
తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో(శనివారం) 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్రం నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరుగనుంది.
ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు
ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment