విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని మధురవాడ జన్మభూమి సభలో సోమవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధురవాడ పీహెచ్‌సీ అభివృద్ధి, జూనియర్ కళాశాల ఏర్పాటుపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం ఇచ్చేందుకు సీపీఎం కార్యకర్తలు వెళ్లారు. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.