తుపాను దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టం రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత అత్యధికంగా విద్యుత్ శాఖకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. హుదూద్ తుపానుకు విశాఖ నగరం దారుణంగా దెబ్బతినగా.. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా నష్టపోయింది. జిల్లాలో 300 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో కూడా జన్మభూమి కార్యక్రమం రద్దు చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి విశాఖ నుంచే సీఎం అధికారిక కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
రూ.500 కోట్ల నష్టం!
Published Mon, Oct 13 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement