నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్‌ | YSRCP Samajika Sadhikara Bus Yatra 41st Day | Sakshi
Sakshi News home page

నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్‌

Published Sat, Jan 6 2024 10:09 AM | Last Updated on Wed, Jan 31 2024 11:58 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra 41st Day - Sakshi

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా నేడు(శనివారం) విశాఖ నార్త్‌ నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా పెద్దాపురం, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరుగనుంది. విశాఖ నార్గ్‌ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల మీడియా సమావేశం ఉండగా, పన్నెండు గంటలకు అక్కయ్యపాలెం ఎన్జీవోస్‌ కాలనీలో స్కూల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు.  మధ్యాహ్నం రెండు గంటలకు మాధవధార లాస్ట్‌ బస్‌ స్టాప్‌ నుండి బైక్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పోర్ట్‌ హాస్పిటల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జి  వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమురి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు.

మరొకవైపు కాకినాడ జిల్లా పెద్దాపురంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, ఎమ్మెల్సీ కొయ్యే మోషెన్‌రాజు తదితరులు హాజరుకానున్నారు.

ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం మూడు గంటలకు ముత్తుకూరులోని వాణి మహల్‌సెంటర్‌ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరు బస్టాండ్‌లో బహిరంగ సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీద మస్తాన్ రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర నేత ఖాదర్ బాషా, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, తదితరులు పాల్గొనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement