సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సామాజిక న్యాయం నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా వ చ్చిన ప్రజలు శుక్రవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వెంకటగిరిలో ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ ఆశీర్వాదం అందుకుని డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతి వీధిలో స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు.
దళితుల కోసం రూ. 86 వేల కోట్లు ఖర్చు : ఎంపీ గురుమూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ చేసినంత కృషి దేశంలో మరే ముఖ్యమంత్రీ ఇప్పటివరకు చేయలేదని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఒక్క దళితుల కోసమే సీఎం జగన్ రూ. 86 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో రూ. 10 వేల కోట్లు, ఈ వర్గాల మహిళల కోసం మరో రూ. 10వేల కోట్లు ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న వస్తేనే సంక్షేమం కొనసాగి, మన జీవితాల్లో మరింతగా వెలుగులు నిండుతాయని చెప్పారు.
సీఎం జగన్ అంటేనే ఓ విప్లవం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అంటేనే ఓ విప్లవమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. చదువుతోనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగనన్న నమ్మి ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. మన పిల్లలు ఈరోజు బెంచీల మీద కూర్చుని, దర్జాగా యూనిఫాం, షూస్ వేసుకుని, టైలు కట్టుకుని.. ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారన్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణ పడిపోయామో అర్థం చేసుకోవాలని కోరారు. పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా రూ. 25 లక్షల మేర వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ కులం, మతం చూడరు.. కేవలం ప్రేమను చూపిస్తాడు: అలీ
సీఎం జగన్ కులం, మతం చూడరని, కేవలం ప్రేమనే చూపిస్తారని ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు. ఎప్పుడూ పేదలకు ఇంకా ఎంతో మంచి చేయాలని తపిస్తున్నారన్నారు. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు చాలా అవసరమని చెప్పారు.
జగన్ బటన్ నొక్కితే.. బాబు గొంతు నొక్కుతాడు: నాగార్జున యాదవ్
సీఎం జగన్.. బటన్ నొక్కి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జనం గొంతు నొక్కే కార్యక్రమాలే చేశారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశి్నంచారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, మేరిగ మురళీధర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment