
సాక్షి, అనంతపురం : జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త విజయభాస్కర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు శ్రీదేవి, విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు శ్రీదేవి, విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడి, దూషించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.