janmabhoomi programme
-
‘జన్మభూమి’ లో టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం : జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త విజయభాస్కర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు శ్రీదేవి, విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు శ్రీదేవి, విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడి, దూషించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
చంద్రబాబుపై టీడీపీ మహిళా కార్యకర్తలు ఫైర్
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆకివీడు మండలం కుప్పనపూడిగ్రామంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజాపతినిధులపై సొంత పార్టీ మహిళా కార్యకర్తలే విరుచుపట్టారు. 2015లో ఇల్లు కట్టుకున్న తమకు రూ. 60 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని గగ్గోలు పెట్టారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేస్తే తాను మాట్లాడుతానని ఓ మహిళా కార్యకర్త అన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే శివ ఎదురుగా టీడీపీ సభ్యత్వ పుస్తకాలను చింపేస్తామని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్సార్‌కు అన్యాయం చేసి టీడీపీకి మద్దతు తెలిపినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. -
అనంతపురం జన్మభూమిలో రచ్చ రచ్చ
-
జన్మభూమిలో ప్రజాగ్రహం
-
జన్మభూమి కార్యక్రమంలో విద్యార్ధులతో పనులు
-
ఏయ్ తమ్ముడూ.. మాట్లాడొద్దు!
సాక్షి, కడప: జన్మభూమి–మాఊరు కార్యక్రమం సందర్భంగా బుధవారం పులివెందులలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పట్ల సీఎం చంద్రబాబు గద్దింపు ధోరణిలో వ్యవహరించటం అందరినీ నివ్వెరపరిచింది. గండికోట ప్రాజెక్టు నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేయగా దివంగత వైఎస్సార్ హయాంలోనే దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చు చేశారని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనం అంతా ఉత్సాహంగా నిల్చుని వైఎస్ అవినాష్‌రెడ్డికి మద్దతుగా చప్పట్లు, ఈలలు, కేకలు వేయటంతో సీఎం చంద్రబాబు అసహనానికి గురయ్యారు. వెంటనే మైక్ తీసుకుని ‘ఏయ్ తమ్ముడూ.. గండికోటకు ఎవరెంత పెట్టారో.. ఎవరేం చేశారో నేను మాట్లాడటం లేదు.. మీరూ మాట్లాడవద్దు’అంటూ అవినాష్‌రెడ్డి వద్ద ఉన్న మైక్‌ను ఇవ్వు తమ్ముడూ అంటూ పట్టుబట్టారు. ఇతరులు ఆయన వద్ద మైకును తీసుకునేవరకు ఊరుకోలేదు. వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రసంగం మొదలైన రెండు నిమిషాలకే వేదికపై కూర్చున్న చంద్రబాబు లేచి అడ్డుకోవటం గమనార్హం. వైఎస్ పేరు ప్రస్తావించగానే జన్మభూమి–మాఊరు గ్రామసభలో సీఎం చంద్రబాబు దాదాపు గంటన్నరసేపు ప్రసంగించినా జనాల్లో ఉత్సాహం కనిపించలేదు. 4.15 గంటల సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రసంగిస్తూ గండికోట ద్వారా పులివెందులకు నీరు తెచ్చేందుకు వైఎస్సార్ చేపట్టిన సంకల్పం గురించి వివరించినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు ముందుకొచ్చి ఎంపీ ప్రసంగాన్ని అడ్డగించి అతని మైక్ లాక్కునే వరకు ఊరుకోలేదు. ఏయ్ తమ్ముడూ.. మాట్లాడొద్దు! -
జన్మభూమి సభలో టీడీపీ నేతల ఓవరాక్షన్
-
జన్మభూమి సభలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
-
జగడభూమిగా మారిన జన్మభూమి కార్యక్రమం
-
జన్మభూమిలో రచ్చరచ్చ
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట గ్రామంలో శనివారం ఉదయం జరిగిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. రిజర్వుఫారెస్టుకు సమీపంలో ఉన్న తమ పొలాలపై అడవిపందులు పడి పంటలను నాశనం చేస్తున్నాయని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయలచెరువుపేట గ్రామానికి చెందిన దాదాపు 80 మంది రైతులు అధికారులను నిలదీశారు. జన్మభూమి సభను అడ్డుకున్నారు. ఏంపీడీవో, తహశీల్దార్ తదితర అధికారులు పాల్గొన్న ఈ సభ ప్రారంభమైన వెంటనే రైతులందరూ ఒక్కసారిగా వేదికను ముట్టడించి అధికారులను నిలదీశారు. విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళతామని, భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు కృషిచేస్తామని అధికారులు చెప్పినా రైతులు శాంచింతలేదు. తాము నష్టపోయిన వేరుశెనగ, మొక్కజొన్న, వరి పంటలకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని వారు నిలదీశారు. దాంతో సభ రాసాభాసగా మారింది. -
పట్టిసీమను సంకల్పంతో పూర్తి చేశాం
-
జన్మభూమి పై వామపక్షాల నిరసన
-
పింఛన్ కోసం మంచంపై తెచ్చారు
ప్రకాశం జిల్లా: వృద్ధాప్యంలో ఆసరాగా ఉన్న పింఛన్‌ను రేషన్ కార్డు లేదన్న సాకుతో రద్దు చేశారు. కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోవడంతో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభకు ఓ వృద్ధుడిని మంచం మీద తీసుకొచ్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన అక్కిదాసరి ప్రభుదాసు(60)కు భార్యాబిడ్డలు ఎవరూ లేరు. దూరపు బంధువుల దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.200 పింఛన్ తీసుకున్నాడు. ప్రభుత్వం మారడంతో రేషన్‌కార్డు లేదన్న సాకుతో అతని పింఛన్ రద్దు చేశారు. అప్పటి నుంచి కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న అధికారులు కనికరించలేదు. బుధవారం జన్మభూమి గ్రామసభ జరుగుతుందని తెలుసుకున్న ప్రభుదాసు బంధువులు అతడిని మంచం మీదనే గ్రామసభకు తీసుకొచ్చారు. అతని పరిస్థితిని అధికారులకు వివరించారు. ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికెట్ ఉందని పింఛన్ ఇవ్వాలని చేతులు జోడించి ప్రభుదాసు అధికారులను వేడుకున్నాడు. అతని పరిస్థితి తెలుసుకున్న తహశీల్దార్ జ్వాలా నరసింహం రేషన్‌కార్డు మంజూరు చేసి పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుదాసుని మంచంపై గ్రామసభకు తీసుకురావడానికి కారణమైన అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జన్మభూమిని అడ్డుకున్న గండేపల్లి గ్రామస్తులు
-
తెలుగు తమ్ముళ్లపై వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం
-
జన్మభూమి కార్యక్రమంలో రసాభాస
-
విశాఖ 'జన్మభూమి'లో పోలీసుల అత్యుత్సాహం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని మధురవాడ జన్మభూమి సభలో సోమవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధురవాడ పీహెచ్సీ అభివృద్ధి, జూనియర్ కళాశాల ఏర్పాటుపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు సీపీఎం కార్యకర్తలు వెళ్లారు. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. -
తెలుగు తమ్ముళ్లపై వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం హావల్గి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్యక్రమంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యకర్తలే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జన్మభూమి కార్యక్రమాన్ని వై. విశ్వేశ్వేర్‌రెడ్డి బహిష్కరించారు. -
జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు..
-
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
-
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
చిత్తూరుజిల్లా: నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
జన్మభూమిలో మహిళ ఆత్మహత్యాయత్నం
-
పండుటాకుల పడిగాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపా ను బీభత్సం సృష్టించింది. వ్యవస్థలు కుప్పుకూలిపోయాయి. ఉపాధి రంగాలన్నీ దాదాపు మూ సుకుపోయాయి. కార్మికులకు ఉపాధిలేక, కూలీ లకు పనులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల గడవడం కష్టంగా తయారైంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకరిపై ఆధారపడి బతికే వారందరికీ కాసింత భరోసా ఇచ్చే పింఛను కాస్త ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జన్మభూమితో లింకు పెట్టి నిలిపేసింది. ఉపాధి లేక ఇంటి పెద్ద దిక్కు, పింఛను రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూటగడవక, కనీసం మం దులు కొనుక్కునేందుకు సొమ్ములేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈ వయసులో తమకెందుకీ ఇబ్బందులని గగ్గోలు పెడుతున్నారు. కొన్నాళ్లు పింఛన్ల సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. మరికొన్ని రోజులుజన్మభూమిలో పంపిణీ చేద్దామని మెలిక పెట్టింది. ఇంతలోనే అనర్హుల పేరుతో 35 వేల మంది పింఛన్లు తీసేసింది. మరో 26,500మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ జరగలేదని గాలిలో ఉంచింది. దీంతో 2 లక్షల 17 వేల 500మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. జన్మభూమిలో పంపిణీ చేస్తామని ఆర్భాటం చేసింది. మొత్తానికి ఈ నెల 11వ తేదీ వరకు 64 వేల మందికి జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఇంతలో హుదూద్ తుపాను ముంచెత్తి జిల్లాను కకావికలం చేసింది. జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగతా 1,47,500 మందికి నేటికీ పింఛన్లు అందలేదు. ఇప్పుడు వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జన్మభూమిలో నేతల చేతుల మీదుగా ఇచ్చి మెప్పు పొందాలని ప్రయత్నించి, చివరికీ తమను అవస్థలకు గురిచేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎప్పుడూ పంపిణీ చేసినట్టు ఐదు తేదీలోగా ఇచ్చేసి ఉంటే తుపాను కష్టకాలంలో కాసింత ఉపశమనం కలిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి నిర్వహించేదెప్పుడు, తమకు పింఛను ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగితే తప్ప తమకు పింఛను వచ్చేటట్టు లేదని ఆందోళన చెందుతున్నారు. జాబితా నుంచి తొలగింపునకు గురైన పింఛనుదారులు, ఆధార్ సీడింగ్ లేదని గాలిలో పెట్టిన లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షతో అన్యాయంగా తీసేసిన తాము అభ్యంతరాలు పెట్టుకున్నా ఇంతవరకు అతీగతి లేదని, వాటిని పరిశీలించి పరిష్కరించేదెప్పుడు? తమకు న్యాయం జరిగేదెప్పుడని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారి పరిస్థితీ అంతే. ఇప్పుడు ఆధార్ కేంద్రాలు తెరిచే అవకాశం లేదని, తమకు సీడింగ్ అయ్యేదెప్పుడని, అంతా పూర్తయి పింఛను వచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిర్వాకంతో తమ ఇబ్బందులొచ్చాయని వారు మండిపడుతున్నారు. -
రూ.500 కోట్ల నష్టం!
తుపాను దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టం రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత అత్యధికంగా విద్యుత్ శాఖకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. హుదూద్ తుపానుకు విశాఖ నగరం దారుణంగా దెబ్బతినగా.. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా నష్టపోయింది. జిల్లాలో 300 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో కూడా జన్మభూమి కార్యక్రమం రద్దు చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి విశాఖ నుంచే సీఎం అధికారిక కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఉద్రిక్తతల నడుమ 'జన్మభూమి' వాయిదా
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావు పేటలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్లెక్సీలు ఉంచడంపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలను తొలగించాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు తొలిగించమని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ప్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నతాధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. దాంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మరింది. జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. -
వంద సభలు.. నిండా సమస్యలు
ఏలూరు : జిల్లాలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు గ్రామ సభలు మంగళవారం నాటికి వందచోట్ల పూర్తయ్యూరుు. వివిధ సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల వర్తింపు కోరుతూ ఇప్పటివరకూ 27,487 అర్జీలు అందాయి. వీటిలో ఏ ఒక్క దానికి పరిష్కారం దొరకలేదు. ప్రజలిచ్చిన అర్జీల వివరాలను కేటగిరీల వారీగా ఆన్లైన్లో పొందుపర్చాలని అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 78 గ్రామాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 22 సభలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 13,403 వినతి పత్రాలు అందాయన్నారు. ఇప్పటివరకూ 256 వైద్య శిబిరాలు నిర్వహించి, 18,636 మందికి వైద్య సేవలందించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 28,884 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.2 కోట్ల 71 లక్షల 97 వేల నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రసంగాలకే పెద్దపీట ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో చేపట్టిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారుు. ప్రజలకేదో చేశామని చెప్పుకునేందుకు అన్నట్టుగా పింఛన్లు పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో జన్మభూమి కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోం దని, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ప్రజాప్రతినిధులు వీధుల్లో తిరిగి అక్కడి సమస్యలను తెలుసుకోవడంతోపాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఊళ్లను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు చేపడుతున్న దాఖలాలు కానరావడం లేదు. మొదటి రోజు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు చేతబట్టి మొక్కుబడిగా వీధులను ఊడ్చారు. మరోవైపు గ్రామసభ వేదికలపై మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్షమై ప్రసంగాలు ఇస్తూ విలువైన సమయూన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారుు. ఏలూరు నగరంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు వేదికలెక్కి ప్రసంగించారు. కాగా ఈ సభల్లో ఏర్పాటు చేసిన వైద్య, పశువైద్య శిబిరాలకు ఆదరణ కరువైంది. సమస్యలపై నిలదీత నాలుగో రోజు జన్మభూమి సభల్లో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీ శారు. లింగపాలెం మండలం కలరాయనగూడెంలో రోడ్లు, డ్రెయిన్లు బాగోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ గుత్తా పెదబాబు కల్పించుకుని వారిని వారించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెంలో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు హాజరు కాగా, విద్యుత్ సమస్యపై గ్రామస్తులు నిలదీశారు. యాదవోలు సభలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం కోసం రైతులు బ్యాంకులకు వెళ్తుంటే దొంగల్లా చూస్తున్నారని వాపోయూరు. వెంటనే పూర్తిస్థారుులో రుణాలు మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి గ్రామసభలో తమ పింఛన్లు ఎందుకు నిలుపుదల చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆచంట మండలంలోని ఆచంట, శేషమ్మ చెరువు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ దృష్టికి అరటి రైతుల డిమాండ్ దెందులూరు మండలం సోమవరప్పాడులో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అరటి రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయూలన్న డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఉంగుటూరు మండలం గోపాలపురం, గోకవరం గ్రామ సభల్లో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం, దూబచర్ల గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నిడదవోలు నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవం, చాగల్లు మండలం గౌరీపల్లి గ్రామసభల్లో ఎమ్మెల్యే కేఎస్ జవ హర్, మొగల్తూరు మండలం కే పీపాలెం సౌత్, నార్త్, నరసాపురం పట్టణంలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొయ్యలగూడెం మండలం సీతంపేట సభలో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జన్మభూమి కాదు కర్మభూమి
కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ముంపు మండలాల ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కుక్కునూరు ప్రాథమిక పాఠశాలలో సోమవారం తహసీల్దార్ సుమతి అధ్యక్షతన ‘జన్మభూమి- మాఊరు’ కార్యకమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం నిర్మాణం పేరుతో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్న పాలకులు ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఏపీలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు ఏమీ లేవన్నారు. వరదలతో నష్టపోయిన పంటలను వ్యవసాయాధికారులు ఇంతవరకు ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రబీ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పింఛన్లు ఎప్పుడు ఇస్తారు... ? వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రత్యేకాధికారిని ప్రశ్నిం చారు. విభజన కారణంగా ముంపు మండలాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని రెం డు రోజుల్లో పింఛన్ డబ్బులను చెల్లిస్తామని ప్రత్యేకాధికారి సమాధానమిచ్చా రు. కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుజాత, ఉపసర్పంచ్ దండు నారాయణరాజు, సీపీఎం మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య, సీపీఐ(ఎంఎల్)నాయకులు ఎస్కె.గౌస్, బాసినేని సత్యనారాయణ. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, మాదిరాజు వెంకన్నబాబు, రావు వినోద్, రాయి రవీందర్, నకిరకంటి నరసింహారావు పాల్గొన్నారు. వంద రోజుల పాలనలో ఏమి సాధించారు..? దమ్మపేట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు తమ వంద రోజు ల పాలనలో ఏమి సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మం దలపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్టాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్ప డి వంద రోజులు గ డిచినా ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న బాధితులకు పరి హారం చెల్లించే విషయంపై ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కనీసం ఆహ్వానం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు నకిలీ నక్సలైట్లను వెంట బెట్టుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, పాకనాటి శ్రీనివాస్, వాల్మీకి రాంబాబు పాల్గొన్నారు. -
ఒక గ్రామం.. రెండు సభలు!
జన్మభూమి గ్రామ సభలు గ్రామానికొకటి చొప్పున జరగాలి.. దానికి సర్పంచ్ నేతృత్వం వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.కానీ కొన్ని గ్రామాల్లో జరుగుతున్న తంతు వేరేగా ఉంది..తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రూపొం దించిన మార్గదర్శకాలనే టీడీపీ నేతలు కాలదన్నుతున్నారు. టీడీపీ సర్పంచులు లేని చోట్ల తమ పెత్తనం నిరూపించుకునేందుకు పోటీ గ్రామ సభలు నిర్వహిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ఏ సభకు వెళ్లాలో తెలియక ఇటు ప్రజలు.. అటు అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. సోమవారం దుగ్గుపురం గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది. హిరమండలం: హిరమండలం మండలం దుగ్గుపురం గ్రామంలో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామ సభ జరగాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఆర్.మోహనరావు ఈ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు సభ ప్రారంభమైంది. అయితే అదే సమయంలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప సర్పంచ్ వర్గీయులు దీనికి పోటీగా స్థానిక పాఠశాల వద్ద మరో సభ నిర్వహించారు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు రెండు సభలకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఐటీడీఏ పీవో ఆగ్రహం అదే సమయంలో ఐటీడీపీ పీవో సత్యనారాయణ గ్రామ సభ జరుగుతున్న తీరు పరిశీలించేందుకు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ అధికారులు పెద్దగా కనిపించకపోవడంతో విషయమేమిటని ఆరా తీశారు. పాఠశాల వద్ద నిర్వహిస్తున్న మరో జన్మభూమి సభకు వెళ్లారని సర్పంచ్, స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అలా ఎందుకు జరిగిందని పీవో ప్రశ్నించారు. ఇంతలోనే ఎంపీడీవో కుమారస్వామి అక్కడికి వచ్చారు. గ్రామ సభలో ఉండకుండా ఎక్కడికి వెళ్లారని పీవో ప్రశ్నించగా గ్రామ పరిశీలనకు వెళ్లానని ఆయన సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహం చెందిన పీవో సాయంత్రం వరకు పంచాయతీ కార్యాలయం వద్దే ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించారు. కాగా ఈ పరిస్థితికి అధికారుల వైఖరే కారణమని ఇరుపార్టీల వారు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే గ్రామ సభ జరగాలని, అయితే వేరే చోట సభ ఏర్పాటు చేయాలని తమను అధికారులు కోరడం వల్లే వివాదం ఏర్పడిందని ఉప సర్పంచ్ పి.శ్రీనివాసరావు చెప్పారు. రెండు చోట్ల సమావేశాలు జరగడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఇబ్బం దులకు గురయ్యారు. గ్రామస్తులు పార్టీలవారీగా విడిపోయి.. రెండు సభలకు వెళ్లడంతో పార్టీ విభేదాలను రెచ్చగొట్టినట్లు అయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఏ సభకు వెళ్లా లో.. ఎక్కడ భోజనం చేయాలో అర్థం కాక.. చివరికి రెండింటికీ డుమ్మా కొట్టి పస్తులున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం:ఎమ్మెల్యే కలమట దుగ్గుపురంలో నిబంధనలకు విరుద్ధంగా రెండుచోట్ల జన్మభూమి-మాఊరు సభలు నిర్వహించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రూపొందిం చిన నిబంధనలను ఆ పార్టీవారే ధిక్కరించడం దారుణమని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
గుంటూరు జిల్లా జన్మభూమిలో గందరగోళం
-
జన్మభూమికి కొత్త పాటలు సిద్ధం!
హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం కోసం సరికొత్తగా నాలుగు పాటలను టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ పాటలను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరాం రచించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. గతంలో జన్మభూమి టైటిల్ సాంగ్‌ను వందేమాతం శ్రీనివాస్ అందించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జన్మభూమి - మన ఊరు' పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. తమ సొంత గ్రామానికి, ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన ప్రకటనలో వెల్లడించారు. -
చంద్రబాబుకు రఘువీరా లేఖ
హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల అధ్యక్షతనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రుణమాఫీ ద్వారా లబ్ది పొందే రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికుల వివరాలు గ్రామస్థాయిలో వెల్లడించాలని ఆయన సూచించారు. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, రేషన్‌షాపు డీలర్లు, అంగన్వాడీ, ఔట్సోర్సింగ్, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో అర్హులకు రేషన్ కార్డులు తొలగించడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తో లింక్ చేయొద్దని రఘువీరా రెడ్డి కోరారు. -
స్పష్టత లేని కార్యక్రమాలెందుకు?
బాబు కార్యక్రమాలపై వైఎస్సార్ సీపీ సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెడుతున్న జన్మభూమి కార్యక్రమం ఆయన కేబినెట్లోని మంత్రులకే అర్థం కావడంలేదని, అవి ప్రజలకేమి అర్థమవుతాయని, వాటి వల్ల కలిగే ప్రయోజనమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. శనివారం డ్వాక్రా మహిళలతో బాబు ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టత కోరడం, వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం చూస్తే వాటిపై ప్రభుత్వంలోని పెద్దలకే స్పష్టత లేదని తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఉప్పులేటి కల్పన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా ఒక దళిత మంత్రి పైనే నోరు పారేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలపై ఆయనకే స్పష్టత లేదని అర్థమవుతుంది’ అని ఎద్దేవా చేశారు.