని ఉమా
  • మైలవరం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా , వసంత కృష్ణప్రసాద్ , బొమ్మసాని సుబ్బారావు
  • అవనిగడ్డ టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న మండలి బుద్ధప్రసాద్ 
  • అవనిగడ్డ సీటు టీడీపీకి కేటాయించకపోతే సహకరించమంటున్న టీడీపీ నాయకులు 
  • టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధ ప్రసాద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement