Tirupati election
-
వెంకటగిరి.. జన కెరటం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సామాజిక న్యాయం నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా వ చ్చిన ప్రజలు శుక్రవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వెంకటగిరిలో ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ ఆశీర్వాదం అందుకుని డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతి వీధిలో స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు. దళితుల కోసం రూ. 86 వేల కోట్లు ఖర్చు : ఎంపీ గురుమూర్తి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ చేసినంత కృషి దేశంలో మరే ముఖ్యమంత్రీ ఇప్పటివరకు చేయలేదని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఒక్క దళితుల కోసమే సీఎం జగన్ రూ. 86 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో రూ. 10 వేల కోట్లు, ఈ వర్గాల మహిళల కోసం మరో రూ. 10వేల కోట్లు ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న వస్తేనే సంక్షేమం కొనసాగి, మన జీవితాల్లో మరింతగా వెలుగులు నిండుతాయని చెప్పారు. సీఎం జగన్ అంటేనే ఓ విప్లవం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అంటేనే ఓ విప్లవమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. చదువుతోనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగనన్న నమ్మి ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. మన పిల్లలు ఈరోజు బెంచీల మీద కూర్చుని, దర్జాగా యూనిఫాం, షూస్ వేసుకుని, టైలు కట్టుకుని.. ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారన్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణ పడిపోయామో అర్థం చేసుకోవాలని కోరారు. పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా రూ. 25 లక్షల మేర వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కులం, మతం చూడరు.. కేవలం ప్రేమను చూపిస్తాడు: అలీ సీఎం జగన్ కులం, మతం చూడరని, కేవలం ప్రేమనే చూపిస్తారని ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు. ఎప్పుడూ పేదలకు ఇంకా ఎంతో మంచి చేయాలని తపిస్తున్నారన్నారు. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు చాలా అవసరమని చెప్పారు. జగన్ బటన్ నొక్కితే.. బాబు గొంతు నొక్కుతాడు: నాగార్జున యాదవ్ సీఎం జగన్.. బటన్ నొక్కి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జనం గొంతు నొక్కే కార్యక్రమాలే చేశారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశి్నంచారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, మేరిగ మురళీధర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు. -
పోలీస్ వలయంలో తిరుపతి నగరం
ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీసులు సిద్ధం సమస్యాత్మక ప్రాంతాలపై ఎస్పీ దృష్టి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలే చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలు 1,800 మందితో బందోబస్తు తిరుపతి క్రైం: తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ ఆధ్వర్యంలో పోలింగ్‌కు పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే లక్ష్యంగా సాగుతున్నారు. 9 చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టుల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. అటువైపుగా వెళ్లే వాహనాలను అనుమానం ఉన్న వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేశారు. ఎవ్వరైనా ఎక్కడైనా రిగ్గింగ్‌కు పాల్పడినా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా 0877-2289043 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 103 ముఖ్యమైన ప్రాంతాలు తిరుపతి నియోజకవర్గంలో 103 ము ఖ్యమైన ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 43 అతి సమస్యాత్మక ప్రాం తాలు, 28 సమస్యాత్మక ప్రాంతాలు, 34 సాధారణ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వీటికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం ఈ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్‌లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ముం దస్తు చర్యలు చేపట్టారు. భారీ భద్రత 256 పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్సీసీ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, 5పారామిలటరీ దళాలు, 34 పోలీస్ పికెట్లు, 32 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటుచేశారు. తిరుపతి నగరం మొత్తం పోలీస్ వలయంలోకి తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే మద్యం దుకాణాలు, బార్లు అన్నీ మూతపడ్డాయి. ఎవ్వరైనా మద్యం బాటిళ్లతో కనిపిస్తే ఎక్సైజ్‌శాఖ కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకుంటోంది. -
కలెక్టర్‌గారి తీరు మారదా?
సమయపాలన పాటించని జిల్లా కలెక్టర్ పడిగాపులతో అధికారుల తిప్పలు మహిళా అధికారుల కష్టాలు వర్ణనాతీతం చిత్తూరు: ‘‘కలెక్టర్ సమీక్ష అంట.. ఎప్పటికి ఇంటికొస్తామో మాకే తెలియదు. అన్నం వండుకుని తినేసి పడుకోండి..’’ అంటూ ఓ అధికారిణి ఇంటికి పంపిన ఫోన్ ఎస్ఎంఎస్ ఇది.ఉదయం 11 గంటలకు మీటింగంటూ పిలిపిస్తారు.. మూడు గంటల వరకు ఆయనగారు రారు. ఎప్పుడొస్తారో తెలియక తిండితిప్పలు మాని కార్యాలయం చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వస్తోంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం. మాకు ఈ కర్మ ఏమిటి సార్.. ఓ జిల్లాస్థాయి అధికారి ఆవేదన ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్ష అంటేనే జిల్లా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. సమయపాలన పాటించని కలెక్టర్ తీరుతో విసిగిపోతున్నామంటూ తలలు పట్టుకుని కుయ్యో.. మొర్రో అంటున్నారు. ఇది ఒకటి, రెండు రోజుల సమస్య కాదు.. నిత్యం ఇదే తంతు. ముందుగా ప్రకటించిన సమయానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమీక్షలు, సమావేశాలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా గురువారం జరిగిన ఘటన కూడా కలెక్టర్ సమయపాలన పాటించలేదనేందుకు తార్కాణంగా నిలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. సమావేశానికి ఎన్నికల విధులకు సంబంధించిన అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచే ఎన్నికల పరిశీలకుడితో పాటు, ఆర్డీవో, డెప్యూటీ కలెక్టర్, ఆ తరువాత స్థాయి అధికారులు దాదాపు వందమంది ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్ వద్ద ఎదురుచూశారు. మూడు కాదు 4 గంటలైనా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో 2.45 గంటలకే సమావేశానికి వచ్చిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు వె ళ్లిపోయారు. మిగిలిన అధికారులందరూ కలెక్టర్ కోసం పడిగాపులు కాశారు. ఏమీ అనలేని మిగిలిన అధికారులు బాధ దిగమింగుకుని వేచి చూశారు. మరోవైపు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నేతల సమావేశానికి సైతం కలెక్టర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి కలెక్టర్ హాజరుకాలేదు. ఆ తరువాత సమావేశం 3 గంటలకు ఉంటుందని నేతలకు సమాచారం అందించారు. 3 గంటలకు కూడా కలెక్టర్ అటు రాజకీయ పార్టీ సమావేశానికి, ఇటు ఎన్నికల అధికారుల సమావేశానికిగానీ హాజరుకాలేదు. ఎన్నికల అధికారుల సమావేశానికి హాజరైన ఎన్నికల పరిశీలకులు విసిగివేశారి కలెక్టర్‌పై మండిపడ్డట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు 4.45 గంటలకు కలెక్టర్ అధికారుల సమావేశానికి హాజరయ్యారు. రాజకీయ పార్టీల సమావేశం వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమావేశాలు ఏదో ఒక రోజు ఒక గంట అటో ఇటో జరగడం సర్వసాధారణం. అయితే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమావేశాలు తరచూ ఆలస్యంగా జరుగుతున్నాయని, చెప్పుకోలేని బాధతో సతమతవుతున్నామని పలువురు అధికారులు ‘సాక్షి’తో వాపోయూరు.. తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి తీరు మారితే బాగుంటుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. -
రంగంలోకి చినబాబు
రేపు తిరుపతికి లోకేష్ రాక ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్ష పోలింగ్ శాతం పెంచేందుకు యత్నాలు దేశం కార్యకర్తల్లోనే అంత ర్యుద్ధం తిరుపతి: తిరుపతి ఉపఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అభ్యర్థిపై పార్టీలో నెలకొన్న అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి గట్టెక్కించేందుకు పార్టీ అధిష్టానం తంటాలు పడుతోంది. ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థికి ఎక్కువ శాతం ఓట్లు వస్తే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే ఉద్దేశంతో అధిష్టానం పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలను రంగంలోకి దించింది. దీంతో పాటు ప్రస్తుతం పార్టీ శ్రేణులు అభ్యర్థికి సహకరించకపోవడంతో వారినంతా ఒక గూటికి తేవడానికి యువనేత లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. ఈయన శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటారు. ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీలో సద్దుమణగని గొడవలు ప్రచారం సందర్భంగా టీడీపీలో గొడవలు జరుగుతూనే వున్నాయి. ఎన్నికల్లో డబ్బు పెత్తనం నాకంటే నాకని నాయకులు పోటీపడుతున్నారు. దీనిపై మంగళవారం పార్టీ అభ్యర్థి ముఖ్య అనుచరుడికి, ఇంకో పార్టీ నేతకు మధ్య గొడవ జరిగినట్టు కూడా సమాచారం. దీంతోపాటు బుధవారంలో ఆటోనగర్ ప్రచారంలో మాత్రం తమకు తెలియకుండా ప్రచారానికి వచ్చారంటూ మైనారిటీ నేతలు నిలదీశారు. ఇలా ప్రచారంలో గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిని చక్కదిద్దే విషయమై అధిష్టానం దృష్టి సారించకపోవడం గమనార్హం. దీంతోపాటు పోలింగ్ శాతం తగ్గుతుందనే గుబులు పార్టీ నేతలను పట్టిపీడిస్తోంది. ఎలాగైనా పోలింగ్ శాతం పెంచుకుని ఎక్కువ మెజార్టీ సాధించాలని అధిష్టానం ఇప్పటికీ ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. ఈమేరకు వారు ప్రణాళికను రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా అంతంతమాత్రంగా కొనసాగుతోంది. టీడీపీలో అసమ్మతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యనేతలు ఆమె ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పరువు పోకుండా కొద్దిమేరకైనా ఓట్లు సాధించి పట్టును నిలుపుకోవాలని మాజీ ఎంపీ చింతామోహన్ కృతనిశ్చయంతో వున్నారు. డ్వాక్రా మహిళల ఓట్లపైనే ఆశలు పెంచుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ గడువు సమీపిస్తున్నప్పటికీ నగరంలో ప్రచారం ఇంకా ఊపందుకోకపోవడం గమనార్హం. -
గుండెల్లో గుబులు
టీడీపీ, కాంగ్రెస్‌లకు అసంతృప్తుల బెడద కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై నేతల విమర్శలు ‘చింతా’ తీరుపై పార్టీలో వ్యతిరేకత తెలుగుదేశం పార్టీలో సీనియర్ల కినుక అల్లుడి జోక్యంపై అసంతృప్తి రెండు పార్టీల అభ్యర్థుల్లోనూ ఆందోళన తిరుపతి: తిరుపతి ఉపఎన్నికలో పోటీ అనివార్యమైంది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బరి నుంచి తప్పుకుంది. చివరకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల గోదాలో తలపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలపై ఓటర్లలో వెల్లువెత్తుతున్న తీవ్ర అసంతృప్తి అభ్యర్థులను ఆందోళకు గురిచేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కినుక నామినేషన్ గడువు చివరి రోజు మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన మబ్బు దేవనారాయణరెడ్డితోపాటు నగర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా మహిళాధ్యక్షురాలు ప్రమీలమ్మ వంటి నేతలు వ్యతిరేకిస్తూ నామినేషన్ కార్యక్రమానికి సైతం గైర్హాజరయ్యారు. మాజీ ఎంపీ చింతామోహన్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా అభ్యర్థి ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అనుచరులే పెదవి విరుస్తున్నారు. అల్లుడి అత్యుత్సాహంపై అసంతృప్తి ఇదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుగుణమ్మకు అసమ్మతి బెడద తప్పడం లేదు. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అల్లుడు మితిమీరిన జోక్యాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో ఉద్యోగుల నియమకాలకు సంబంధించి ఆరోపణలు, అప్పట్లో సీఎంకు సైతం పార్టీ శ్రేణులు ఫిర్యాదులను చేశాయి. తిరుమల కొండపై నియమాకాలకు సంబంధించి గతంలో పార్టీ అభ్యర్థి అల్లుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికితోడు సీనియర్ నేతలు అంటీముట్లనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నేత చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ బోర్డు పదవి ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఈ రోజు రేపు అంటూ నియమాకాన్ని దాటవేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన లోలోపల చంద్రబాబు వ్యవహార శైలిపై రగిలిపోతున్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో మహిళలు, పేదల్లో బాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చదలవాడకు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి, బ్రాహ్మణ సమాజానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సామాజికవర్గానికి పదవి ఇచ్చే విషయమై ఎక్కడా ప్రస్తావన తేలేదు. దీంతో వారు సైతం కినుక వహిస్తున్నట్లు తెలుస్తోంది.