పులివెందుల జన్మభూమి సభలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. జన్మభూమి కార్యాక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడకుండా టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఓ దశలో ఆయన చేతిలోని మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎంపీ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ సీఎం కూడా అదే పంథాను అనుసరించారు. ఏయ్....మైక్ తీసుకో... అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడకుండా మైక్ కట్ చేయించారు. ఎవరేం చేశారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు, చెప్పదలుచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.