
వైఎస్సార్‌సీపీ మహిళా నేత జొన్నలగడ్డ పద్మావతిని అడ్డుకుంటున్న పోలీసులు
అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగేళ్ల పాలన, టీడీపీ నేతల అవినీతిపై వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాలతో చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పద్మావతి అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. మరోవైపు పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, అందుకే టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment