
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఆకివీడు మండలం కుప్పనపూడిగ్రామంలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజాపతినిధులపై సొంత పార్టీ మహిళా కార్యకర్తలే విరుచుపట్టారు. 2015లో ఇల్లు కట్టుకున్న తమకు రూ. 60 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారని గగ్గోలు పెట్టారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేస్తే తాను మాట్లాడుతానని ఓ మహిళా కార్యకర్త అన్నారు. తమకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యే శివ ఎదురుగా టీడీపీ సభ్యత్వ పుస్తకాలను చింపేస్తామని హెచ్చరించారు. దివంగత నేత వైఎస్సార్‌కు అన్యాయం చేసి టీడీపీకి మద్దతు తెలిపినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment