jonnalagadda padmavathi
-
సీఎం జగన్ చేసిన తప్పేంటి? చంద్రబాబు బుద్ది ఎలాంటిదంటే.. పప్పు కోసం పాకులాట.. జొన్నలగడ్డ పద్మావతి కామెంట్స్
-
ఏపీలోని ఆడపడుచులందరం అండగా ఉంటాం: జొన్నలగడ్డ పద్మావతి
-
ఎన్నికలు వచ్చినప్పుడు మార్పులు జరుగుతుంటాయి: జొన్నలగడ్డ పద్మావతి
-
ఎమ్మెల్యే జొన్నలగడ్డ చించి పారేసిన ఈనాడు పేపర్
-
‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’
సాక్షి, తాడేపల్లి: ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిం చడం నేరమా? అని ఎల్లో మీడియాను నిలదీశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. నీటి సమస్యలపై అధికారుల్ని నిలదీస్తే.. ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంతవరకూ జగనన్న బాటలోనే నడుస్తానని ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. నా మాటల్ని ఎల్లోమీడియా వక్రీకరించింది మొన్న నేను ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై మాట్లాడాను. మా దగ్గర స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, నా ఆవేదనను ఎల్లోమీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసింది. నా మాటలు తప్ప వేరే వార్తలేమీ లేనట్టు ఒక రోజంతా పనిగట్టుకుని హైలెట్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగనన్నకు నేను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఎల్లోమీడియా ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మరి, అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పాను కదా..? ఆ మాటల్ని ఎల్లోమీడియా ఎందుకు హైలెట్ చేయలేదు. కొన్ని ఛానెళ్లు ఆ మాటల్ని కట్ చేసి మిగతా విషయాల్ని మాత్రమే ఎందుకు హైలెట్ చేశాయని ప్రశ్నిస్తున్నాను. అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడా.. మా నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో నేను చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, ఎలాంటి పరిష్కారం లభించనందున.. సీఎం గారికి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. లేకుంటే, మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. ఆ మాటల్ని కాస్తా.. ఎల్లోమీడియా తమకు అనుకూలంగా నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. వారి ఛానళ్లుల్లో ప్రసారం కూడా చేశారు. అధికారులపై ఆవేదనతో మాట్లాడాను తప్ప ఎల్లోమీడియా ప్రచారంలో ఉన్న అంశాలేమీ నిజంకాదు. ఎల్లోమీడియా కథనాల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈనాడు తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాను ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? అయితే, ఈరోజు ఈనాడు పత్రిక ఏదేదో ఊహించి అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘దళిత మహిళ ప్రశ్నించడమే నేరమా..?’ అనే శీర్షికన కథనం ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను.. ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది కూడా స్పష్టంగా రాయాలి కదా..? నేను ప్రశ్నించింది అధికారులనే కానీ.. జగనన్నను కాదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. జిల్లాస్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు..జగనన్న దగ్గరకు వెళ్తేనే పనులు అవుతున్నాయని అన్నాను. అందులో తప్పేంటి..?. ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు నాకు బాధ కలిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్ని వత్తిళ్లు చేయడం సాధారణం. మరి, అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా హైలెట్ చేసి మా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే ఎల్లో మీడియా పైత్యం ఎంతవరకు సబబు..? సొంతచెల్లెలుగా చూసుకున్న జగనన్న రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో నేనేదో భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి వచ్చిన మనిషిని కాదు. మేము జగనన్నను 2014 ఎన్నికల ముందు కలిసినప్పుడు.. ఆయనతో మాట్లాడిన రోజే మేమొక స్పష్టతకు వచ్చాం. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నాము. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో వారి విజన్‌ను కలిసిన మొదటి రోజునే మేము అర్ధం చేసుకున్నాం కాబట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా నన్ను చూసుకున్నారు. వారు చెప్పిందే వేదవాక్కుగా పనిచేయడమే తప్ప.. ఏనాడూ వారిని ధిక్కరించే మనస్తత్వం నాదికాదు. ఈ విషయాన్ని మీడియా మొత్తానికి స్పష్టం చేస్తున్నాను. జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా నా రాజకీయ భవితవ్యం జగనన్న చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను మరలా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటి నేను వైఎస్ఆర్సీపీని వీడిపోతున్నట్లు.. జగనన్నను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లోమీడియాలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగనన్న ఎస్సీలకు చేసిన మేలు దేశచరిత్రలో లేదు ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు. దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా ఆయన మేలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే నాయకుడిగా జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం అందరూ కళ్లకు కట్టినట్లు చూస్తోన్న నిజం. కనుకనే, ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చిత్రపటాలు ప్రతీ పేదింట పెట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..? చంద్రబాబును భుజాలపై మోస్తోన్న ఈనాడు పత్రికతో సహా ఇతర ఎల్లోమీడియా ఏం కోరుకుంటున్నాయి..? ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదనుకుంటున్నాయా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదని మీర నుకుంటున్నారా..? అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. మీరు నామీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారే..? జగనన్నకు అపాదిస్తే దళిత మహిళ నోటిని కట్టడి చేయవచ్చనుకున్నారా..? చంద్రబాబు, ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. పైగా, మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాయడం మానేయకపోతే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తున్నాను.. (అంటూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి చింపేశారు) నా జోలికొస్తే కోర్టుకీడుస్తాను చంద్రబాబుకు, ఇతర ఎల్లోమీడియాకు ఒక దళిత మహిళగా నేనొక హెచ్చరిక చేస్తున్నాను. నేను రైట్ పాత్‌లోనే నడుస్తున్నాను. ఊపిరున్నంత వరకు జగనన్న నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాను. నేను రైట్‌గానే ఆలోచిస్తున్నాను. జగనన్నకు నన్ను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా నా జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను. చీడపురుగు చంద్రబాబు దేశం వదిలిపోవాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయానికి దిగజారిపోతున్నాడు. ఆయనకు తోడుగా ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు పనిచేస్తూ.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుపై, ఇతర పార్టీ నేతలపై, ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలుండవా..? అలాంటిది, మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాకు గొడవలుంటే.. ఎవరి నియోజకవర్గాల్ని వారు అభివృద్ధి చేసుకునే క్రమంలో చిన్నపాటి వివాదాలు పడితే.. మీకేంటి అంత బాధా..? అధికారుల్ని ప్రశ్నించినంతమాత్రానా.. దాన్ని జగనన్నకు అపాదించి నీ ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తావా..? నీ కుట్ర బుర్రలో నుంచి వచ్చిన విషపు ఆలోచనేనని మేము గ్రహించాము. జగనన్న రాజకీయ వ్యూహానికి భయపడి నువ్వు ఆంధ్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంటున్నావు. అందుకే, నిన్ను శాశ్వతంగా ఇక్కడ లేకుండా దేశం వదిలిపోయేలా చేయాలని జగనన్నను నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరముందని ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. -
సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం: ఎమ్మెల్యే పద్మావతి
-
సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
-
ఇలాంటి మనుషులను ఏం చేయాలి అంటే: జొన్నలగడ్డ పద్మావతి
-
శింగనమల ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన వేళ
-
శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
అనంతపురం క్రైం: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బుధవారం రాత్రి అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. (చదవండి: పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..) ఎమ్మెల్యే వాహనం సోములదొడ్డి వద్ద నేషనల్ హైవే మీదకు మళ్లిన వెంటనే వెనుక వైపు నుంచి ఫోర్డ్ ఫిగో కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేకు ఎటువంటి ఆపద తలెత్తలేదు. ప్రమాదంలో రెండు కారులూ దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వాహనంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు డ్రైవర్, గన్‌మెన్ ఉన్నారు. ఫోర్డ్ ఫిగో వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఫిగో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే అందులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి -
మీ‘బండ’బడ.. ఇదేం రాజకీయం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు బీకేఎస్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నడిపి సిద్దరామప్ప కుమారుడు నాగరాజుది. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా ఇంటికి దక్షిణాన సిమెంట్ రోడ్డు ఉండగా.. నాగరాజు మాత్రం తూర్పువైపున్న వెంకటనారాయణరెడ్డి స్థలంలోకి గేటు పెట్టాడు. దీంతో వెంకటనారాయణరెడ్డి తన స్థలం చుట్టూ బండలు పాతుకోగా.. తన ఇంటిచుట్టూ బండలు పాతారంటూ నాగరాజు గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు కూడా కొన్నిరోజులుగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా పలువురు నాయకులు వెంకటాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు వారిని అడ్డుకుని స్వగృహాలకు తరలించారు. ఈ చిత్రం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.. టీడీపీ ‘బండ’ రాజకీయం. ఆధారాలు చూపించి మాట్లాడండి బుక్కరాయసముద్రం : వెంకటాపురంలో టీడీపీ నాయకుడు నాగరాజు స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించి మాట్లాడాలని, స్థల యజమాని బండలు పాతితే తప్పా అంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే తన స్వగృహంలో కురుబ సంఘం నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఇద్దరి వ్యక్తుల మద్య ఉన్న స్థల వివాదానికి రాజకీయ రంగు పులిమి కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి రోడ్లపైకి ఆందోళనలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. వెంకటనారాయణరెడ్డి సొంత స్థలంలో నాగరాజు అప్పటి కాంట్రాక్టర్‌కు కొంత మొత్తం చెల్లించి సిమెంట్ రోడ్డు వేయించుకున్నాడన్నారు. సదరు స్థలాన్ని వెంకట నారాయణరెడ్డి పంచాయతీకి గానీ, ప్రభుత్వానికి గానీ రాసివ్వలేదన్నారు. ఎలాంటి తీర్మానాన్ని కూడా స్థలయజమాని నుంచి తీసుకోలేదని, దీంతో అతడు తన స్థలానికి హద్దుల ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా బండలు పాతడాన్నారు. అయితే ఈస్థలం పక్కనే ఉన్న నాగరాజు ఇటీవలే ఇల్లు నిర్మించాడన్నారు. ఆ ఇంటికి దక్షిణ వైపు సిమెంట్ రోడ్డు ఉందని, తూర్పు వైపు ఉన్న వెంకటనారాయణరెడ్డి స్థలంపై కూడా తమకు హక్కు ఉందంటూ బండలు తొలగించాలంటూ టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం దారుణమన్నారు. ఈ వివాదంపై టీడీపీ నాయకులు రోజూ ధర్నాలు, ఆందోళనలు అంటూ గొడవలకు దారి తీసేలా ప్రయత్నిండం ఏమాత్రం సరికాదన్నారు. 10 రోజులుగా నాగరాజు సిమెంట్ రోడ్డుకు సంబంధించిన పత్రాలు ఏమాత్రం చూపించకుండా ఈ రోడ్డుపై తమకు హక్కు ఉందని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ ఆందోళనల వెనుక జేసీ హస్తం ఉందని, ఈ రోజు కూడా బీకేఎస్‌లో ఆందోళనల షో చేశారన్నారు. వ్యక్తిగత విమర్శలు తగదు.. టీడీపీ నాయకులు అనవసరంగా తనపై, తన కుటుంబంపై సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే మరోసారి విమర్శలు చేస్తే వారిపై కేసులు వేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యను కులాల సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు గత ఎన్నికలలో కోలుకోలేని దెబ్బతిన్నారని, ప్రజల్లో ఉనికి కోసం పాకులాడుతున్నారన్నారు. ఒక వర్గం మీడియా కూడా కేవలం వెంకటనారాయణరెడ్డి నాటిన బండలనే చూపించడం దారుణమన్నారు. నాగరాజు ఇంటికి దక్షిణ వైపు ఉన్న సిమెంట్ రోడ్డు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అంకే నరేష్, కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుల్లే నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి బుల్లే వీర నారప్ప, సీఎం వెంకటేశు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం
శింగనమల: ఎన్నికల్లో శింగనమల ఫలితంకోసం జిల్లా వాసులంతా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే 1978 నుంచి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే...ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఈ సెంటిమెంట్ పండింది. శింగనమల నియోజకవర్గం 1978లో ఎస్సీకి రిజర్వ్ కాగా అప్పుడు జనతా పార్టీ నుంచి బి.రుక్మిణీదేవి ఇక్కడి నుంచి గెలవగా... రాష్ట్రంలో జనత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో టీడీపీ తరఫున పి.గురుమూర్తి ఎమ్మెల్యేగా ఎన్నికాగా, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1985లో టీడీపీ తరఫున కె.జయరాం ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పి.శమంతకమణి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కె.జయరాం ఎన్నిక కాగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 1999లోనూ టీడీపీ తరఫున మళ్లీ కె.జయరాం ఎమ్మెలేగా గెలవగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా సాకే శైలజానాథ్ ఎన్నికకాగా...రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ తరఫున సాకే శైలజానాథ్ విజయం సాధించగా.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. 2014లో టీడీపీ తరఫున యామినీబాల గెలువగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా 2019లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇలా శింగనమల సెంటిమెంట్ మరోసారి నిజమైంది. -
జగన్ రావాలి.. నీరు పారాలి
సాక్షి,బుక్కరాయసముద్రం: నియోజకవర్గంలో సాగు నీటి కోసం వైఎస్సార్సీపీతో పాటు రైతులు కూడా ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని... మరోసారి టీడీపీకి ఓటు వేస్తే మళ్లీ సాగునీళ్లు అందకుండా చేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సాగునీరు పారాలంటే.. వైఎస్సార్సీపీకి పట్టంకట్టాలన్నారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలంలోని బాట్లో కొత్తపల్లి , వడియంపేట, పొడరాళ్ల, రేగడి కొత్తూరు, గోవిందపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి, బోయకొట్టాల, రాఘవేంద్ర కాలనీ, బీజేపీ కాలనీల్లో జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకోవడం.. దాచుకోవడంలోనే ఈ ఐదేళ్లు బిజీగా ఉన్నారని విమర్శించారు. శింగనమల నియోజకవర్గంలో సాగునీళ్లు లేక ఓ వైపు రైతులు, తాగునీరు లేక మరోవైపు ప్రజలు అల్లాడిపోతున్నా అధికార పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కళ్లెదుటే హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్లు వెళ్తున్నా వాటిని వాడుకోలేని దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అసమర్థతను ఆసరాగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ నీటిని అక్రమంగా తరలించుకుపోయారని గుర్తు చేశారు. అంతే కాకుండా వారి చెప్పు చేతుల్లో ఉం డేవారికే టిక్కెట్లు ఇప్పించారని, మరోసారి టీడీపీకి ఓటు వేస్తే శింగమల నియోజకవర్గానికి నీటిగండం తప్పదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శింగనమల నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి తీరుతామన్నారు. ఒక్క అవకాశం ఇస్తే శింగనమల ని యోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. జోరుగా ప్రచారం బుక్కరాయసముద్రం మండలంలో జొన్నలగడ్డ పద్మావతి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మండలంలోని బాట్లో కొత్తపల్లి, వడియంపేట, పొడరాళ్ల, రేగడికొత్తూరు, గోవిందపల్లి కొట్టాలపల్లి గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున జొన్నలగడ్డ పద్మావతికి ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో భారీగా టపాసులు పేలుస్తూ పూలతో స్వాగతం పలికారు. దళిత కాలనీలలో జొన్నలగడ్డ పద్మావతికి మహిళలు స్వాగతం పలికి సమస్యలు చెప్పుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పద్మావతి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అంకే నరేష్ తో పాటు ఆలూరి రమణారెడ్డి, కొర్రపాడు బాల నాగిరెడ్డి, గువ్వల రాజశేఖర్‌రెడ్డి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
శింగనమలలో ఉద్రిక్తత..జొన్నలగడ్డ అరెస్ట్
-
శింగనమలలో ఉద్రిక్తత.. జొన్నలగడ్డ అరెస్ట్
అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగేళ్ల పాలన, టీడీపీ నేతల అవినీతిపై వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాలతో చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. మరోవైపు పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, అందుకే టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు. -
అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
- కొనసాగుతున్న మేలుకొలుపుయాత్ర - పద్మావతితో తమగోడును వెల్లబోసుకుంటున్న జనం శింగనమల : ‘మీరు ఎన్నికల్లోనూ తిరిగారు, ఇప్పడు మా సమస్యలు నెరవేర్చడానికి తిరుగుతున్నారు. మా ఓట్లు మీకేవేస్తాం... శింగనమల చెరువుకు నీరు విడిపించి మమ్మల్ని ఆదుకోండి.. ఇప్పడున్న ఎమ్మెల్యే యామినీబాల మాదిరి మోసం చేయొద్దు ’ అని శింగనమలోని బోయవీధికి చెందిన మహిళలు మేలుకొలుపు పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతికి విన్నవించుకున్నారు. ఆరో రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం కొర్రపాడు నుంచి మొదలైన పాదయాత్ర మరువకొమ్మ క్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట క్రాస్, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామం వరకు సాగింది. ఈ యాత్రలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామ గ్రామానా జొన్నలగడ్డ పద్మావతికి జనం ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు కొర్రపాడు – శింగనమల మరువకొమ్మక్రాస్ మధ్యలో ఉపాధి హమీ పనులు చేస్తున్న శివపురం కూలీలను పద్మావతి పలకరించారు. కూలీ సక్రమంగా వస్తోందా అని కూలీలను పద్మావతి ప్రశ్నిచంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎండిపోయిన శింగనమల చెరువును పరిశీలించి , మత్స్యకారులతో వారి సాధకబాధలను విన్నారు. శింగనమల చెరువుకు నీళ్లు విడిపించి ఆదుకోవాలని వారు వినతిపత్రం సమర్పించారు. అక్కడే చిన్నజలాపురానికి చెందిన బండి శ్రీనివాసులు కుమార్తె సాయివర్షిణి బర్త్‌డే సందర్భంగా కేక్ కట్‌చేయించారు. శింగనమలలో ఎమ్మార్వో కార్యాలయం కాలనీలో తాగునీరురాక ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం గ్రామాల్లోనూ మహిళలు, ప్రజలు పద్మావతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ అంజన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటప్ప, ఈశ్వరమ్మ, ఆంజినేయులు, ఆదినారాయణ, వెంకటరమణ, డేగల ఓబిలేసు, మదన్‌మోహన్‌రెడ్డి, మహిళ విభాగం నాయకురాలు శకుంతలమ్మ, చెన్నమ్మలు పాల్గొన్నారు. -
మేలుకొలుపునకు జన స్పందన
బుక్కరాయసముద్రం (శింగనమల) : గ్రామాల్లో çరైతులు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వానికి కళ్లు తెరపించడానికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజక వర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన లభిస్తోంది. మంగళవారం ఐదో రోజు చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి, వెంకటాపురం క్రాస్, చెన్నంపల్లి, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు గ్రామాల్లో కొనసాగించారు. ఈపాదయాత్రలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, గుంతకల్లు నియోజక వర్గం సమన్వయకర్త వైటీ వెంకటరామిరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు పాల్గొన్నారు. అడుగడుతునా పద్మావతికి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు.. బొమ్మలాటపల్లి పల్లి నుంచి పాదయాత్ర మొదలువుతూనే ఉపాధి కూలీలు బిల్లులు రాలేదని మొరపెట్టుకున్నారు. చెన్నంపల్లిలో పింఛన్లు రాలేదని, తాగునీటి సమస్య ఉందని ప్రజలు తెలిపారు. హెచ్చెల్సీ కాలువకు నీరు వదలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వివరించారు. అక్కడి నుంచి నీలారెడ్డిపల్లికి బయలుదేరగా, మధ్యలో నాసిరకంగా నిర్మించిన పనులు పరిశీలించారు. ఉపాధి పనులు చేసి వస్తున్న కూలీలతో మాట్లాడుతూ బిల్లులు సక్రమంగా అందడం లేదన్నారు. కూలీ రోజుకు రూ.100 మాత్రమే వస్తోందని కూలీలు ఆమెకు తెలిపారు. మిరప పంటను గొర్రెలకు వదిలేయడంతో పంటను పరిశీలించారు. భూగర్భజలం తగ్గిపోయి బోరులో నీరు రాకపోవడంతో మిరపపంటను గొర్రెలకు వదిలేశారని వివరించారు. నీలారెడ్డిపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో రైతు పుల్లారెడ్డికి చెందిన ఎండిన అరటి తోటను పరిశీలించారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అని పద్మావతి రైతును ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతు వాపోయాడు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సాకే ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘం సొసైటీ మండల అధ్యక్షులు నాగలింగారెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అద్యక్షులు సాకే రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చేర్మెన్ ముసలన్న, మాజీ మండల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మిన్న, ఎంపీటీసీ మల్లయ్య, సురేష్, జిల్లా మహిళా కార్యదర్శి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ కాదు సోమాలియా చేస్తున్నారు
-
మేలుకొలుపు పాదయాత్రకు భారీ స్పందన
– వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వద్ద గ్రామీణులు సమస్యల ఏకరవు యల్లనూరు / పుట్లూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికివదిలేసిన టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు, గ్రామీణులను జాగృతం చేసేందుకు వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన వస్తోంది. కార్యక్రమంలోభాగంగా ఆమె శనివారం యల్లనూరు మండలంలోని అచ్యుతాపురం, వాసాపురం, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండుగారికుంట, కొత్తపల్లి, కుమ్మనమల, చాలవేముల క్రాస్, మడ్డిపల్లి గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. తాడిపత్రి సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ సమస్యలపై మండుటెండలో పాదయాత్ర చేపడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తూ హారతులు, పసుపు కుంకుమలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కష్టాల ఏకరువు.. యల్లనూరు మండలం బొప్పేపల్లిలో పలువురు గ్రామస్తులు పద్మావతి వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. శారద అనే మహిళ మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు రూ.2500 వసూలు చేశారని, ఇప్పటివరకూ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకరోజు మాత్రమే రేషన్ ఇచ్చి, అయిపోయిందని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పాఠశాల పైకప్పు పడిపోయి మూడు సంవత్సరాలు అయిందని, ఎంఎల్ఏ యామినీబాల వచ్చి మూడుసార్లు పాఠశాలను పరిశీలించినా నూతన భవనాన్ని నిర్మించలేదున్నారు. కొండుగారికుంటలో తాగునీటి సమస్య ఉండగా కేవలం రెండు ట్యాంకర్ల నీరు మాత్రమే అందిస్తున్నారని మహిళలు వాపోయారు. గుంతల్లోని నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపం పథకం కింద కేవలం రూ.950లకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా రూ.1250 వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. బొప్పేపల్లి చెరువుకు నీరు అందించాలి.. – సుబ్బరాయసాగర్ నుంచి 29వ డ్రిస్టిబ్యూటర్ ద్వారా బొప్పేపల్లి చెరువుకు నీటిని సరఫరా చేయాలని జొన్నలగడ్డ పద్మావతి డిమాండ్ చేశారు. బొప్పేపల్లి చెరువుకు నీరు చేరితే ఓబుళాపురం, కడవకల్లు, చెర్లోపల్లి, మడ్డిపల్లి, చాలవేముల, కుమ్మనమల, రంగరాజుకుంట, కొండుగారికుంట గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కుమ్మనమల ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల సమస్యలను తీర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిప్రసాద్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శులు రామాంజులరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన కన్వీనర్ రామాంజులరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ నాగేష్, ఎంపీటీసీ లక్ష్మిదేవి, సర్పంచ్‌లు రామక్రిష్ణారెడ్డి, దశ్యుంతుల, విజయభాస్కర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, నాయకులు రామాంజులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
కనికరం లేని ప్రభుత్వం
- రైతుల ఇబ్బందులను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు - కళ్లు తెరిపించేందుకే ‘మేలుకొలుపు’ పాదయాత్ర - వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి - యల్లనూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అనంతపురం : ‘పది మందికీ అన్నం పెట్టే అన్నదాతలు వరుస కరువులతో పంటలు పండక అప్పుల పాలయ్యారు. కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో వలసలు వెళుతున్నారు. అక్కడా పనుల్లేక భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనని మూడేళ్ల పాటు ఎదురుచూశా. ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకునే పాదయాత్రకు శ్రీకారం చుట్టాన’ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. వేసవిలో పాదయాత్ర చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చాలామంది చెప్పారని, అయితే.. రైతులు పడుతున్న కష్టాల కంటే తాను పడే ఇబ్బందులు పెద్దవి కావని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గంలో సుమారు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర శుక్రవారం యల్లనూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పద్మావతి మాట్లాడారు. నియోజకవర్గ రైతాంగ సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం, హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ముందు ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. అయినా అ«ధికారులు స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు తీసుకోవడంలో మునిగిపోయారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కొందరికి స్థలం కొంటే కలిసొస్తుంది, మరికొందరికి పెళ్లయితే కలిసొస్తుంది, ఇంకొందరికి పిల్లలు పుడితే కలిసొస్తుంది... అయితే చంద్రబాబుకు ఇతరులను వెన్నుపోటు పొడవడం కలిసొస్తోందని ఎద్దేవా చేశారు. బిడ్డనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఓసారి సీఎం అయ్యారు.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, చేనేతలను వెన్నుపోటు పొడిచి 2014లో మరోసారి సీఎం పీఠమెక్కారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. టీడీపీకి తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. అలాగే తన పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలపై అడిగేవారేరీ? : అనంత రైతు సమస్యలపై జిల్లాలో ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధీ అడగడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మీకు సిగ్గుంటే, జిల్లాపై ప్రేమ ఉంటే సీఎం చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఈ ఏడాది జిల్లాకు 28 టీఎంసీల దాకా నీళ్లొచ్చినా కనీసం 26 ఎకరాలకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి దౌర్జన్యంగా నీళ్లు తరలించుకుపోతే ప్రశ్నించే సాహసం చేయని దద్దమ్మలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక గేదెకాని, అవు కాని ఇచ్చారా? రైతులు, కూలీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీఎం అబద్ధాలతో మోసం చేస్తున్నారు : శంకరనారాయణ చంద్రబాబు 2014 ఎన్నికల్లో దాదాపు 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, సీఎం పీఠమెక్కాక ఒక్క హామీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ధ్వజమెత్తారు. పైగా రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్‌చంద్రారెడ్డి, పార్టీ మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్, నాయకులు మీసాల రంగన్న, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, యల్లనూరు ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు రమణ, సర్పంచ్ ఓబులేసు, ఎస్సీ సెల్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, బోయ సుశీలమ్మ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీసీటీ సభ్యురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. -
సమాజ సేవలోనే దైవత్వం
బుక్కరాయసముద్రం : సమాజ సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉంటుందని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలూరి సాంబశివారెడ్డి మాతృమూర్తి ఆలూరి నారాయణమ్మ 10వ వర్ధంతి సందర్భంగా బోధన, బోధనేతర ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థులుగా జొన్నలగడ్డ పద్మావతితో పాటు కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ 2007 నవంబర్‌లో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి.. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు, విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఎస్ఆర్ఐటీ స్థాపించామన్నారు. అలాగే ప్రతియేటా పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. అలాగే కళాశాలలో మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్నాథ్రెడ్డి, సలీం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్నదానం కూడా చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఆలూరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబువి అన్నీ ఆర్భాటాలే
పుట్లూరు : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవి త అన్నారు. శుక్రవారం మండలంలోని కడవకల్లులో ఆమె సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతితో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను అమలు చేయకుండా కేవలం ఆర్భాటాలు చేస్తూ పబ్బం గడుపుతున్నార ని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని ఒకవైపు చెబుతూ మరో వైపు గోదావరి పుష్కరాలకు రూ.1400 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం రూ.1000కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ జంగం నల్లమ్మ పాల్గొన్నారు.