
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
చిత్తూరుజిల్లా: నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.