సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్‌ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వివిధ స్కీమ్‌లను పరిశీలిస్తే నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశాం. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలో బీసీలు సీఎంలుగా ఉన్న ఏపీలో ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలి. రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశాయి.
గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడు. బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారు. మళ్లీ ఇప్పుడు మాత్రం జయహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకువచ్చారు’ అని సజ్జల వివరించారు.
రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్దికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానన్నారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఇదీచదవండి..పార్టీ ఫిరాయించిన వారితో వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా
Comments
Please login to add a commentAdd a comment