అనంతపురం: అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం హావల్గి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్యక్రమంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యకర్తలే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దాంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జన్మభూమి కార్యక్రమాన్ని వై. విశ్వేశ్వేర్‌రెడ్డి బహిష్కరించారు.