
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉందన్నారు. సీఎం జగన్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు.
కాగా, సుబ్రహ్మణ్యస్వామి ఈరోజు తిరుమలకు వచ్చారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్లు పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఇక, ఈ కేసు విచారణను ఈనెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం, సుబ్రహ్మణస్వామి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఎన్నికల కోసం సిద్ధమవ్వాలన్నారు. మరోవైపు, రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై స్పందిస్తూ.. ‘సీఎం జగన్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. మరోసారి అది నిరూపించుకుంటారు’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment