సాక్షి, అమరావతి: పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పీడీఎఫ్ అభ్యర్థులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం అభినందనలు తెలిపారు.
అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి ఆయన ఒక్కొక్కరికీ ఫోన్లు చేశారు. మంచి ఫలితాలను సాధించారని అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, పీడీఎఫ్ విజయాన్ని పురస్కరించుకుని జగన్ తన చాంబర్‌లో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంచుకున్నారు.
కొత్త ఎమ్మెల్సీలకు జగన్ అభినందనలు
Published Thu, Mar 23 2017 3:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
Advertisement
Advertisement